శపధం

శపధం

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: అద్దంకి లక్ష్మి

రమణి పార్కులో వెయిట్ చేస్తోంది రఘు గురించి, ఐదు గంటలకల్లా వస్తానన్నాడు ఈ ఆదివారం నాడు, తనకు ఇంట్లో ఎన్నో పనులు ఉన్నాయి. అయినా తాను సమయానికి వచ్చింది. పార్కులో బెంచీ మీద కూర్చుని వెయిట్ చేస్తోంది.
ఎప్పటికీ రాడు రఘు. చూసి.. చూసి విసుగౌవుతోంది. అలా ఆరు గంటలు అయిపోయింది.
రమణకి చికాకేసింది ఈ వాలెంటైన్స్ రోజున తప్పకుండా కలుసుకుంటారు వాళ్ళిద్దరూ. పార్కులో కాసేపు మంచి, చెడ్డ చెప్పుకొని హోటల్ కి వెళ్లి ఇరువురు బహుమతులు ఇచ్చుకుంటూ గడుపుతారు. రఘు కంగారుగా వస్తున్నాడు. అప్పటికి ఆరున్నర అయింది. “రాణీ సారీ లేట్ అయింది” అన్నాడు. రమణి కి చాలా కోపం వచ్చింది. “ఈరోజు ఇంతసేపు లేట్ గా వస్తావా!
వాలెంటైన్స్ డే కి నీకు విలువే లేదు” మండిపడింది.
“ఓకే.. ఓకే రాణి! కూల్ డౌన్” అసలు సంగతి వినుమరి మన కాలేజీ ప్రిన్సిపాల్ గారు పిలిచారు.
అమెరికా లో పి.హెచ్.డీ అప్లై చేయమన్నారు వాళ్లు కూడా కొంత సహాయం చేస్తాము. వెళ్లి అక్కడ చదువుకో అని ప్రిన్సిపాల్ గారు చెప్పారు.”
“మరి నీవేమన్నావు?” రమణి ఆతృతగా అడిగింది “వద్దని చెప్పేశాను. నిన్ను వదిలేసి నేను ఉండలేను డాక్టరేట్ చదవాలంటే కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుంది. అప్పుడు గానీ మన పెళ్ళికి కుదరదు అందుకని వద్దని చెప్పేసాను
అన్నాడు కూల్ గా రఘు.”
రమణికి వెంటనే కోపం వచ్చింది “అదేమిటీ, ఇంత మంచి ఆఫర్ వస్తే వద్దంటావా! జీవితంలో ఒకసారి లక్ దొరుకుతుంది మనకి, నేను కూడా నిన్ను విడిచి ఉండాలి కదా! నేను మాత్రం నిన్ను విడిచి ఎట్లా ఉంటాను. ఏదో మనిద్దరం కష్టపడితే నువ్వు బాగా చదువుకుంటే మన జీవితం సుఖమయం అవుతుంది.”
“ఎప్పుడో నాలుగు సంవత్సరాల తర్వాత మన పెళ్లంటే నేను నిన్ను విడిచి ఉండలేను. నేను ఇప్పుడు అరగంట లేటుగా వస్తే నువ్వు ఎంత విలవిల్లాడిపోయావో.. నేను అంతే.”
“రఘూ! అది వేరు, ఇది వేరు, జీవితంలో ఆపర్చునిటీ ఒకేసారి వస్తుంది. పైగా మన ప్రొఫెసర్లు అందరూ నీకు సహాయం చేస్తానంటున్నారు. మీ అమ్మగారి గురించి నువ్వేమీ బెంగపడకు, ఎదురుగుండా ప్లాట్ లో ఉండి మేము ఆమెకు అన్ని సహాయాలు చేస్తాము. నీకు తెలుసు కదా! ప్రేమంటే కేవలం రోజు కలుసుకోవడం చక్కగా కబుర్లు చెప్పుకోవడం, సినిమాలో లాగా ప్రేమ గీతలు పాడుకోడం కాదు. ఒకరి గురించి ఒకరు సర్దుకోవాలి, మనకి ఎన్నో ఇష్టా ఇష్టాలు ఉంటాయి. కానీ తన వాళ్ల గురించి తను కష్టపడి అయినా వాళ్ళని సుఖపెట్టాలి. అదే అసలైన ప్రేమంటే, స్వార్థ చింతనతో మన గురించి మనం ఆలోచించుకుంటూ మన సుఖం గురించి చూసుకుంటే అది ప్రేమ ఎట్లా అవుతుంది.”
“నిన్ను నేను ప్రేమించానంటే, మీ వాళ్ళని కూడా నేను ప్రేమించాలి కదా! అదే అసలైన ప్రేమ.”
“కానీ రమణి! మీ నాన్నగారు నీకు పెళ్లి సంబంధాలు చూస్తానంటారు మరి ఇన్ని సంవత్సరాలు ఉండగలరా!”
“ఏం పర్వాలేదు! నేను మా తల్లిదండ్రులతో మాట్లాడతాను, ఒక సంవత్సరం నా చదువు ఎలాగు ఉంది కదా! తర్వాత నేను జాబులో చేరి కాలక్షేపం చేస్తాను, ఇంతలో నువ్వు రానే వస్తావు కదా! నువ్వు తప్పకుండా అమెరికా వెళ్లి చదువుకోవాలి. అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకునేది. అంతవరకు పెళ్లి మాటలు ఎత్తేది లేదు”. “ఈ వాలెంటైన్స్ రోజున నువ్వు నాకు ప్రామిస్ చేయ్యి. చదువుకొని వచ్చిన తర్వాతే పెళ్లి అని, అప్పుడే నేను సంతోషంగా నీతో కాపురం చేయగలను.” “నా గురించి నీ చదువు మానేస్తే నాకు కష్టంగా ఉంటుంది.” అంటూ రమణి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడ్చింది.
వెంటనే రఘు కరిగిపోయాడు.”రమణి! నీవు చెప్పినట్టే నేను వింటాను. మన పెళ్లి, నా చదువు అయిన తర్వాతే, నీ కోరిక ప్రకారం నేను అమెరికా వెళ్లి చదువుకొని వస్తాను. ఈరోజు వాలెంటైన్స్ డే నీకు ప్రామిస్ చేస్తున్నాను. ఎప్పుడూ నీ సంతోషమే నాకు కావాలి.” అంటూ రఘు, ఆమె కన్నీళ్ళని తుడిచాడు.
“అమ్మయ్య! నిన్ను ఒప్పించే సరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. సరే పద రెస్టారెంట్ కి వెళ్లి టిఫిన్ తిని పోదాం. లేటుగా వెళ్తే మా అమ్మ ఇంకా రాలేదు అని సతాయిస్తుంది.” అంది రమణి. వాలెంటెన్స్ డే కి చక్కటి నిర్ణయాలు తీసుకుని జీవితాలను సక్రమమైన మార్గంలో నడుపుకోవాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!