మూఢనమ్మకాలు 

(అంశం:”అపశకునం”) 

మూఢనమ్మకాలు 

రచన :: చెరుకు శైలజ

అమ్మ టిఫిన్ బాక్స్ అంటు ఆఫీస్కి బయలుదేరుతున్నా రవళి వంటఇంట్లో ఉన్న తల్లి భారతిని అడిగింది. ఇదిగో అంటు బాక్స్ ఇచ్చి టిఫిన్ తినవా అంది.
లేదమ్మా టైం లేదు. కొంచెం ముందు లేస్తే అన్నంటికి టైం సరిపోతుంది కదా! ఏం తినకుండా వెళితే ఎలా! సరే అమ్మా అక్కడ ఏదో తింటా లే అంటు గేట్ దాకా వెళ్ళగానే తండ్రి పురుషోత్తరావు తుమ్మాడు. అయ్యే మీరు ఇప్పుడే తుమ్మలా అమ్మ రవళి ఆగవే.
ఒక నిమిషం కూర్చొని వెళ్లు అబ్బా అమ్మా ఏమిటి? నీ గోల నాకు అసలే టైం లేదు. బస్ వెళ్లి పోతుంది అని హడావుడిగా వెళ్లిపోయింది.
ఏం పిల్లలో ఏమో ఏది చెవినా పెట్టారు. అంటు గొణుక్కుంటు లోపలికి వచ్చింది
ఏమిటే ?నీ చాదస్తం వెళ్లేదానిని మరి ఆపావు.
సరే లేండి, నేను చాదస్తమా మీరు తుమ్మిది చాలక తుమ్ము వస్తే కాసేపు ఆపుకోలేరా!
మీకు కూడా అన్ని చెప్పాలి. ఏం తిప్పలు పుడుతుందో? ఏమిటో?
పెళ్లి కావలిసిన పిల్ల అని అనుకుంటు వంటింట్లో కి వెళ్లింది. భారతి పురుషోత్తమరావుకి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నళిని పెళ్లి చేశారు. రెండో కూతురు రవళి చదువు అయిపోయి జాబ్ చేస్తుంది.
పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఇప్పుడే వద్దు నాన్న గారు
నేను ఒక రెండు సంవత్సరాలు జాబ్ చేసి పెళ్లి చేసుకుంటాను అంది.
కూతురు మాటను కాదనలేక ఊరుకున్నారు. భారతికి కొంచెం పట్టింపులు ఎక్కువ ఎవరైనా ఎటు అయిన బయలుదేరుతుఉంటే తుమ్మితే ఆగిపోతుంది.ఆలాగే బల్లి మీద పడితే వెంటనే బంగారు బల్లి ఎవరు ముట్టుకున్నారు అని తెలుసుకొని వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి స్నానం చేస్తుంది.
అలాగే తనకు పిల్లి ఎదురైనన అపశకునం అని తలచి వెంటనేఇంటికి తిరిగి వస్తుంది.
పెద్ద కూతురు నళిని కూడా తల్లి లాగే అన్ని పాటిస్తుంది. రవళి మాత్రం లెక్క చేయదు.
రవళికి బస్ మిస్ అయింది.ఈ అమ్మ చాదస్తం వలన ఇలా జరిగింది. నన్ను ఆపి ఏదో మాట్లాడంతో ఆలస్యం అయింది బస్ వెళ్లి పొయింది.
చేసేదీ ఏమి లేక ఆటోలో వెళ్లింది.ఆఫీస్కి లేట్ వలన ఏదైన టిఫిన్ తెప్పించుకునే టైం దొరుకలేదు.అందరు లేట్గా వెళ్లిన ఆమె నే చూడడంవలన ఏదోలా అనిపించింది.
తను టెలికమ్యూనికేషన్సులో పని చేస్తుంది. పని ఎక్కువ వలన ఏమి తెలియలేదు. లంచ్ టైం అయ్యింది. లంచ్ చేసి మరల వర్క్ లో మునిగింది.
సాయంత్రం 6 గంటలకు తలనొప్పితో ఇంటికి వస్తునే ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని అమ్మ వేడి టీ ఇవ్వవే చాలా తలనొప్పి అంటు పడుకుంది .
భారతి టీ చేసి కూతురికి ఇచ్చి
నేను చెప్పాలే కొంచెం కూర్చుని పోతే అయిపోయెది. అమ్మ ఊరుకో టైం దొరికితే చాలు
అదే విషయం
నీకు ఈ మధ్య ఎప్పుడైన తలనొప్పి వచ్చిందా!
నీ వలన ఆఫీస్కి లేట్ అయింది. దానితో టెన్షన్తో ఆటోలోఆఫిస్కి వెళ్లాను. టిఫిన్ తెప్పించుకునే టైంలేదు. దానితో తలనొప్పి అంతే
రవళి వేడిగా టీ తాగుతు రా! అమ్మా ఇక్కడ కూర్చో అని తల్లినీ మంచం మీద తన పక్కనే కూర్చోమంది.
చూడు అమ్మ మీ నమ్మకాలు మీవి
మీ అమ్మ వాళ్ళ కాలంలో ఇలా జరగడం వలన ఏదో జరిగి ఉంటుంది.
అసలైతే దానికి ఏదో సైంటిఫిక్ రిజైన్ ఉండే ఉంటుంది.
అలా చెప్పాకుండ దానిని అపశకునంతో చెప్పితే జనం భయంతో వింటరని అని వారి ఉద్దేశం.
ఏం కథ చెప్పవే? మరి బల్లి పడితే దానికేమిటి?
ఏం లేదు బలి విషం కదా!
మీద పడితే ఏదైనా ఎలర్జీ వస్తుంది. అందుకే స్నానం చేసి బట్టలు మార్చుకోవడం
బల్లిని చూసేసరికి ఒక విధమైన భయం ,అసహ్యం దాని నుండి బయట పడడానికే బంగారు బల్లిని ముట్టుకున్నా వారికి దండం పెట్టుకోనడం .ఆ భయం నుండి ధైర్యం రావడానికే ఇవన్నీ చేయడం. దీనిని
మీ అమ్మలు వాళ్ళ అమ్మలు కొండంతలు చేసి అపశకునాలు అని చెప్పి మీరు భయపడుతు అందరిని భయపెట్టడం చేస్తున్నారు.
పిల్లి ఎదురు పడితే అలాగే అపశకునం అని తిట్టుకుంటారు. ఆ పిల్లి కూడ మన లాగే ఒక జీవి దానికి అపశకునం ఏమిటి‌?దానికి మన లాగే జ్ఞానం వుంటే మనిషిని కూడా అపశకునం అనుకుంటే ఎలా? అందుకు అందరు అపశకునం అనుకోకుండా మంచి ఆలోచనలతోనే జీవితాన్ని గడపాలి.
అంతా పురాణం లాగా చెప్పిన కూతురిని అలాగే చూస్తూ బాగానే చెప్పావు. కాని మా మైండ్లో ఉన్నది ఎలా పోతుంది. ఎందుకు పోదు దాని గురించి ఆలోచించడం మానేసి అంటు భర్త పురుషోత్తమరావు వచ్చాడు.
సరే లేండి మీకు సందు దొరికింది. ఇది అంతా మీరు తుమ్మడం వలనే జరిగింది .ఏమే మనిషి అన్ని వాడు తుమ్మక ఎలా ఉంటాడు. తుమ్మాలి కాని ఎవరైనా బయలుదేరేటపుడు పని గట్టుకొని తుమ్మడం
ఒక నిమిషం ఆపుకోలేరా! సరిపోయింది ఇప్పుడేం అయిందని అంతా గోల ఏం కాలేదు. చిన్న తలనొప్పి తో పోయింది. అదే ఇంకా ఏమైనా అయితే అంటు తలపెట్టుకొని వంట ఇంట్లోకి వెళ్లుతున్న భారతిని చూస్తూ, నాన్న అమ్మను మార్చడం మనతరం కాదు .అది అంతేనే నేనే మార్చలేకపోయాను. నీనించి ఏమైవుతుంది .ఆ పై వాడే చూడాలి. అంటు నవ్వుతు కూతురు పక్కనే కూర్చున్నాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!