ఓరి నీ వేషాలో

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

ఓరి నీ వేషాలో

రచయిత :: పావని చిలువేరు

ఓరి నీ వేషాలో
నా ముద్దుల మొగుడా ,చాదస్తపు మొగుడా,
ముద్దు అంటే వద్ధు కరోన పోనీ అనే,
నిన్నా ,మొన్నా…. అది వచ్చి సంవత్సరం దాటే,
నా ముద్దు పాయె, శుభ్రం యెక్కువయే.

బాబోయ్  వీడి వేషాలు ,
చాదస్తపు సంఘానికి అధ్యక్షుడాయే
పొద్దున్న  లేచే గిన్నెల చప్పుడు చేసే,
యేమీటి అంటే  లే లే ఆవిరి పెట్టుకో అనే,
అల్లం అనే, కాషాయం అనే, ఆకు రసమనే
పిల్లలేమొ వెర్రి మొహం వేసే .

యింట్లో నుంచే పని చేసే ,గంటకో వింత చేసే,
గదిలో తక్కువ ఉండే బాత్రూమ్ లో యెక్కువుండే
కడిగి కడిగి సబ్బరిగే ,వేల్లు ముడుతలు కట్టె ,
ముద్దు కోసం చూసి చూసి నా కళ్లు కాయలు కాసే.

బుద్ధి పుట్టి ఓరగ చూస్తే, అయ్యో సరసo తప్పు అనే,
చెంపలేసుకొని ఆమడ దూరం వురికే ,
శుభ్రం అనే భద్రం భద్రం అనే,
ఇంకేన్ని రోజులులే  ఓపిక పట్టమనే,
అయ్యో నా మొగుడి చాదస్తపు వేషాలు

ముందేమొ నైటి వద్ధు చీరకట్టమనే ,
యిప్పుడేమొ చీర వద్ధు, నైటినే ముద్దు అనే,
యేమీ కాదులే  అని చీరలో ముందు ఉంటే,
వేడికి వూపిరి ఆడుతలేదుపో అని నిష్టూరంగా చూసే,

శుచీ, శుభ్రత యెక్కువయే,
నాలుగిoటికే లేచే  యోగా అనే,  కపాలబాతి అనే ,
టిఫిన్ ఏమొ మొలకలనే ,   మూలికలజావ అనే,
అయ్యో దేవుడా  నా సరసo అటకెక్కి పాయే.
కరోనా నా మొగుడిని చాదస్తపు సంఘానికి అధ్యక్షున్ని చేసే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!