అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ ♥️

రచయిత :: దీప్తి

 

చనుబాలు రుచికి
అమ్మ ప్రేమ రుచికి
విలువ కట్టగలమా!!

బిడ్డ కన్నీరును చూసి
మనసులో వేదననుభవిస్తూ
ధైర్యం చెప్పే తన చిరునవ్వుకు వెల కట్టగలమా

అత్తవారింట్లో అలిసిన బిడ్డకు
కొసరి కొసరి వడ్డిస్తూ.. తన ఆకలి మరచిన
ఆ ప్రేమానుభూతికి విలువ కట్టగలమా

బిడ్డ చేసే ప్రతిపనిలో అమ్మ
రూపం కనిపిస్తున్నా
ఆ బిడ్డ అమ్మ అయినప్పుడే కదా
ఆమె విలువ మరింతగా తెలిసేది..

సృష్టి మూలం అయిన
ఆ అమ్మకి కృతజ్ఞతలు చెప్పేరోజు
నిజమైన పండుగరోజు
మన “సృష్టికి పుట్టినరోజు”

ప్రేమ మూర్తులైన మన అమ్మలందరికి
“మాతృదినోత్సవ శుభాకాంక్షలు”

You May Also Like

2 thoughts on “అమ్మ ప్రేమ

  1. SUPERB 👌👌 Deepu Gaaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!