దీపపు కొమ్మ

దీపపు కొమ్మ

రచన: మీసాల చినగౌరినాయుడు

దీపపు కొమ్మకు పూసిన
మెరుపు చుక్కలన్నీ
ప్రతిఇంటి ముంగిట వాలాయి
వెలుగుల వర్షం చినుకుల్లా….

ముసురుకున్న చీకట్లన్నీ
ఆనందపు వెలుగుల్లో
అంతర్ధానమైనాయి
తిరిగిరానని చెయ్యూపుతూ…

ఆశల ఊసులన్నీ కట్టకట్టుకొని
తారాజువ్వలపై పయనించి
ధైర్యపువాక్యాలు నేర్చాయి
చిచ్చుబుడ్డీల వెలుగులా….

మకిలిపట్టిన మనసులకు భరోసానిస్తూ
మతాబుల రంగులశబ్దాలలో
మైమరచిన దేహం సంబరమైంది
హరివిల్లు మొలిచిన గగనంలా…

కళకళలాడే కాసులమ్మ రాకకై
ఎదురుచూసిన దీపావళి
ఇంటింటా సిరులుపొంగించాలి
చెడుపై సాధించిన మంచిలా…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!