గొప్ప బహుమతి అమ్మ
రచయిత::హసీనాఇల్లూరి
అమ్మా అని ఎవరు పిలిచిన
అది తన కన్న ప్రేగు అయినా, కాకపోయినా
తన బిడ్డలా కంటికి రెప్పలా కాచుకునే
ఏకైక పదం అమ్మ! అమ్మ అనే బంధం!!
అమ్మ అనే పిలుపులోని మధురం
ఏ తేనె మధురానికి సాటి రాదు
పురిటి నొప్పులను ఆనందంగా
భరించి మనకు జన్మనిచ్చేది అమ్మ!!
కన్న వాళ్ళు కాదని అన్నా
తను మాత్రం కన్న వాళ్ళని మరువలేదు
వాళ్ళకై నిరంతరం శ్రమిస్తూ తన
జీవితాన్ని అయిన వాళ్ళ కోసం వెచ్చిస్తుంది!!
అలాంటి అమ్మ ప్రేమని అర్ధం చేసుకుని
అవిడకై కొంచెం సమయాన్ని,ప్రేమని
పంచడమే మనం వాళ్లకు ఇచ్చే గొప్ప
బహుమతి అమ్మ కోరుకునే బహుమతి!!
Super
Wow హసీనా సూపర్ చెప్పారు👌👌👏🏻👏🏻🌹