కళ్ళు ఎర్రబడ్డాయా”..? అయితే కరోనా అయి ఉండవచ్చు..

కళ్ళు ఎర్రబడ్డాయా”..? అయితే కరోనా అయి ఉండవచ్చు..

Dr. J. Aravind, MS Ophthalmology

కరోనా వ్యాధి గురించి అందరికి అంతో ఇంతో ఇప్పటికే తెలిసే వుంటుంది. అది మన ఊపిరితిత్తులలో తిష్ఠ వేసి కలిగించే ఇబ్బందుల గురించి చెప్పనక్కరలేదు.
కానీ కరోనా వైరస్ మన ఊపిరితిత్తులలోనే కాకుండా మెదడు, ప్రేగులు, గొంతు, లాలాజలం ఇలా మన శరీరంలో అన్ని భాగాలకు చొచ్చుకొని వెళుతుందని గత సంవత్సరం వచ్చిన అననుకూల పరిస్థితులలోనే కనుగొనడం జరిగింది. ఇది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ని కలిగించడం కూడా చూసాం. మన శరీరంలోని అన్ని స్రావాలలోను ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారు.
ఇలాగే కరోనా వైరస్ ను కళ్ళలో కూడా గత సంవత్సరంలోనే కనుక్కోవడం జరిగింది. అయితే చివరి సంవత్సరంతో పోలిస్తే సెకండ్ వేవ్ లో కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని తాజా రిపోర్టులు చెప్తున్నాయి.
మామూలుగా SWAB టెస్ట్ ని ముక్కు లేదా గొంతు లో చేస్తారు., కానీ కొంతమంది వ్యక్తులలో SWAB టెస్ట్ నెగిటివ్ వచ్చినప్పటికి కరోనా లక్షణాలు కనిపించడం వైద్యులను కలవరపెట్టింది. ఇలాంటి వ్యక్తులలో లోతుగా పరిశీలించి వైరస్ ఉనికిని కంటిలో కనుగొన్నారు. అంతే కాకుండా ఈ వైరస్ కళ్ళలో (కంన్జ్ంక్టైవా అనే పోరలలో) మాములు కంటే ఎక్కువ రోజులు తిష్ఠ వేస్తుందని నిరూపణ అయినది. ఇటలీలో జరిపిన పరిశోధనలలో ఇది సుమారు నెల రోజుల వరకు కళల్లోనే దాగి ఉండటం గమనించారు.ఈ రిపోర్ట్ లు ఆధారంగా WHO తన సూచనలలో కళ్ళు ముక్కు నోరు ముట్టుకున్న తరువాత చేతులను తప్పకుండా శుభ్రం చేసుకోవాలని పేర్కొనబడింది.

కంటి సంబంధిత కరోనా వ్యాధి ముఖ్య లక్షణాలు..

1. కరోనా వైరస్ నేరుగా కంటిలో కంన్జ్ంక్టైవా అనే పొరకు సంక్రమించి కన్నీళ్లు ద్వారా స్రవించబడుతుంది. అలాగే కంటి అంతర్గత భాగాలలో కూడా చొచ్చుకెళ్లి కళ్లకలక, కళ్ళ మంటలు, కళ్ళు ఎర్రబడటం, కళ్ళ నుండి నీరు కారడం, తలనొప్పి లాంటివి ముఖ్య లక్షణాలు. వైరస్ మన కంటి కణజాలాన్ని నేరుగా నాశనం చేయడం వల్ల లేదా రోగనిరోధక వ్యవస్థ వల్ల ఇలా జరుగుతుంది.

2. వైరస్ యొక్క పరిమాణం (సంఖ్య) మరియు కంటి వ్యాధి తీవ్రతకు సంబంధం లేదు.

3.నల్లగుడ్డు మార్పిడి (corneal transplant) ::
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే కరోనా వ్యాధితో మరణించిన వ్యక్తి కళ్ళ దానం చేసినప్పుడు దాత (donor ) నల్ల గుడ్డులో వైరస్ ఉన్నప్పటికీ అది గ్రహీత (recipient) లో వ్యాధిని కలుగ చేయటం లేదు. అయితే ముందు జాగ్రత్త (safety) దృష్ట్యా దీనిని ప్రోత్సహించటం లేదు.

4.నీటి శుక్లాలు లేదా నీటి కాసులు లేదా గ్లకోమ వ్యాధి ఉన్న పేషంట్స్ వెంటిలేటర్ పైన ఉన్నప్ప్పుడు వారి కంటిలో ఒత్తిడి (intra ocular pressure) పెరిగి గ్లకోమా వ్యాధి తీవ్రత పెరగడం గమనించారు.

5.డ్రై ఐ డిసీజ్(dry eye disease) :: సరైన పద్ధతిలో ముఖానికి మాస్క్ ని ఉపయోగించక పోవడం వల్ల మనం వదిలిన గాలి (శ్వాస) నేరుగా కళ్ళకు తగిలి మాస్క్ అసోసియేటెడ్ డ్రై ఐ వస్తుంది (mask associated dry eye). దీని వల్ల కళ్ళు పొడిబారి పోయి కళ్ళు మంటలు సమస్యలు వస్తున్నాయి.

6.RT-PCR పాజిటివ్ ఉన్నవారు కంటి ఆపరేషన్ అవసరం అయ్యి ,అది అత్యవసరం కాకుంటే దానిని వాయిదా వేసుకోవడం మంచిది.

7.పేషెంట్ కి ఎటువంటి కరోనా వ్యాధి లక్షణాలు లేకుండా ఉన్నప్పటి పేషేంట్ లో కంన్జ్ంక్టైవా, కండ్ల కలక కలిగి ఉన్నట్లయితే దాన్ని కరోనా వైరస్ అనుమానిత వ్యాధిగానే పరిగణించి చికిత్స చెయ్యాలి. ముఖ్యంగా పిల్లలలో ఈ తరహా కంటి సమస్యలు సెకండ్ వేవ్ లో ఎక్కువగా వస్తున్నాయి.

8.కోవిడ్ వ్యాధి వల్ల కంటి నరం (రెటినా) కి రక్తం సరఫరా చేసే రక్త నాళాలలో రక్తం గడ్డకట్టి రక్త ప్రసారంలో అడ్డంకులు ఏర్పరచుచున్నది. దీనివల్ల అంధత్వం కలగవచ్చు. ఇటువంటి రిస్క్ బి.పి,షుగర్ పేషెంట్లలో ఎక్కువ.

9.మ్యుకార్ మైకోసిస్..బ్లాక్ ఫంగస్ (black fungs) ఇది ఈ మధ్యకాలంలో అందరిని కలవర పెట్టుచున్న భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధి. ఇది పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ లో చాలా ముఖ్యమైనది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గటం వల్ల కలిగే వ్యాధి. దీనికి కారణాలు కోవిడ్ చికిత్స ట్రీట్మెంట్ లో ఉపయోగించే స్టిరాయిడ్స్, మందుల వల్ల లేదా ఆక్సిజన్ థెరపి పైన ఉండే వెంటిలేటర్ పేషేంట్స్ లేదా ఆ వ్యక్తిలో ముందుగానే ఉన్న కో -మార్బిడిటిస్ (co-morbidities) షుగర్, బి.పి ,హెచ్ .ఐ.వి (sugar bp hiv tb ) వల్ల కూడా కలుగుతుంది.
ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు: విపరీతమైన తల నొప్పి ,కళ్ళ వాపులు ,కళ్ళు ముందుకు పొడుచుకు వచ్చినట్లు గా ఉండటం కంటి కణతల నొప్పి, రెండుగా కనిపించడం(double vision) కంటి రెప్పలు వాలి పోవడం. ఎందుకంటే మ్యుకార్ మైకోసిస్ కి సరైన ట్రీట్మెంట్ ఇంతవరకు లేదు. కాబట్టి షుగర్ ,బి.పి,హెచ్.ఐ.వి, టి.బి లాంటి దీర్ఘకాలిక వ్యాదులు కలిగిన రోగులు జాగ్రత్త వహించాలి.
ప్రస్తుతం తాత్కాలిక పరిష్కారం కోసం ఆంఫోటెరిసీన్ – బి (Amphotericin-B)అనే ఇంజక్షన్ ను ఉపయోగిస్తున్నారు.

నాజల్ ఎండోస్కోపీ , MRI, MR Angio పరీక్షల ద్వారా ముందుగానే పసిగట్టవచ్చు.

కాబట్టి ఈ సెకండ్ వేవ్ లో కంటి సమస్యని చిన్న విషయంగా పరిగణించకుండా జాగ్రత్తగా వీలైనంత త్వరగా డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ సరైన అవగాహనతో, ముందు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా రాకుండా చూసుకోవడం మంచిది ,ఒకవేళ కోవిడ్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి .. అని Dr. J. అరవింద్ MS(ophthalmologist) గారు విలువైన సలహాలు సూచనలను తపస్వి మనోహరం ద్వారా తెలియజేశారు.

కరోనా వైరస్ వల్ల కళ్ళకు వచ్చే సమస్యల వివరాలు , నివారణ పద్ధతులను సవివరంగా తెలియజేసిన డాక్టర్. J. అరవింద్ గారికి తపస్వి మనోహరం తరపున కృతజ్ఞతలు.🙏

You May Also Like

3 thoughts on “కళ్ళు ఎర్రబడ్డాయా”..? అయితే కరోనా అయి ఉండవచ్చు..

  1. ఉపయోగకరమైన విషయాలు చెప్పారు…🤝

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!