తెలియని ఆనందం

(అంశము:: “కొసమెరుపు కథలు”)

తెలియని ఆనందం

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

ఆఫిసునుండి ఇంటికి నడచి వెళ్ళాల్సి వచ్చింది రాజుకి. వడివడిగా అడుగులు వేస్తున్నాడు.కనీసం అరగంటపైనే పడుతుంది ఇల్లుచేరుకోవడానికి. బైక మీద పదినిముషాల్లో చేరేవాడు.
“ఆగవోయ్ రాజు!”ఎవరో పిలుస్తున్నారు.
ఎవరా అని వెనుదిరిగిచూశాడు.
ఎదురుగా చిరునవ్వు చిందిస్తూ చిన్ననాటి మిత్రుడు చిరంజీవి. ఆశ్చర్యంగా చూశాడతనివైపు. బాగా లావయ్యాడు.చదువుకునేరోజుల్లో సన్నంగా ఉండేవాడు. అప్పటి చిరంజీవేనా అనిపించింది రాజుకి.
“ఏమిటోయ్ అలా దిష్టి పెట్టినట్టు చూస్తున్నావ్.” అదే చిరునవ్వుతో చిరంజీవి
“ఏమిలేదు అంతలా మారిపోయావేమిటా అని చూస్తున్నా. నువ్వు ఇక్కడ. చాలా సంవత్సరాలైంది కదా మనం కలుసుకొని” రాజు తన సందేహన్నితెలిపాడు.
“నెలరోజులైంది ఇక్కడికి బదలిపై వచ్చి. వచ్చిన దగ్గరనుంచి నిన్ను కలవాలని అనుకుంటున్నాను ఈరోజు కుదిరింది.” చిరంజివి సమాధానం.
“ఇక్కడికి దగ్ఖరే మా ఇల్లు పద తీరుబాటుగా కూర్చొని మాట్లాడుకుందాం” రాజు చెప్పాడు.
ఇద్దరూ రాజు ఇంటికి చేరుకున్నారు.
కాస్సేపు కుశలప్రశ్నలయ్యాక చిరంజీవి వెళ్ళిపోయాడు. రాజు స్నేహితుడిని సాగనంపాడు.

చిరంజీవి తను అద్దెకు తీసుకున్న ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో ఫోను రింగైంది. కూతురు సుమనుంచి.
“హలో చెప్పుతల్లి.ఇంకా నీనుంచి ఫోను రాలేదేమిటా అని అనుకుంటున్నాను. ఏమిటి విశేషాలు. నేను చెప్పిన విషయం ఏంచేశావు. నాకు ఆలోచించుకొని
చెప్పమన్నాను కదా. నీ అభిప్రాయం చెబితే నేను ముందుకు వెళ్తాను.”కూతురితో మాట్లాడాడు చిరంజీవి.
“చెప్పడానికేమి లేదు డాడి. నేను వస్తున్నాను. నేను వచ్చాక మాట్లాడుకుందాం” సుమ జవాబు.
“అంతేనా.సరే నీ జాబు ఎలావుంది. వర్కు ప్రెషర్ తగ్గిందా ఏమైనా” చిరంజివి
“ఇప్పుడు కొంత పర్వాలేదు డాడి. కొత్త ష్టాపు చేరారు. కొంచెం రిలాక్సింగా వుంది. అందుకే సెలవు పెట్టి వస్తున్నా.” సుమ జవాబు.
“సరే వచ్చాక మాట్లాడు కుందాం. మీ అమ్మకి ఫోను చెయ్యాలి. రెండ్రోజులైంది తనతో మాట్లాడి” అంటూచిరంజీవి ఫోను ఉంచేశాడు.
“అవునా.నేనూ ఇప్పుడే అమ్మతో మాట్లాడాను. తనూ ఒకటే గొడవ. మీకు చెప్పినట్టే తనకి చెప్పాను. నేనొచ్చెసరికి అమ్మ కూడా అక్కడికి వచ్చేస్తుంది కదా” సుమ.
“రేపే వెళ్ళి తీసుకొస్తాను. ఇల్లు అది చూడడంలో కొంచెం ఆలస్యమైంది. ఎందుకు గొడవచెయ్యదూ. నీకు తెలుసుగా అమ్మ ఆరోగ్యం బాగాలేదని. అందుకే ఇద్దరం తొందరపెడుతున్నాం. నువ్వేమో ఏమి తేల్చవు” చిరంజీవి కొంచెం నిష్టూరంగా మాట్లాడాడు.
“ఇక వస్తున్నాను కదా డాడి . మీరేం వర్రి కాకండి”సుమ సమాధానం.
“సరే ఇక వుంటాను”ఫోను కట్ చేశాడు చిరంజీవి.

“నాన్న రేపు నేను వస్తున్నాను. సెలవులు ఒ వారం రోజులు దొరికాయి.అమ్మా మీరు ఏలా వున్నారు ? వచ్చేక వివరంగా అన్నీ మాట్లాడు కోవచ్చు” సుధీర్తండ్రికి ఫోను.
“చాలా సంతోషంరా బాబు. ఇంకా నేనే ఫోను చేద్దాం అనుకుంటున్నాను నువ్వే చేశావు. అమ్మా నేను బాగానే వున్నాం. నవ్వే ఎలాగున్నావోనని మీ అమ్మకి
ఒకటే దిగులు. నన్ను సెలవు పెట్టమని ఒకటే పోరు పెడుతోంది. ఇక వుంటాను” రాజు కొడుకు సుధీర్ తోమాట్లాడాడు.
“ఏంటోయ్ రాజు ఏం చేస్తున్నావు?”అంటూ చిరంజీవి వచ్చాడు రాజు దగ్గరికి.
“ఈ రోజు ఆదివారం కదా ఏవో చిన్న చిన్న పనులు చేసి మా ఆవిడకు సహాయం చేస్తున్నాలే” రాజు చెప్పాడు.
“ఆదివారమనే నేను మా ఇంటికి మీ ఇద్దరిని పిలుద్దామని వచ్చాను. అన్నట్టు మీ అబ్బాయి సుధీర్ ఎలా వున్నాడు. ఏం చేస్తున్నాడు? పెళ్ళయ్యిందా? అవకపోతే మా అమ్మాయి సుమని చేసుకోకూడదు కోడలిగా. చిన్నప్పుడు వాళ్ళిద్దరూ బాగా కలిసి మెలిసి వుండేవారుగా.” చిరంజీవి రాజుతో అన్నాడు.
“అవును సుమా .నాకు తోచలేదు. మన స్నేహం బంధుత్వంగా మారుతుందంటే అంతకన్నా ఇంకేం కావాలి.” రాజు సంబరపడిపోయాడు.
రాజు ఇంటి ముందు ఆటో ఆగింది. అందులోంచి ఒక జంట దిగారు. సరాసరి ఇంటిలోకి వచ్చి రాజు కాళ్ళకి దండం పెట్టి “మమల్ని ఆశీర్వదించండి నాన్నా” అంటూ పలికాడు.
ఆ వచ్చింది రాజు కొడుకు సుధీర్ చిరంజీవి కూతురు సుమ. అక్కడ రాజు చిరంజీవులు అవాక్కయ్యారు. ఏదో తెలియని ఆనందం వారిద్దరిని ఆవహించింది.

***.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!