కనిపించే దైవం

కనిపించే దైవం (మా అమ్మ సుశీలమ్మ)

రచయిత :: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ ) 

అనురాగాల కోవెలలో కొలువుదీరిన దేవత
కన్న బిడ్డల భవిష్యత్తు కలలకు మార్గదర్శిని

బాధలను మదిలోనే దాచుకునే  భూమాత
కష్టాలను కన్నీళ్ళను  మరిపించే ప్రేమమూర్తి

ఎన్ని తప్పులు చేసిన క్షమించే కరుణామయి
అమ్మా అనే పిలుపుతో దగ్గరయ్యే మాతృమూర్తి

ముఖం చూసి మనసు తెలుసుకునే వైద్యురాలు
అడగకుండానే సమస్తం సమకూర్చే ప్రత్యక్ష దైవం

లాలి పాటలు పాడి నిద్రపుచ్చే గాన కోకిలమ్మ
సంతోషాలను పిల్లల కోసం త్యాగం చేసే త్యాగమూర్తి

అలసిన హృదయాలకు స్వాంతన చేకూర్చే కల్పతరువు
భయాల మదిలో ధైర్యాల స్పూర్తి నింపే ధీశాలి

అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది
అమ్మ పంచే ప్రేమ ఎవరూ అందించలేనిది.

You May Also Like

2 thoughts on “కనిపించే దైవం

  1. మీ ప్రతి కవితను మనసు నుండి రాస్తారు క్రాంతి garu
    🎊🎉🥳👏

    1. థ్యాంక్స్ 🤗 అనురాధ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!