కూర తెలగపిండి- కందిపప్పు పొడి కూర

కూర తెలగపిండి – కందిపప్పు పొడి కూర

రచన :: కృష్ణవేణి

 

కావాల్సిన పదార్థాలు::

కూర తెలగ పిండి – 1/4 kg (or) 1/2 kg.

కందిపప్పు          – ఒక చిన్న గ్లాసు (తెలగపిండికి సరి పడినంత).

నూనె                 –  2 గరిటెలు ( కొంచెం ఎక్కువే).

పోపు గింజలు      – పచ్చి శనగపప్పు , మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ.

వెల్లుల్లి పాయలు  – 2 ( పొట్టు తీసి, రెబ్బలు రెడీ చేసుకోవాలి )

ఉప్పు, కారం       –  రుచికి సరిపడా

తయారు చేసే విధానం::

  • ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, ఒక గిన్నెలో కందిపప్పు కడిగి, ఒక గ్లాస్ నీళ్ళు పోసి 10 నిమిషాలు కందిపప్పు ఉడికించాలి.
  • కొంచెం మెత్తబడిన కందిపప్పును ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. (ఆ మిగిలిన నీరు కూడా కందికట్టు చారుగా వాడుకోవచ్చు.)
  • మళ్లీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, రెండు గరిటెల నూనె పోసి, వేడి చేసుకోవాలి.
  • నూనె వేడి అయ్యాక, పచ్చి శనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఆయిల్ లో బాగా వేగనివ్వాలి. కొంచెం ఇంగువ కూడా ఆ పోపు గింజలలో వెయ్యాలి.
  • ఎర్రగా వేగిన పోపు గింజల్లో, ముందుగా ఉడికించిన కందిపప్పుకు సరిపడినంత తెలగ పిండి తీసుకుని, ముందుగా కందిపప్పు, తర్వాత ఆ పిండి కలుపుతూ వెయ్యాలి. రెండూ కలిపి పాన్ లో ఒక 10 నిముషాలు ఉడికించాలి. ( మూతపెట్టకూడదు)
  • ఉడికించిన పిండి, కందిపప్పులో కలసి పొడిపొడిగా కూర రెడీ అవుతుంది. ఉప్పు, కారం, మళ్లీ లేత కరివేపాకు వేసి, బాగా కలియబెట్టాలి.
  • 3 నిముషాలు స్టవ్ మీద ఉంచి, స్టవ్ ఆప్ చెయ్యాలి. వేడి వేడి తెలగ పిండి కూర రెఢీ.
  • తరిగిన కూర వద్దు అనుకున్న రోజున, మనకి ఈ కూర మహా ప్రసాదం అవుతుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!