అమ్మ ప్రేమ అనంతం

అమ్మ ప్రేమ అనంతం

రచయిత :: చలిమేడ ప్రశాంతి

అమ్మ అనే పిలుపు చాలు
మనసులో ఉన్న దిగులు తీరడానికి..
అమ్మా అంటే చాలు..
ఆకలి బాధలను తీర్చే అన్నపూర్ణ అవుతుంది

ప్రేగు బంధం లేకున్నా
అమ్మ అనే ప్రేమ బంధానికి
అనురాగపు చూపులు కురిపించే
ప్రతి మహిళా అమ్మే కదా

పరిణితి చెందని పిండాన్ని
రక్షించుకోవాలి అనే తపనతో
పక్షులు చేసే పోరాటంలో
తెలియలేదా అమ్మ ప్రేమ గొప్పతనం

నోరులేని మూగజీవులు సైతం
తమ పిల్లకోసం పడే ఆరాటం
తెలీడం లేదా…
మాతృప్రేమ అంటే ఏంటో

మాటలే రాని వృక్షమే
తన నుండి వేరు పడ్డ కొమ్మకోసం
మౌనంగా భరించును

పురుడు పోసుకున్న స్త్రీ మూర్తి
బిడ్డ ఏడుపుతో అప్పటి వరకు
తాను పడ బాధను సైతం మరిచిపోతుంది

ఎదిగే బిడ్డ తన గుండెలపై ఆడుతుంటే
తాను అప్పటి వరకు మోసిన నొప్పులను మరిచి భూదేవిలా సహనాన్ని పొందుతుంది ఆ స్త్రీ మూర్తి

అమ్మ అంటే ఆకాశం అంత
విశాలమైన హృదయం కలది
భరించే ఓర్పుగల భూమాత అవుతుంది

అమ్మకి ఏ దేవతలు కుడా సాటిరారు
అమ్మ ప్రేమ అనంతం
అమ్మ లేని లోకం నరకం
అమ్మప్రేమతోనే ఈ సృష్టి నడుస్తుంది
అమ్మ ప్రేమనురాగమే అమృత భాండాగారం.

You May Also Like

One thought on “అమ్మ ప్రేమ అనంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!