ప్రేమను బ్రతికించాలి

ప్రేమను బ్రతికించాలి

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : సుజాత కోకిల

సంధ్యాసమయంలో పక్షులు గూటికి చేరే సమయం, నీటి అలల శబ్దాలు వింతను గొలిపిస్తున్నాయి. ప్రకృతి పదహారణాల పడుచు పిల్లలా అందంగా సింగారించుకుంది. పున్నమి వెన్నెల కాంతులు విరజిమ్ముతున్నాయి.
ట్యాంక్ బండ్ దగ్గర వచ్చిపోయే జనాలతో సందడిగా ఉంది. తను ఒకతే ఒంటరిగా ఉంది. తినుబండారాలకు చాలా గిరాకీగా ఉంది.
పిల్లలు పెద్దలు అందరూ కొనుక్కుని తింటున్నారు.
“వేరుశెన కాయలు అంటూ తన దగ్గరగా వచ్చి తీసుకుంటారా మేడం అంటూ అడిగాడు”. పల్లీలబ్బాయి అతడి వైపు చూస్తూ “వద్దు” అంది.
“చాల బాగుంటాయి మేడం తీసుకోండి అన్నాడు” అతడు. “వద్దు..వద్దు” అంది లావణ్య. “మసాలా పల్లీలు చాలా బాగుంటాయి మేడం తీసుకోండి అన్నాడు మళ్ళీ” ‘పోనీలే అంతలా అడుగుతున్నాడు కదా!’ అనుకోని ఒక పది రూపాయల వేరుశెనకాయలు కొనుక్కుంది. ప్రజ్వల్ కోసం ఎదురుచూస్తూ తింటూ కూర్చుంది.
వేరుశనక్కాయలు అయిపోయాయి కానీ ప్రజ్వల్ ఇంకా రాలేదు. ‘ఏంటి ఈ మనిషి ఇంత టైం అయినా ఇంకా రాలేదు పంచ్ వాలిటి ఉండదే ఈయన గారికి ఏం మనిషి ఏంటో తనకు టైం కుదరనప్పుడు ఎందుకు రమ్మనాలి నాకేం పని పాట లేదనుకున్నాడా! ఏంటి? టైంపాస్ చేయడానికి వచ్చానా’ కోపాన్ని పండ్లబిగువన దాచుకొని వెళ్లడానికి లేచింది. అప్పుడే ప్రజ్వల్ “హాయ్ లావణ్య” అంటూ వచ్చాడు.
“ఏంటి ప్రజ్వల్ ఇంత లేటు చేశావు నీకోసం ఎంత సేపు నుండి వెయిట్ చేశానో తెలుసా?
“సారీ లావణ్య ఆఫీస్ నుండి ఇటే రావాలనుకున్న కానీ మధ్యలో కొద్దిగా పని ఉండి ఆలస్యమైంది ఏమనుకోకు ప్లీజ్” “చేసేది చేస్తారు ఇంకా సారిలు చెప్తారు. మధ్యలో ఇంకా సారీలు ఎందుకో” “అబ్బా ఇదంతా కోపమే అన్నాడు కొంటెగా ప్రజ్వల్”
ప్రజ్వల్ “వన్ అవర్ నుండి నీకోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఎంత బోర్ కొట్టిందో తెలుసా?అందరు నా వైపే చూస్తుంటే నాకు అదోలా అనిపించింది.”
“సారీ లావణ్య ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోవద్దు నీకోసం గుంజీలు తియ్యనా, చెంపలేసుకోనా కొంటెగా నవ్వుతూ ఉడికించాడు.” “అబ్బ చా అది జోకా నాకు నవ్వు రాలేదులే”.
“మీకేం మగమహారాజులు కారణాలు ఎన్నో చెబుతారు. మేము ఆడపిల్లలం ఎన్నో ఆలోచించాలి బయటకు ఒంటరిగా వచ్చినా భయమే ఎవరితో మాట్లాడిన భయమే”
చేయి పట్టుకొని “ఇలా రా అంటూ చెక్క బెంచ్ పై కూర్చోబెట్టి నా వైపు చూడు లావణ్య”. అంటూ! “నిజమే లావణ్య నీవన్నది కరెక్టే నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ నేను మాత్రం కావాలని లేట్ చేయలేదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నన్ను నమ్ము అన్నాడు ప్రజ్వల్ ”
“సరే కానీ ఇంతకు ఎందుకు రమ్మన్నావు చెప్పనేలేదు ప్రజ్వల్ “అని అడిగింది. మీ ఇంట్లో మన పెళ్లి గురించి చెప్పావా!” “ఏమన్నారు? మీ అమ్మానాన్న?” “లేదు ప్రజ్వల్ చెప్పాలంటే భయంగా ఉంది!” “భయం ఎందుకు? లావణ్య “మనం నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాం కదా! “ఇంకా భయం ఎందుకు?” “లేదు ప్రజ్వల్ నేను చెప్పాలంటే ఇంకా టైం పడుతుంది”. “ఇంకా వాళ్లతో చెప్పాలంటే నేను చాలా ప్రిపేర్ కావాలి?” “మనం ఇద్దరం స్థిరపడ్డాము మన కాళ్ళ మీద మనం నిలబడే శక్తి సామర్థ్యం మనకు ఉన్నాయి.” “మనం న్యాయంగానే అడుగుతున్నాం కదా!”
“మన ఇద్దరం ఇష్టపడడం నిజమే కానీ, తల్లిదండ్రులని ఎదిరించే ప్రేమ మనకు వద్దు. కొద్దిగా ఓపిగ్గా ఆలోచించు రెండు కుటుంబాలకు ఇబ్బంది పెట్టే పని మనం చేయొద్దు మనకోసం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. మనం వాళ్ళకి చేతికి వచ్చే టైములో వాళ్లకు దూరంగా వెళ్లిపోవడం వాళ్లకి మనశ్శాంతి లేకుండా చేయడం ఇరు కుటుంబాలకు మంచిది కాదు! “వాళ్లను కాదని మనం ప్రశాంతంగా ఎలా ఉంటాం?” మనపై పెట్టుకున్న ఆశలు వాళ్ళు ఏర్పరచుకున్న నమ్మకం వృధా చేయొద్దు? మన ప్రేమను బ్రతికించుకోవాలి? మన ప్రేమను రుజువు చేయాలంటే మన పెద్దలతో సంప్రదించి వాళ్ళ సమక్షంలోనే మనం పెళ్లి చేసుకోవాలి మన పెద్ద వాళ్లను ఒప్పించగలగాలి మనం బ్రతకడం కోసం వాళ్లని మనం ఇబ్బంది పెడతామా? అలా నాకు ఇష్టం లేదు”.
“నువ్వేమంటావ్ ప్రజ్వల్”. “మీరు ఓకే అని ఫిక్స్ చేశాక కాదంటే ఊరుకుంటారా మేడం!” “థ్యాంక్యూ ప్రజ్వల్ నా ప్రపోజల్ కి నువ్వు ఏమంటావోనని భయపడ్డాను”. “ఈరోజు ప్రేమికుల రోజు ప్రేమను బ్రతికిద్దాం మంచితనంతో సాధిద్దాం, మన తల్లిదండ్రులతో సంప్రదిద్దాం, ప్రేమ పై ఉన్న అపనమ్మాకాన్ని తొలగిద్దాం, మనపై పెట్టుకున్న నమ్మకాన్ని రుజువు చేద్దాం! బాగా బ్రతుకుతామనే నమ్మకాన్ని కుదిరించాలి మన తల్లిదండ్రులకు!” ప్రేమ అంటే నాలుగు రోజులు ఉండి, మళ్లీ విడిపోయే ప్రేమ కాదు జీవిత కాలం కలిసి ఉండేది.”
మళ్లీ మర్నాడు ప్రజ్వల్ తల్లిదండ్రులతో వచ్చాడు. తనని తను పరిచయం చేసుకుంటూ తన తల్లిదండ్రులను కూడా పరిచయం చేశాడు. ప్రజ్వల్ లావణ్య కూడా తల్లిదండ్రులకు ముందే చెప్పడంతో
నవ్వుతూ రమ్మని ఆప్యాయంగా కూర్చోమన్నారు లావణ్య తల్లిదండ్రులు కొంతసేపు నవ్వుతూ చమత్కారాలు చేసుకుంటూ రెండు కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు. “అవునండి పిల్లలు అంటే ఇలా ఉండాలి ఏ పిల్లలైనా ప్రేమ అనే పేరుతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు.” తొందరపాటు నిర్ణయాలతో పిల్లల జీవితాలు చెడిపోకూడదు.” ప్రతి తల్లిదండ్రులకు భయాలు ఉంటాయి.” లావణ్య, ప్రజ్వల్ పెండ్లి వైభవంగా జరిపించారు. సంతోషంగా ఉంటూ మీ ప్రేమను బ్రతికించుకోండి ప్రేమికులకు మీరు ఆదర్శంగా ఉండాలని దీవించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!