మధురమైన జ్ఞాపకం

మధురమైన జ్ఞాపకం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : ఎం.వి.చంద్రశేఖరరావు

  తపస్వి మనోహరంలో “జీవితంలో మరుపురాని మధురమైన జ్ఞాపకం” అంశం చూడగానే నా జీవితంలో అలాంటి ఙ్ఞాపకం ఏంటబ్బా అని నా మస్తిష్కం ఆలోచించటం మొదలుపెట్టింది. నిజంగా నిఖిల లోకం హర్షించే అందరి జీవితాలలో సంభవించే మరుపురాని మధురమైన రోజు అది. అది ఏంటంటే ఆశ, దోశ, అప్పడం, వడ,అంత తేలికగా చెప్తానా! ఏంటి? తల్లిదండ్రులు తమపిల్లలను అల్లారుముద్దుగా పెంచుతారు. తాము ఎన్నోత్యాగాలను చేసి, తమ పిల్లలకు, విద్యాబుధ్ధులు నేర్పుతారు. తమ సంతానం ప్రయోజకులు అయినప్పుడే ఆ తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుంది. “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలగదు” అని సుమతీశతక పద్యము కూడా ఉంది. విజయవాడలో నేను రైల్వేలో 1980లో ఉద్యోగంలో చేరినప్పుడు. నా మొట్టమొదటి జీతం అందుకోంగానే చేసినపని లక్ష్మీజనరల్ బట్టల షాపుకెళ్ళి మా నాన్నగారికి ఆరెంజ్ కలర్ షర్ట్, బ్లూ ప్యాంట్, మా అమ్మగారికి ఎల్లో కలర్ శారీ కొన్నాను. మా తల్లిదండ్రులకు అవి ఇచ్చి “నా ప్రధమ సంపాదన” అని చెప్పాను. వాటిని చూసి వాళ్ళు ఎంతో సంతోషించారు.
“ఓ నా భారతీయ యువతరమా, నవతరమా తల్లిదండ్రులున్న దైవసన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగుబాల” వారిని గౌరవించండీ వారికి సంతోషం కలిగించేలా ప్రవర్తించండీ!
“జననీజన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ”.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!