అమ్మ ఓ అద్భుతం

అమ్మ ఓ అద్భుతం (మా అమ్మ  వై. శకుంతల)

రచయిత::వై. మంజులత


అమ్మ ఎప్పుడూ ఆదర్శమే
మానవులందరికీ స్పూర్తిదాయకమే..
అందరి మనసులలో ఆనందదాయకమే !

జీవన గమనంలో ఎన్ని ఆటుపోట్లు కోర్చి బతుకునో
ఎంతటి బాధను లోలోన భరించునో ?..
అయినా మౌనమే తన ఆభరణం..
పిల్లల భవిష్యత్ తన లక్ష్యం !

వసంతాలకు పొంగిపోదు
శిశిరాలకు బెదిరిపోదు..
అసూయ అహాలకు అర్థం తెలీదు..
తన బ్రతుకంతా  త్యాగమయం..
పిల్లల హితమే తన జీవితం !

దేవుడు ఆదర్శాలన్నింటిని
తనలో నింపి ప్రాణం పోశాడేమో..
పిల్లలకు బంగారు భవితనిమ్మని
బంగారు బాటను నిర్దేశించమని !

కష్టాలెన్ని ఎదురైనా
దాచుకున్న సంపదంతా కోల్పోయినా..
ముదిమిలో పిల్లల
మాటల తూటాలకు కూలినా..
మనసెంత గాయపడినా ..
చెరగని తరగని సిరి అమ్మ ప్రేమ..
అమ్మ భూమి మీద ఓ అద్భుతం !!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!