ఈ వేళలో

ఈ వేళలో…

రచన: గాజులనరసింహ

మాటరాని వేళలో..మౌనరాగాలు ఎన్నో
సడిచేయని పొద్దులలో సంధియగు మనసులు ఎన్నో
ప్రశాంత వేళా పరువాల జోల పదము కదిపి ప్రాయాలు పాడే పాట..
ఈ వేెళలోన..ఈ కోణలోన.. ఆ..ఆ

వయస్సు ఒకటౌతుంది వలపు ఊయల ఊగుతుంది ..
పరవసమైన మదులు తెలిపోతుంటే …ఈ వేళలో..6 ఈ కోణలో

ఒక్కటై అడుగులు తడబడుతుంటే ..
ముడివడి తనువులు మెరిసిపోయే..ఈ వేళలో.. ఈ కోణలో

ప్రియమైన మనస్సు తోడు కోరుతున్నది సరిఈడుతో..
ఇది నులివెచ్చని ప్రాయం పదమంటే పదం ఆగునా ఈ వేళలో..ఈ కోణలో..

మునిపంటిల పెదవి నలిగి పోతుంటే .. వెచ్చని సెగలు ఎదలో అలజడి రేపుతుంటే.. తొలివలపు కోరదా ఇలా..సాయం ..ఈ వేళలో..ఈ కోణలో…

ఎదలో వరదలు పొంగుకు వస్తుంటే…మదిలో కోరికలు తడుముకు వస్తుంటే..
బరువెక్కినప్రాయం పైటను జారమంటుంటే
నిలుచునా.ఈ వయస్సు అగునా.. ఈ మనస్సు
ఈ వేళలో.. ఈ కోణలో…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!