కళా శ్రద్ద

(అంశము:: “కొసమెరుపు కథలు”)

కళా శ్రద్ద

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడి కన్నా ముందు లేచి మనవరాలు కీర్తినీ నిద్ర లేపి పనులు మొదలు పెడుతుంది.
సుభద్ర ఒక స్కూల్ హెచ్ ఎం చేసి రిటైర్ అయ్యింది. కూతురు బిడ్డ కీర్తి, సుభద్ర కూతురు సంధ్య సాఫ్టు వేర్ ఇంజినీర్. టైమ్ లేదు పిల్లను సాకడం కస్టమ్ రెండో పిల్లవాడు తల్లి దగ్గర ఉంటాడు అయాను పెట్టుకుని చూసుకుంటుంది. అయితే కీర్తి అమ్మమ్మ దగ్గర బాగా అలవాటు పడింది
మంచి అల్పాహారం. వంటకాలు అమ్మమ్మ పెడుతుంది.
అమ్మ ఎప్పుడూ బ్రేడ్ జామ్ కెలక్స్ కార్న్ ఫ్లోర్ బిషట్స్ అంటుంది. అమ్మమ్మ అయితే రుచికరమైన వంటలు పెడుతుంది తాత కూడ బాగా చూస్తారు.
అయితే తంటా ఏమిటంటే, తెల్లవారకుండా లేపి పద్యాలు పాటలు నేర్పుతూ ఉంటుంది.
నా స్నేహితులు ఉదయం బాగా తెల్లవారక లేస్తారు కానీ తనకు అన్ని తెల్లవారక ముందే నేర్పుతుంది. సాయంత్రం సంగీతం మాస్టారు వచ్చి వీణా నేర్పుతారు.
సంగీతం లక్షకి ఒకళ్ళు నేర్చుకుంటే వీణా కోటికి ఒకరు నేర్చుకుంటారు అసలు నేర్పే మాస్టారు దొరకడం నీ అదృష్టం అంటుంది

పద్యాలు పాటల వల్ల నాలిక బాగా పలుకుతుంది సరా అనేది.
సాయంత్రం కూడా అట గట్రా లేదు మాస్టారు వస్తె ఓ గంట చెపుతారు. ఆ తరువాత తాత గారితో మాట్లాడుతారు. ఇలా కీర్తి టెన్త్ కి వచ్చే టప్పటికి బాగా విద్యలు నేర్చుకున్నది. దానికి తోడు రేడియో యువ వాణి కార్య క్రమం బాలానందం నుంచి సెలెక్ట్ చేశారు.
పద్య పోటీల్లో మొదటి బహుమతి వచ్చింది వీణలో మొదటి బహుమతి వచ్చి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యింది.
డిగ్రీలో చేరే నాటికి మంచి కీర్తి వచ్చింది బీ గ్రేడ్ ఆర్టిస్ట్ గా రేడియో ఆ తరువాత టీవీ కార్యక్రమాలలో పాల్గొంటుంది.
దీనికి కారణం బాల్యం నుంచి కళల్లో ప్రవేశం ఆతరువాత నిరంతర సాధన వల్ల చాలా బాగా ఎదిగింది.
చిన్నప్పుడు అమ్మమ్మని కొప్పడేది, ఇప్పుడు బహుమతులు నీవా నావా అన్నది.
అవును అమ్మమ్మ అప్పుడు అంతా బాగా నేర్పావు కనుక.
ఈ రోజు ఇంత బాగా ఎదిగా అని మెచ్చుకున్నది స్నేహితురాలితో కూడా ఇదే చెప్పింది అందరూ కాలేజీలో ఎంతో పొగిడారు, అంతే కాదు కాలేజి సింగర్ గా బిరుదు ఇచ్చారు.
చిన్న వయస్సులో ఎదగడానికి కారణం బాల్య విద్య.

కొస మెరుపు
అందరూ బాల్యం నుంచికృషి చేస్తే గాని శ్రద్ద చూపితే గాని కళలు రాణించ వలెనంటే సదా సాధన కావాలి, దానికి పెద్దల అశీస్సులు కావాలి.

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!