చిన్న జంతువులు మార్చిన ఊరు 

(అంశం:”అపశకునం”) 

చిన్న జంతువులు మార్చిన ఊరు 

రచన :: జయ

రోజులు మారాయి,ప్రపంచం మొత్తము మారిపోయింది. రాను రాను ప్రజల జీవన విధానం లో మార్పు వస్తుంది. ఆలోచన విధానంలో మార్పులు వస్తున్నాయి కానీ సీతారామపురం ఊరి ప్రజలలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు సరి కదా ఇంకా ఇంకా చాద్దతం పెరిగిపోతూ వస్తుంది.

ఈ ఊరిలో దాదాపు మూడువేల మంది ప్రజలు నివసిస్తున్నారు, ఇది ఒక చిన్న ఊరు, ఈ ఊరే వీరికి ప్రపంచం.ఈ ఊరి లోకి బయట ఊరు ప్రజలు వచ్చి కనీసం రెండు రోజులు కూడా ఉండలేరు.
అక్కడ ఆడపిల్లల పరిస్థితి అయితే మహా దారుణం. బడికి వెళ్ళనివ్వరు, ఊరు దాటనివ్వరు,ఇక భర్త చనిపోయిన ఆడవాళ్ల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు.

సీతారామపురం కి తూర్పు వైపు చిన్న అడవి ఉంటుంది. దానిలో క్రూరమైన జంతువులు ఉండవు కానీ,చిన్ని చిన్ని జంతువులు,పక్షులు ఆ అడవిలో నివసిస్తూ ఆహారం కోసం  ఊరులోకి వస్తూ ఉండేవి. కానీ అక్కడి ప్రజలు వాటిని కనిపించనిచ్చేవారు కాదు.కానీ ఆ చిన్ని ప్రాణులకు ఆ ఊరే ఆధారం ఎందుకు అంటే చుట్టు పక్కల వేరే ఊరు లేదు.

ఒక రోజు ఆ అడవిలోని చిన్ని జంతువులు,పక్షులు ఎప్పుడు చీకటి పడుతుందా ఊరు ప్రజలు ఎప్పుడు నిద్రపోతారో అప్పుడు ఊరిలో కి ఆహారం కోసం వెళ్ళడానికి ఒక చోట కాచుకొని కూర్చున్నాయి.
ఈ లోపు ఎక్కడి నుంచో ఏడుపులు వినిపించి అన్ని పొదల మాటున దాకున్నాయి. ఎక్కడి నుంచి ఆ ఏడుపు వినిపిస్తుంది అని ఒక అమ్మాయి ఏడుస్తు అడవికి దగ్గరలో ఉన్న పాడుబడిన నూతి దగ్గరికి వచ్చి.

నేనా చిన్నవయస్సులో పెళ్ళి చేయమన్ననా,నేనా నా భర్తను చావమని చెప్పనా. లేదు కదా మరి ఎందుకు అందరూ నన్ను నింధిస్తారు. నన్ను ఏదో నేరం,గోరం చేసినట్టు చూస్తారు.నేను ఎదురొస్తే పాపం అంట, అస్సలు నా మొఖం చూస్తేనే దరిద్రం అంట. ప్రతి దానికి చీదరించుకోవడం,చప్పిడి తిండి, కటికనేల మీద పడక, అతను చనిపోతే నాకు ఈ శిక్ష ఏమిటి.నేను భరించలేక పోతున్న.
ఈ ఊరికి,ఈ ప్రజలకి వెల కోటి నమస్కారాలు.
ఈశ్వరా ఈ బ్రతుకు నేను ఇక బ్రతకలెను. నన్ను నీలో ఐక్యం చేసుకో  అని ఏడుస్తూ నూతిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుండగా,ఈ జంతువులకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.
పాపం మన పరిస్థితే ఇలా ఉంది అనుకుంటే .
ఈ అమ్మాయి పరిస్థితి మరీ దారుణం గా ఉంది.
ఇప్పుడు ఈ అమ్మయిని ఎలా కాపాడాలి అని పొద చాటు నుంచి అన్ని ఆ నూతి చుట్టూ చేరాయి.
ఆ అమ్మాయి కి ఆ జంతువులు ను ఆశ్చర్యంగా చూస్తూ నేను చనిపోతే నన్ను తినడానికి వచ్చాయా లేక నన్ను కాపాడటానికి వచ్చయా అని సందేహం గా చూస్తూ ,ఏదైతే ఏంటి లే చావబోయే దానికి అన్ని కళ్ళు మూసుకొని శివున్ని తలుచుకుంటూ దూకపోయేదాన్ని ఒక అతను ఆపుతాడు.
చూడు అమ్మ, నీ చావుతో ఊరి జనం బాగుపడదు సరికదా, నీకు ప్రయజనం ఉండదు. అందులోని ఆత్మహత్య మహానేరం. ఈశ్వరుడు ఇచ్చిన జీవాన్ని నువ్వు ఎలా బలవంతంగా తీయగలవు.
ఈ ఊరి ప్రజలను మార్చే యజ్ఞం చెయ్యాలి.
ఆ మాట విని అక్కడ ఉన్న జంతువులు అన్ని కూడా సంబరపడి గెంతులు వేసుకుంటూ మార్చండి అప్పుడైన మా కడుపులు నిండుతాయి. అయినా మేము ఏమైనా వాళ్ళు వండుకున్నది తినేస్తున్నమా,లేదు కదా వాళ్ళు పారేసినవి గా తినేది.
అస్సలు ఈ సృష్టిలో ప్రతిజీవి యొక్క ఉపయోగం వీళ్ల కు తెలియాలి.అంటూ స్వామీజీ అన్న మాటలకు,
అస్సలు మనుష్యులు తల రాతలకు జంతువులకు సంబంధం ఏమిటి స్వామి వీళ్ళు మేము ఎదురొస్తే ఏదో కీడు అంటూ మమ్మల్ని తిడుతూ కొడుతూ ఉంటారు అంటూ ఓ పిల్లి తన ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ లోపు కాకి కూడా మేము అరిస్తే చూట్టాలు వస్తారు అంట అని కాకి,మేము ఆకలితో అరుస్తాము ఎవరు వచ్చేది,రానిది మాకు మాత్రం ఎలా తెలుస్తుంది.

స్వామీజీ సరే అమ్మాయి,చూడండి జీవులరా నేను చెప్పేది శ్రద్ధగా వినండి.
మీకు కావలిసిన ఆహారం నేను ఇస్తా. మీరు మటికి కొద్దీ రోజులు ఆ ఊరిలోకి వెళ్ళకండి.
అమ్మాయి నువ్వు ఒక పని చెయ్యి. నీ తోటి ఆడవారిని,నీలా ఇబ్బంది పడే అమ్మాయిలను మిమ్ము బాధ పెట్టె వాళ్లకి ఎదురుతిరగమని చెప్పు. ఇంట్లో ఎటువంటి పనులు చేయకండి ఒక మూల కూర్చోండి. ఏమైనా అంటే సమాధానం చెప్పండి,మేము ఎదురొస్తే అపశకునం అంటారు. మేము మీ పనులు చేస్తే ఎటువంటి అపశకునం ఉండదా మేము చెయ్యము అని కచ్చితంగా చెప్పండి,కొడతారు పడండి, తిడతారు తిట్టనివ్వండి మీరు మటికి ధైర్యంగా ఉండండి,కొద్దీ రోజులు అలా ఉంటే,జీవితాతం సంతోషం గా జీవించొచ్చు,మీతో పాటు మీ ఊరి లో వాళ్ళు,మీ పిల్లలు, మీ తరువాత తరం వారు కూడా.
పరిస్థితి విషమంగా మారి నప్పుడు మళ్ళీ నేను వస్తా అంటూ అక్కడి నుంచి స్వామీజీ వెళ్లిపోయారు.
అతను చెప్పినట్టే ఆ అమ్మాయి లు, కుక్కలు,పిల్లులు కానీ,కాకులు కానీ,చిన్న చిన్న పురుగులు కానీ ఊరిలో అడుగుపెట్టలేదు.

అలా ఒక వారం గడిచే కొద్దీ ఊరు లో చెత్త పేరుకుపోయి ఊరు అంతా దుర్వాసన రావడం మొదలు అయ్యింది.మరో పక్కఇళ్ళల్లోను,పంట చెల్లల్లో ను ఎలుకలు దాడి చెయ్యడం మొదలు పెట్టాయి.
ఇటు ఆడ పిల్లలు పనులు చెయ్యము అంటూ బిష్మించు కొని కూర్చున్నారు.
ఈ ఊరు కి ఏదో జరుగుతుంది ,ఏదో పీడపట్టుకుంది అని శాంతులు,హోమాలు జరిపించారు కానీ ఊరు ప్రజలు అస్సలు విషయం గుర్తించలేకపోయారు.
అలా నెల గడిచే కొద్దీ ఊరు పరిస్థితి మరి దారుణంగా తయారు అయ్యింది.
జనాలకు కొత్త గా రోగాలు రావడం మొదలైంది.

ఊరి ప్రజల్లో నెమ్మదిగా భయం మొదలుఅయ్యింది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరు చెప్పలేకపోయారు.
అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ఊరు కి ఏదో గ్రహణం పట్టనట్టు ఉంది మనం ఊరు విడిచి పెట్టి ఎక్కడికైనా వీస్ళ్లిపోవలిసిందే అని పెద్దలు అంతా అనుకుంటూ ఉండగా స్వామీజీ అక్కడకు వచ్చారు.
ఏమైంది మీ అందరికి ఊరు వదిలిపెట్టి వెళ్ళినంత మాత్రాన మీ సమస్య తీరదు.
ఊరిలో లేదు తప్పు,మిలో మీ ఆలోచనలు లో ఉంది.
తప్పు మీరు చేసి ఊరిని ఎందుకు నింధిస్తారు.
స్వామి జి మాటలకు అందరు అలా ఉండిపోయారు ,మేమా మేము ఏమి చేసాము.
అని అడగగా ఒక సారి ఆలోచించండి, గత కొన్ని రోజులు గా మీ ఊరిలో ఏమి జరుగుతుందో.
అని అనగా అందరు ఆలోచనలో పడ్డారు. అందులో ఒక పెద్దాయన లేచి మా ఆడపిల్లలుకు దెయ్యం పట్టింది అందుకే వారు మొండిగా తయారుఅయ్యారు.
అప్పుడు స్వామీజీ వారికి దెయ్యం కాదు జ్ఞానం వచ్చింది. ఆడ వాళ్ళు మనుష్యులే గా వారిని ఎప్పుడైనా అలా చూసారా మీరు,వారితో పనులు చేయించుకుంటారు కానీ వారికి ఒక మనస్సు ఉంటుంది అని ఎప్పుడైయినా ఆలోచించారా.
భర్త చనిపోతే వారి తప్పేమీ ఉంది వారు ఏదో మహా నేరం చేసినట్టు వారి మీదా అపశకునం అని ముద్ర వేస్తారు.
అవును మేము చేసింది తప్పే అని,ఇక మీదట అలా చెయ్యము అని చెబుతారు.
ఇంకో ఆయన లేచి కొన్ని రోజులుగా గమనించినా మా ఊర్లో ఒక కుక్క కానీ,పిల్లికానీ,కాకి కానీ చూడలేదు అని చెప్పగా.
హా ఇప్పుడు తెలిసిందా కాకి మీరు పాడేసిన ఎంగిలి మెతుకు లు తింటూ మీ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుతుంది. దాన్ని మీరు కాకి అరిస్తే ఎవరో వస్తారు ,ఏదో జరిగిపోతున్నట్లు దాన్ని అరవనివ్వరు.
ఇక పిల్లి ఎదురైతే అపశకునం మా అని ఏ దేవుడు చెప్పాడు మీకు అయినా మీ జీవుతాల్లో జరిగే వాటికి ఏమి సంబంధం.
అవి మీ ఊరి లో వుండే ఎలుకలు ను చిన్న చిన్న వాటిని తిని బ్రతుకుతుంది,ఆ ఎలుకలు వల్ల మీ ఆహర పదార్థాలు, పంట పొలాలు నాశనం అయ్యాయి అంతే.
ఇప్పటికైనా గ్రహించండి సృష్టిలో ప్రతి జీవి అవసరమే, ఒకో జీవి పుట్టుకకు ఒకో కారణం కచ్చితంగా ఉంది ఉంటుంది.
అంతే కాని మనుష్యులు కు మాత్రమే ఈ భూమి మీద అధికారం ఉన్నట్టు ప్రవర్తించకండి.
ఒక జీవి తన పని ని చెయ్య కపొతే ఏమి జరుగుతుందో మీరు స్వయం గా చూసారు కదా. ఇప్పటికైనా మీ మూఢనమ్మకాలు, అపశకునాలు, అన్ని వదిలి పెట్టి ,ప్రతి జీవిని గౌరవిస్తూ, వాటి విధిని వాటిని నిర్వహించనివ్వండి,
ఆడ వారిని గౌరవించండి.
అందరిని సమానంగా చూడటం నేర్చుకోండి అని స్వామీ జి అక్కడ నుంచి వెళ్లిపోతారు. అప్పటి నుంచి సీతారామపురం మూఢనమ్మకాలు వదిలి మంచిగా జీవిస్తున్నారు.
ఇక జసంతువులు కూడా సంతోషం గా ఉంటూ వాటి కడుపు నింపుకుంటూ హాయిగా జీవిస్తున్నాయి.
ఇది అండి మా చిన్న జంతువులు మార్చిన ఊరు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!