అంశం: చీకటి వెలుగులు
వెలుగు దారి
రచన: శ్రీదేవి విన్నకోట
జీవితం అంటే వెలుగు నీడల సమ్మేళనం.
కలిమిలేములతో సాగించే బ్రతుకు పోరాటం.
మనిషి మనిషికి ఎందుకో చెప్పలేని ఆరాటం.
చీకటంటే కష్టాలు కన్నీళ్లు ఓదార్పులే సర్వం.
వెలుగు అంటే సంతోషాల సుఖాలమయం.
ఎదుటివారి కళ్ళలో విరబూసే చిరునవ్వుల పర్వం.
వెలుగు నీడలు రెండు సమానం.
లేనిచో వాటి విలువ శూన్యం.
అన్ని ఓర్చుకుని ముళ్ళ దారిలో అలవోకగా ముందుకు సాగితే అదేపూలతో సాగే రాచబాట నిత్యం
చీకటినుంచి నుంచి వెలుగు వైపు సాగించు నీ పయనం.
ఇక జీవితంలో ఎదురు అవ్వదు తిరోగమనం.
అదే మనం సాధించే
నవ్య దీపాల పురోగమనం.