అమ్మతనం

అమ్మతనం

రచయిత :: కొఠారి ప్రమిలా రాణి

అమ్మ తనం దరిచేరుతందనే తీపి కబురు  చేరగానే జీవితానికి అసలైన అర్ధం అమ్మతనమేగా అని మురిసి పోతూ,,
తన అదృష్టానికి పొంగిపోతూ,,

వేవిళ్ళు అనే నరకాన్ని భరిస్తూ,,
సంతాన క్షేమం కోసం జాగ్రత్తలు పాటిస్తూ,,

అనుక్షణం తన ఆలోచనలు,, జీవన విధానం వచ్చే బిడ్డ కు అనుకూలంగా మారుస్తూ,,
బిడ్డ రాక కోసం ఎదురు చూస్తూ,,

సమయం రాగానే ప్రాణాన్నైనా పణంగా పెట్టే ధైర్యం నీలో  పెంచుకుంటూ,,

నీ వారికి నీ భయాన్ని కనపడనీయకుండా నీ నవ్వులే  చూపించుకుంటూ,,

పురిటి నొప్పులు పడి,,
దరి చేరిన సంతానాన్ని చూసి తనివి తీరా ఆనందపడి,,

బిడ్డ ఆనందం కోసం ప్రతి క్షణం ఆరాటపడుతూ,,
బిడ్డ రక్షణ కోసం కంచెలా  నువ్వు మారిపోయి
వచ్చే కష్టాలన్నీ సంతోషంగా పోరాడుతూ,,

ఇష్టమే అనుకుంటావు గా ప్రతి కష్టాన్ని ఓ   అమ్మా !!
కష్టమే దరి చేరనివ్వవుగా ఓ అమ్మా,, !!

You May Also Like

2 thoughts on “అమ్మతనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!