తల్లి భారతి

తల్లి భారతి

రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు.

 తల్లి భారతి నీకు వందనములు,
నీ ఆకుపచ్చని పట్టుచీరకి నిదర్శనం మా సస్యశ్యామలం అయిన పచ్చని పంటభూములు,
నీ ఎర్రని పట్టుచీర అంచు చక్కని సూర్యదయాలు,చంద్రోదయాలు,
నిలువెత్తు నీ నిండైన  విగ్రహం కన్యాకుమారి నుండి కాశ్మీరం వరకు శత్రుదేశాల బారి నుండి నిరంతరం రక్షిస్తుంది,
నీ చిరు మందహాసం,ప్రజల మనోనిబ్బరం.
భారతమాత!ఎన్నో శతాబ్దాలుగా ఇనుప సంకెళ్ళ లో ఉన్న నీ కష్టం ఉరికేపోదు,
శాంతి పోరాటాలు,విప్లవ పోరాటాలు చేసి నిన్ను కాపాడుకొన్నాము,
200 ఏళ్ళ ఆంగ్ల సామ్రాజ్యాన్ని,కూకటివేళ్ళతో పెకిలించి భారతమాతను బానిసత్వ బంధం నుండి విముక్తురాలివై,శత్రువుల గుండెల్లో దడ పుట్టించావు,నాడు
నేడు నీ చల్లని ఒడిలో సురక్షితంగా స్వాతంత్ర వేడుకలు జరుపుకొంటు సగౌరవంగా ప్రజల సుఖసంతోషాలకు మార్గదర్శివైనావు,
“”నా తల్లి భారతమాత నీకు శతసహస్రకోటి వందనములు.””!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!