అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో
నీ జ్ఞాపకాల నిశ్శబ్దం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కార్తీక్ నేతి
నీ జ్ఞాపకాల నిశబ్ధం,
ఇచ్చింది కొత్త జీవితం,
నిన్నటి చీకటికి వదిలేసాను
గతకాలపు చేదు జీవితం,
మారింది దృక్పదం,
మళ్ళి పుట్టింది సంతోషం,
ప్రవేశించింది తెలియని దైర్యం,
మొదలు పెట్టాను కొత్త జీవనం,
నా లోని ఆశయానికి పోసాను ఆద్యం,
నిరాశకు , నిస్పృహకు తావివ్వలేదు ఏ క్షణం,
చేసాను నిరంతరం ప్రయత్నం ,
విజయాల పరంపరతో సాగిపోతోంది ప్రయాణం ,
నువ్వు కనపడితే హద్దుకొని చెప్పాలని
నేను మరిపోయనన్న విషయం,
నీ జ్ఞాపాకలే నన్ను ముందుకు నడుపుతున్న ఇంధనం.