కసాయిమారేనా..?

కసాయి మారేనా..?

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

“ప్రేమ అంటే మనిషికి, మనిషికి మధ్య లేక, ఒక స్త్రీ, మగ మధ్యనో పుట్టెదే కాదు”. ఒక ప్రాణికి మరోక ప్రాణికి మధ్య కూడ పుట్టేది. అలాంటి ఒక మూగ జీవులను కూడ ప్రాణంగా ప్రేమించే ఒక ప్రేమ కథ!” అది మా ఊరికి చివర దానిని వాడ అని పిలుస్తారు అక్కడ ఒక కటిక వాడు వాడి పేరు వెంకయ్య, వాడి భార్య పేరు మంగతాయారు. వెంకయ్య రోజుకి జంతువులను వధించి మాంసం అమ్మే కులవృత్తి కావడంచేత వాడు ఒక దినం మేకలు, గొర్రెలు, పశువులనైనా అవలీలగా వధించకలిగేవాడు. ఇది వెంకయ్యకు రెండు తరాల నుంచి చేస్తున్న కులవృత్తి, అసలు వీళ్ళకు “దయా దాక్షణ్యమూ, కనికరము, అంతఃకరణ “ప్రేమ” అనేవి వానికి ఏకోశానా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే వెంకయ్య ఒక కసాయి వాడు.”
అయితే ఈ కసాయి వెంకయ్యకు లేక, లేక ఒక్క కూతురు పుట్టింది. ఆ పిల్ల అంబికా దేవికటాక్షం వల్ల పుట్టిందన్న నమ్మకంతో “అంబికా” అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. “ప్రేమ అంటే తెలియని కసాయి వెంకయ్యకు అంబికా పుట్టిన క్షణం నుంచి “ప్రేమ” అంటే ఏమిటో, అభిమానం అనేది ఎలా ఉంటుందో? వాడికి తెలిసి వచ్చింది. అంబికా అందంతో పాటు గుణంలో కూడ మంచిది. జాలిగుండె కలది, అంబికాని చూసి “ఆహా..! ఆ కసాయి వాడికి పుట్టాల్సిన అమ్మాయి కాదు. వాడికి అదృష్టం ఏమి అదృష్టం! అని లోకులు సంతోషించేవారు.” అంబికా ఎన్నడూ మాంసం నోట అసలు ముట్టేది కాదు, అది విని లోకులు అబ్బర పడేవాళ్ళు.
“ఒక రోజున కసాయి వెంకయ్య అంగడిలో ఉండగా! అదే సమయంలో ఒకరు ఒక ఆవుదూడ ను తోలుకొచ్చి అమ్మజూపారు. వాటిని చూసి, చూడడంతోనే అంబికా వారు కోరిన ధనమిచ్చి కొనుక్కోంది. సాయంత్రం కసాయి వెంకయ్య ఇంటికి వచ్చేసరికి అంబికా ఆవు, దూడతో ఆడుకోవటం చూచి ఆశ్చర్యపడ్డాడు. అంబికా మీద ప్రేమ కొద్ది వెంకయ్య ఏమి అనడు కనుకనే ఇప్పుడు ఏమి అనలేదు. కానీ ఆడుకొంటావున్న అంబికా తండ్రికి చూపించి. “ముచ్చటగా ఉన్నది చూడు ఈ ముద్దుగుమ్మ తువ్వాయి! దాని మూపురం చూడు గంగడోలు చూడు మెరిసిపోయే ఆ కన్నులు చూడు దాని అమాయకపు చూపులు చూడు. అంటూ దానిని “ప్రేమతో కౌగించుకోగా దూడవచ్చి అంబికాను ఒళ్ళు నాక జూచింది. అంబికా గబుక్కున “నా చిన్నారి గున్న!…. నేనంటే “ఎంత ప్రేమ నీకు.. ఎంత అభిమానమే “నువ్వెవరివో…నేను వారిని.. మనకు గల సంబంధం ఏమిటి? నాకు మనసు ఉండబెట్టలేదు. గదా! ఆ మాయదారి దేవుడు.. ఐనా.! నువ్వు చెప్పినమాట నాకు తెలిసిందిలే. నన్న ఎందుకు నాకుతున్నావో… అర్థం అయింది. అంటూ దాని మెడగట్టిగా చుట్టేసుకొని ముద్దులాడింది. అంబికా మాటలూ చేష్టలూ దూడతో పలికే పలుకులు కసాయి వెంకయ్య కి వింతగా అనిపించింది. దూడతో ఆడుతున్న అంబిక మళ్ళీ తండ్రిని చుట్టేసుకొని! నాన్న నా తువ్వాయి చూడు నన్ను పేరు పెట్టి “అంబా అని పిలుస్తారు. దానికి నా పేరు ఏలా!! తెలిసిందో..! నువ్వు చెప్పగలవా ? నానా అంది. వెంటనే అవును గాని నేనోక మాటంటాను.నీకు కోపంవస్తుందేమో! అన్నది.
“కసాయి వెంకయ్య కోపమెందుకు తల్లీ ఎప్పటీకీ రాదు”అంటూ అంబికా ను దగ్గరకు తీసుకున్నాడు. “మరైతే మిస మిస లాడే లేత, నవ నవ లాడే మూగ జీవులను విసుగూ విరామము లేకుండా చంపి, చంపి నీ చేతులు మైలపడీపోయినాయి, ఆ పాపపు చేతుల తో నా “తువ్వాయిని ముట్టుకోకు నీవు తెలిసిందా? తాకనని ఒట్టెసుకో”అంటూ తండ్రి చెయ్యి తన చేతిలో వేసుకుంది.ఈ మాట వినగానే కసాయి వెంకయ్య కు హృదయం లో కలవరం బయలుదేరింది.ఒక పూట అర్థరాత్రి అందరూ గాఢనిద్ర పోతున్న సమయంలో ఎవరో తలుపు తట్టారు. రెండుమూడు సార్లు అలా తట్టే సరికి కసాయి వెంకయ్య లేచి తలుపు తీశాడు. చూడగా అతను ఆ ఊరి పంచాయితి అధికారి ఆయన అంటే ఊరు వాడ కు హడలే! అందుచేత ఆయన ఈ అర్థరాత్రి వేళ స్వయంగా రావటం చూడగా కసాయి వెంకయ్య కి కంగారు పుట్టింది.చూడు వెంకయ్య రేపు ఇంట్లో కార్యము ఉంది బంధువులు స్నేహితులు తెలిసినవారు వారు చాలా మంది వస్తారు. నీ వద్ద గల మాంసం ఎంత ఉంటే అంతా ఇదిగో మా పనోడి దగ్గర ఇచ్చిపంపు ముఖ్య మైనా విషయం కనుక నేనే వచ్చాను.అన్నాడు. కసాయి వెంకయ్య కి వెలక్కాయ గొంతులో పడింది.ఆ రోజూ న చాలా మాంసం అమ్ముడు పోయింది.ఒక్క తునక కూడ మిగల కుండా విక్రయమయి పోయింది. అయితే వచ్చింది.అధికారి ఎప్పుడూ గుమ్మం తొక్కి ఎరుగదు. ఎం జవాబు చెప్పకోవాలా?” బాబయ్య! అలాగే లే అని చెప్పి పంపిచ్చేసాడు.తమరు పదండి అన్నాడు కసాయి వెంకయ్య. ఐతే అధికారి గుమస్తా లేదు. నేను ఇక్కడే ఉండి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఉదయం కెళ్ళ వంట మొదలు పెట్టాలి. cక్అని అక్కడే భీష్మించుకొని కూర్చున్నాడు. గత్యంతరం లేక కసాయి వెంకయ్య తన కూతురు పెంచు కొంటున్న లేగ దూడను విప్పి అంగడికి లాగి ఈడ్చుకు పోయాడు. లేగ దూడ అంబా”అని రెండుసార్లు అరిచింది నిద్రిస్తున్న అంబికా ఉలిక్కి పడి లేచింది. తువ్వాయి కోసం చూచింది. కనపడక పోయే సరికి ఒక్కనిముషం లో అడ్డుదారిన పరుగెత్తి అంగడికి చేరుకుంది. దూడ కు బదులుగా తను కూర్చుని మెడ కత్తుల మధ్య దూర్చింది. కసాయి వెంకయ్య గబ గబా వచ్చి కత్తి పైకి ఎత్తి చూడగా ఆ మెడ తన ముద్దుల కూతురు అంబికా కంఠపడగానే తన చిన్నారి అంబికా ని చూసి పెద్దకేక పెట్టి చతికల పడ్డాడు.కొంత సేపటికి తెరుకొని లేచాడు. తన ముద్దుల కూతురు కడకు కత్తుల నుండితప్పించ బోయవాడు కానీ ఆ బాలిక ఎంత కూ యివతలకి రాలేదు. ముందు నన్ను చంపు ఆ తరువాత నా తువ్వాయిని.
చంపు దువు గాని నువ్వు నాకు ద్రోహం చేశారు నాన్న! ద్రోహం చేయటం జీవహింస కంటే కూడా ఎక్కవైన మహాపాపం ముందునన్న చంపి తరువాత నా తువ్వాయిని చంపు… అన్నది. కసాయి వెంకయ్య. నిజమే అంబికా! నిజమే నువ్వు చెప్పిందంతా నిజమే!.అంటూ మళ్ళీ పడిపోయాడు.ఎంత సేపటికి కసాయి వెంకయ్య రాక పోయేసరికి అక్కడ మాంసం కోసం అధికారి ఇంకా రాకపోయే సరికి కారాలు మిరియాలు నూరుతూ అంగడి దగ్గరకు వచ్చేశాడు. వచ్చి చూడగా అతని కేమీ అర్థం కాలేదు. కసాయి వెంకయ్య తేరుకొన్నా తరువాత సంగతి సందర్భాలు వన్ని వల్లడైనాయి.”లేగదూడ” అంతా! అని అరిచింది. అంబికా లేచి వచ్చింది మెడ చుట్టేసుకుంది.. ప్రేమతో… కసాయి వెంకయ్య అంబికానూ లేగ దూడను కూడా చేరదీసుకున్నాడు. ఎంతో ప్రేమతో…
“బాబయ్య! నేను నా వృత్తి మాని వేశాను.క్షమించండి “అంటూ అధికారి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. అంబికా “ప్రేమ, త్యాగం చూచిన అధికారి ఈ రోజు నుంచి నేను మాంసం మానేస్తున్నాను అంతే కాదు, నా మిత్రులు కూడ మానేస్తున్నారు. ఈ క్షణం నుంచి మూగ జీవుల రక్షణ కల్పిస్తూ అంబికా సాక్షి గా ప్రమాణం చేస్తూ “మనుషులనే కాక, పశు పక్షులతో పాటు మూగజీవులనూ “ప్రేమమించండి” అందరం అంబికలా ఉందాం..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!