మనసులోని మాటలు

మనసులోని మాటలు

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

చూస్తూ హైవే మీద జంక్షన్ దాటి ఎటువైపు వెళ్ళాలి అని ఆలోచన. సూర్యుడు కూడా కిరణాలతో సహాయం వచ్చాడు.
“తూర్పు వైపు తిరిగితే తోటలు ఉంటాయి అను సుగంధి చెప్పింది”. ప్రమోద్ బోటనీలో పరిశోధన చేస్తున్నాడు. క్లాస్మేట్ సుగంధి చాలా బాగా చురుకైన తెలివైనది. వాసూర్యోదయాన్ని ళ్ల నాన్నకి నర్సరీలు ఉన్నాయి కడియములో, అందుకని కొత్త మొక్కలు వచ్చాయి చూడవచ్చురా అని ఫోన్ చేసింది. పి.జి అవగానే సుగంధి చదువు ఆపి, కడియం వెళ్లిపోయింది. కానీ ఆమే మాటలు, చేతలు చదువు లో తెలివి, మనసు చుట్టూ ఒక వైఫైలా ఉండి పోయాయి.
చదువుకునే రోజుల్లో అంతా మామూలుగానే ఉండేది. ఎప్పుడైతే దూరం అయిందో అప్పుడు ఒకరి విలువ ఇంకొకరికి తెలిసింది. “చదువుకి సార్థకత కావాలి అనుకున్నది. సాధించడానికి ఇంట్లో ఒప్పుకోవాలి అనేది”. ప్రమోద్ మాత్రం వెంటనే పరిశోధనలుకి అప్లై చేసి టెస్ట్ పాస్ అయ్యాడు. మెరిట్ స్కాలర్షిప్కూడావస్తుంది.
ప్రతి డౌట్ కి సుగంధి సమాధానం చెప్పేది. ప్రమోద్ తనను ప్రేమిస్తున్నాడా! లేక తెలియని విషయాలు అడుగుతున్నాడా? సందేహంలో ఉన్నది. సరే మా ఊరికి రా ప్రమోద్ ఒకసారి అన్ని చూసినట్లు ఉంటుంది. “నీ పెళ్లి విషయం ఏమైనది?”
“అది అంత తొందరగా కుదురుతుంది అని ఎలా అనుకున్నావ్? అనుకున్నవి..అనుకున్నట్లు జరగవు కదా!”
“ఎవరికి ఎవరు విధి నిర్ణయమో వారికి జరుగు తుంది”. “వస్తున్నావు కదా! అన్ని చుద్దువు కానీ”
“సరే మీ ఊరి జంక్షన్ లో ఉన్నాను”. ఇంకా లోపలికి రావాలి, కుడి చెయ్యి వైపు దారి వెంట వస్తె చక్కని చామంతి పూలతో, లిల్లీ పూలతో కూడిన తోట స్వాగతం చెపుతుంది.
“ఎంతో సుగంధ పరిమళాలు దారులకు పొన్న చెట్లు ఉంటాయి. మరో ప్రక్క అగ్ని పూలు విరగ పూసి ఉంటాయి. ప్రకృతి రమ్యమే కవికీ నిజమైన ఊపిరి అంటూ నవ్వింది.”
“నువ్వు కవయిత్రి ఎప్పుడు అయ్యావు? “నేను పుట్టకతోనే కవయిత్రిని అందుకే ఇంప్రూవ్ చేసుకోవడానికి బోటని చదివాను.” ఇంక చదివింది చాలు పెళ్లి చేసుకుని మాకు మనుమలని ఇవ్వు అని నాన్న చెప్పారు.”
“నువ్వు పెళ్లి చేసుకుంటే నా పరిశోధన ఏమి కాను నాకు యూనివర్సిటీ గైడ్ కంటే ఎక్కవ సమాచారం నీ దగ్గర ఉన్నది”. “మరి అందుకేగా ఇంత దూరం వచ్చావు” అంటూ మళ్ళీ నవ్వింది. ముత్యాల్లాంటి పలువరస మరోసారి మెరిసింది.
అబ్బా! “నీ మంచి ముత్యాలు ఇప్పుడు మంచు ముత్యాలుగా కరిగి పోయింది”. “నా మనసులో నీ పలువరస సరాలు అన్ని దండగ అల్లి నా మెడలో వేసుకుని నీ నవ్వులు వింటున్నాను. అప్పట్లో యూనివర్సిటీ రోజులు క్షణానికీ క్షణానికీ బేధం లేకుండా గడిచింది.” “ఇప్పుడు అసలు క్షణం గడవడం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం అవుతోంది.”
“ఆహా ఇప్పటికీ తెలిసిందా!” నేను మాత్రం మా నాన్న చెప్పిన వాడిని చేసుకోవాలి అని చెప్పాను.
నువు అప్పుడు మాట్లాడలేదు. సరే నీ జీవిత ఎదుగుదల పరుగులో ఉన్నావు అని ఊరుకున్నాను. “నా చదువు అయింది ఇంక హాస్టల్ లో ఉండటం కుదరదు. ఉద్యోగం చెయ్యనివ్వరు అందుకే వచ్చేసాను.” ఇప్పుడు పూల తోటల బిజినెస్ బాగుంది. నాన్నకి ఏకంగా పది హెను ఎకరాలు ఉన్నాయి. దాంతో ఇంక అన్నయ్య కూడా జాబ్ చెయ్యకుండా పూర్తి బిజినెస్ చేస్తున్నాడు. నాకు అందులో మెళుకువలు బాగా తెలుసు. ఎవరైనా అగ్రీ కల్చర్ బి.ఎ.సి చదివిన వాడిని వెతుక్కుంటే చాలు అన్నది.”
“అయ్యో అలాగా! నేను నిన్ను వదులుకోలేను. నువ్వు ఆ సంబంధాలు చేసుకోవద్దు. మీ అన్నయ్యను, నాన్నను ఒప్పించి మనం పెళ్లి చేసుకోవాలి”.
“నువ్వు వచ్చి చెప్పి వారి మన్ననలు పోంది పెళ్లి చేసుకో అన్నది.” ఆహ ఇప్పుడు నువ్వు చెప్పిన దారికి వచ్చాను. పొన్న చెట్టు నుంచి రాలిన కాడ మల్లె పూలు మంచి సువాసనగా స్వాగతం పలుకుతున్నాయి. ఇంకొంచెం ముందుకు వస్తె మా స్వాగతం బోర్డ్ తోట మొదటిలో ఉంటుంది.
అలా లోపలికి వస్తుంటే దానికి రెండు వైపులా కృష్ణ బంతి, సీమ బంతి, ఎర్ర బంతి, మిరప బంతి కుంకుమ ఆరబెట్టి నట్లు ఉంటుంది.
“అబ్బా ఎంత బా పెంచారు. బాగుంది సుగంధి అందుకే పూర్వ కాలం వారు పూల తోటలో కూర్చుని కవిత్వం చెప్పేవారు”. “మరి సరోజినీ నాయుడు కవిత్వంలో సర్వి చెట్టు కొమ్మల సవ్వడి గురుంచి గాజుల అమ్మకం గురించి ఎంత బాగా వ్రాశారు”. అవును నువ్వు ఈ తరం సరోజినీ నాయుడువి అన్నాడు.”
“ఎవరో గూర్ఖా మాదిరి వ్యక్తి కారు ఆపి ఎవరూ కావాలి? అని అడిగాడు. దానికి జవాబుగా సుగంధి మేడమ్ కోసం అన్నాడు”. ఆవిడ ఇంకా లోపలికి వెడితే గానీ కనిపించేటట్టులేరు. ఇవ్వాళ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇల్లంతా బాగా అలంకరించారు. మరి ఆవిడ స్నేహితులు ఎవరో మాకు తెలియదు. వంట మనిషి చెప్పింది ఆవిడ ఈ రోజు స్పెషల్స్ చేశారని చెప్పింది. ఆ గెస్ట్ నేనే ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అన్నాడు.
ఆహ! ఆ కనిపించే మేడ. అంటే ఇక్కడ ఎవరిది వారికి ఉంటుందా! అని కాదు పగలు అంతా పువ్వులు, కొత్త మనుష్యులు ఉంటారు వారికి భోజనం ఉంటుంది. కనకాంబరాలు సిజన్లో అయితే రాత్రి డ్యూటీ కూడా ఉంటుంది. దండలు కడతారు మూర రెండు వందలు అమ్మకానికి ఉంది. అంత రేటు అమ్ముతోంది అందుకే ఇప్పుడు పువ్వుల బిజినెస్ బాగుంది. మల్లెలు మూర నూట అరవై, బోగడ బంతి మూర నూటఎనబై ఉంది. ఇంకా ఇవి సిటీకి పంపితే ఇంకా రేటు ఎక్కువ ఉంటుంది.
“దండలు కట్టేవారు వేరే ఉన్నారు. వాళ్ళు వచ్చి కట్టే విధానం చెపుతారు. ఇందులో సుగంధి మేడమ్ మంచి ఎక్స్పర్ట్ అంతే కాదు మంచి సున్నిత మనస్తత్వ కూడా. సరే సర్ ఇంకా లోపలికి వెళ్ళాలి. అక్కడ అన్ని గులాబీ పూలు కుండీలు అలంకరించి ఉన్నాయి. “అక్కడ లేపాక్షి ఉయ్యాల ఉంటుంది. మనీ ప్లాంట్ ఎక్కించిన ఆర్చి ఉంటుంది. ఇవన్నీ పదే పదే, మళ్ళి తలచుకుంటూ స్లోగ డ్రైవ్ చేస్తున్నాడు.
“ఒక్కొక్క మొక్క నుంచి వచ్చే సువాసన ముక్కు పుటలుకి మత్తుగా తాకుతున్నాయి. ఇలాంటి నిజమైన సుందర ప్రకృతిలో ఉంటే వద్దన్నా ప్రేమ పుడుతుంది. సున్నిత భావం వస్తుంది. మంచి ప్రేమ పుట్టడానికి కావాల్సిన పరిస్థితులు కూడా ఉండాలి. ఒక రోజు ఆనందంగా ఉండాలి అనే రాజు అవ్వాలి.
కొంత కాలం ఆనందంగా ఉండాలి అంటే మంచి కవిత్వం చదవాలి.” జీవిత కాలం ఆనందంగా ఉండాలి అంటే తోటమాలి అవ్వాలి. అని ఒక కవి అన్నారు ఇది చూస్తే నిజమే అని పిస్తోంది. ప్రమోద్ కారు ఆగే టప్పటికి మళ్ళీ డ్రెస్ వేసుకున్న వ్యక్తి వచ్చి డోర్ తీసి పట్టుకున్నాడు. రండి..రండి ప్రమోద్ అంటూ ఒక యువకుడు వచ్చాడు ఎవరా? అనే ప్రశ్నతో ఈర్ష్య గా చూసాడు. అతని దగ్గర మొగలి సెంట్ వాసన గుప్పున వచ్చింది. లోపలి నుంచి సుగంధి “హాయ్ ప్రమోద్ అంటూ వచ్చింది”.
“అబ్బా! ప్రయాణం అంతా ఒక ఎత్తు, మీ గార్డెన్ లో ప్రయాణం ఒక ఎత్తూ వహవా అద్భుతం మీరు చాలా అదృష్టవంతులు” అన్నాడు. ఎవరు ఈ కొత్త వ్యక్తి అని చూసాడు. ఏమి చెప్పకుండానే లోపలికి తీసుకు వెళ్ళింది. ఇప్పటికే ఆలస్యం అయ్యింది.
చేతులు కాళ్ళు కడుక్కో అంటు వాష్ రూమ్ చూపించింది. ఈ లోగా ఇడ్లీ, గారే హాట్ బాక్స్ తెచ్చి రాములమ్మ పెట్టింది. ఎర్ర చెట్నీ, తెల్ల చెట్నీ సాంబారు, కారం పొడి, అన్ని భేషుగా ఉన్నాయి.
“నాన్న గారు తినే తోటకు వెళ్ళారు. మీరు తినండి అన్నది తల్లి సుభద్ర.” అలాగే అమ్మ అన్నది. ప్రమోద్ కి మాత్రం. ఆ కొత్త వ్యక్తి గురించి ఆత్రుతగా ఉన్నది.
సుగంధి మాత్రం మౌనంగా ఉన్నది. ఆ వ్యక్తి టిఫిన్ తిని మళ్ళీ కలుద్దాం అంటు ప్రమోద్ కి చెప్పి వెళ్ళాడు. “ఎవరు అతను?”. “మా చుట్టాలు విదేశాల నుంచి వచ్చాడు”. “పెళ్లి కొడుకు అవునా?” పెళ్లి కాని వాళ్ళు అందరూ పెళ్లి కొడుకులే కదా! మా నాన్న సొమ్ము ఎవరికి ఋణం ఉందో వాళ్లే భర్త అవుతాడు అని నవ్వింది”.
“నో.. నో నేను నిన్ను వదులుకోలేను సుగంధి అన్నాడు.” “అయితే ఆ మాట మా నాన్నకు చెప్పు అన్నది.” “మరి నీ పరిశోధన ఏమయింది?
మూడేళ్ల వరకు కుదరదు అన్నావు”. “మరి మా ఇంట్లో పెళ్లి చెయ్యాలని కంగారు పడుతున్నారు.”
“సరే నేను మా ఇంట్లో చెప్పి అందరినీ ఒప్పించగలను. “మీ నాన్న గారిని నువ్వు ఒప్పించు అన్నాడు.”
“మా ఇంట్లో ఇష్టమే కనుక నిన్ను రమ్మన్నాను. ప్రేమ మనసులో దాచుకుంటే ఎలా?” మనసులోని మర్మమును బాగా తెలుసుకో అనే త్యాగరాజ కీర్తన పాడింది.” “ఓహ్ ప్రతి విషయమూ కీర్తనలో చెపుతున్నావా!?”
“ప్రేమ ఎక్కడ పుడుతుంది అన్నదీ తెలియదు కానీ అది మానవ మేధస్సును అందుకొనే ఒక రసాయన చర్య.” మనిషి జీవిత నాటకంలో పుట్టుట, గిట్టుట నిజము అన్న శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన అర్థం తెలిసికొని జీవితాన్ని ప్రేమతో నింపి ఆనందమయము చేసుకుంటే అంతకు మించిన అద్భుతం మరొకటి లేదు అని గ్రహిస్తే అంతకన్న ఏముంది.
సుగంధి తల్లి, తండ్రి అందరూ ఆనందించారు. ఇప్పటికైనా ఒకరి ప్రేమ, ఇంకొకళ్ళు తెలుసుకునీ ఆనందం పంచుకున్నారు. మాఘ మాసంలో అతి ఖరీదు మల్లెలు అయినా తోట వారిదే కదా! పచ్చి పూల మండపంలో సుగంధి, ప్రమోద్ బంధువుల మధ్య ప్రకృతి అందాలలోఒకటి అయ్యారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!