సాత్వీకుడు

సాత్వీకుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభా కరి

సూర్యోదయం మొదలు సుబ్బారాయుడు ఇంటి పనులలో ఎంతో సహాయం చేస్తూ, తల్లి వెంట ఉండేవాడు. ప్రతి విషయానికి అమ్మా..అమ్మా అంటూ ఉంటాడు. ఎదో చిన్న పోస్ట్ ఆఫీస్ ఇంట్లో నడుపుతూ కాలం గడుపుతున్నాడు. గో సేవ మంచిది. తండ్రి నాలుగు షాపుల్లో అకౌంట్స్ రాస్తాడు. జీవితమంతా అమ్మ వెంట కుదరదు, పెళ్లి, కుటుంబం అవసరం ఉన్నది. పెళ్లి చేసుకో అంటే వద్దు అమ్మ నాకు, అది వచ్చి నిన్ను సరిగా చూస్తుందో లేదో! అలా ఏమీ కాదు, నేను మంచి పిల్లను చూస్తాను. సరే అమ్మా. నీలా చూసేది కావాలి. మనిషి మంచివాడు ఎవరైనా మంచి పిల్ల దొరికితే చాలు అనుకున్నది. ఒక్క పిల్లాడు ఇద్దరు కూతుళ్ళు. మేనత్త కొడుకుకి అభిమానంగా
చేసుకున్నారు. కొద్దిరోజులకు పెళ్ళిళ్ళు పేరయ్య సంబంధం తెచ్చాడు. అయితే ఆ పిల్ల ఇంటర్ చదువుకుని ఉద్యోగ పరీక్షలు రాస్తూ పోస్టల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఆ పిల్ల చాలా తెలివిగా ఆలోచించి, పెళ్ళికి ఒప్పుకున్నధి. పెళ్లి వాళ్ళ స్తోమత కొద్ది బాగానే చేశారు. లక్ష్మీ తెలివైనది. ఓబ్బిడి గా, నెమ్మదిగా ఉండి, భర్త సంగతి, అత్త గారి పద్దతికి అలవాటు పడింది. నెమ్మదిగా పోస్ట్ టెస్ట్ లు రాసి ఆఫీస్ కి పర్మిషన్ తెచ్చుకుని, బ్రాంచ్ ఆఫీస్ గా మార్చింది. మన సుబ్బా రాయుడు సాత్వికుడు కనుక, అన్ని పనులు చక్కబెట్టింది. బయటి పనులు చేసుకుని వచ్చే పెళ్ళానికి సహకరించె వాడు.
మనిషిప్కి భయం వల్ల జీవితంలో ఎదుగలేరు
సుబ్బా రాయుడు చిన్నతనం లో భయపడి స్కూల్ కి వెళ్ళేవాడు కాదు, తల్లి ఎలాగో టెన్త్ పాస్ అయ్యేటట్టు చేసింది. బుద్దిమంతుడుగా పెంచింది. జీవిత విలువలు నేర్పింది. నీకోసం వచ్చిన పిల్లని జాగ్రత్తగా చూసుకో అని కొడుక్కి మంచి బుద్దులు నేర్పింది. సుబ్బారాయుడు మంచి వాడు అని పేరు వచ్చింది. పెళ్ళాం తెలివైనది అనే పేరు వచ్చింది. జీవితంలో భార్య, భర్త కలిసి కుటుంబాన్ని చూసుకుంటునే.. సమాజహితమే నానాటి బ్రతుకు నాటకంలో జీవితం అతి ముఖ్యము జీవితానికి అనుకూలంగా జీవించాలి అని అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో చెప్పిన సారము. మనిషి సమాజ హితమే తన హితంగా భావించిన వారికి జీవిత సుగమనము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!