అమృతం అమ్మ ప్రేమ

అమృతం అమ్మ ప్రేమ

రచయిత :: జయ కుమారి

వేకువజామున తొలికిరణం అమ్మ.!!
మనలో  కొత్త ఉషోదయానికి ఆరంభం  అమ్మ.!!
దేవుడు తనకి మారుగా పంపిన  దేవత అమ్మ..!!
అమ్మ… ఆ పదం ఎంత మధురమో.!!
అమ్మ.. జీవనగమనానికి మూలాధారం.!!
నింగి,నేల ఉన్నంతకాలం.!!

అమ్మ అమృతం.!!
అమ్మ అనురాగం .!!
అమ్మ మమకారం .!!
అమ్మ త్యాగం అమరం.!!

అమ్మ ప్రేమ అఖిలం.!!
అమ్మ చిరుకోపం హిమపాతం.!!
అమ్మ ఆప్యాత నిత్య నూతనం.!!

ఆకలి అని అడగక ముందే  మొదటి గోరుముద్ద
అమ్మ.!!
మన ఆశల వాహిణిలో వెన్నెల వెలుగు అమ్మ.!!మన బాధలో ఓదార్పు అమ్మ.!!

ఏదేమైనా ఈ సృష్టి కి ఆధారం అమ్మ.!!
అలాంటి అమ్మ రుణం తీర్చుకొలేనీది.!!

ఈ లోకంలోని అమ్మలందరికి నా పాదాభివందనాలు తెలుపుతూ.!!

మాతృమూర్తులందరికి మాతృదినోత్సవం శుభాకాంక్షలు🙏💐

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!