స్వర్గప్రాప్తి

(అంశం:”అపశకునం”) 

స్వర్గప్రాప్తి 

రచన :: యాంబాకం

సింగారనగరంలో ఒక సంగీతసారంగుడు ఉండేవాడు. సారంగుడు పరమ భక్తుడు. ప్రతి దినము శివపూజచేయందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడు. శివపూజ చేయకపోతే “అపశకునం”గా బావిస్తాడు. ఆయనకు రంజని అనే అమె తో వివాహం జరిగింది. భార్యతో కలిసి కాపురం చేసుకొంటూ జీవిస్తున్నాడు. ఆ దంపతులకు సంతాన యోగం కనిపించలేదు. ఇరుగుపొరుగు వారు వారిని చూసి “అపశకున మాటలు అంటూ” ఉండేవారు.రంజని ఎక్కడన్న పేరంటాలలో నీళ్లుబావి దగ్గర ఎదురొచ్చిన, ఆనగరంవాళ్ళు “అపశకునం “గా బావించేవారు. ఆ దంపతులు సంతానం లేక పోవడమే “అపశకునం “అనుకొని వారిలో వారే బాధపడుతూఉండేవారు.
ఒకరోజు ఆనగరంలోనికి ఒక జంగమదేవర భిచ్చాటనకు వచ్చారు. ఆ జంగమదేవరుని సారంగుడు,రంజని ఇద్దరు కలసి దేవర ఒకసారి మీరు మాఇంటికి దయచేసి భిక్ష ఆరగించి పోవలసినదిగా మా కోరిక అని విన్నవించగా జంగమదేవర ఆ దంపతులను దీవించి మీకు పుత్ర సంతాన యోగం ఉంది.మీ పుత్రునికి “స్వర్గప్రాప్తి ” పొందుతాడు అని వారిని దీవించి పంపారు.
జంగమదేవర దీవించిన కొద్ది కాలనీకే వారికి ఒక కుమారుడు కలిగాడు. వాడికి సర్వజిత్ అని పేరు పెట్టారు. సారంగుదంపతులకు లేక లేక పుట్టిన కొడుకుని చూసుకొని ఎంతోగారాబంగాపెంచసాగారు. కాని ఇరుగు పొరుగు వారు మీ కుమారుడికి స్వర్గప్రాప్తి ఉందంట కదా !మీకన్న ముందే స్వర్గానికి వెళతాడా! అని “అపశకునం “పలికేవారు. ఆమాటలుసారంగుడికి,రంజకి బాధను కలిగించేవి.
సారంగుడు వృతిరిత్యా తీరికలేక పోవడంతో కొడుకు ఆలన పాలన సారంగుడు స్వయంగా శ్రద్ద వహించ లేకపోయాడు. తల్లి గారాబం సర్వజిత్ని బాగా పాడుచేసింది.
కొంత కాలానికి సారంగుడు సర్వజిత్ని వేదపాఠశాలలో. చేర్పించివిద్య ,బుద్దులు,నేర్పించ సాగాడు. సర్వజిత్ కి చిన్నతనంలోనే చదువు మీద కన్నా చేడు అలవాట్లకు బానిస అయినాడు.ముఖ్యంగా జూదంలో ఎక్కువ ఆసక్తి పుట్టింది.జూదంలో వాడు బాకీలుపడి ఇంటికి వచ్చి తల్లికి చేప్పేవాడు.అమె కొడుకు మీద వాత్సల్యం తో ఇవి ఏమి భర్త కుచెప్పకుండా బాకీ తీర్చమని తన పెట్టెలో దాచుకొని ఉన్న సొమ్ము ,వస్తువు ఎదో ఒకటితీసి వాడికిచ్చేది.
ఎప్పడైనా సారంగుడు, సర్వజిత్ విషయం అడిగితే భార్య “వాడు చక్కగా చదువుతున్నాడు. బుద్ధిగా మసలుతున్నాడు” అన్నరీతిలో జవాబు చెబుతూవచ్చేది.
ఒక రోజు సారంగుడు ఇంటికి వస్తుండగా దారిలో పాఠశాల ఉపాధ్యాయుడు కలుగచేసుకొని సర్వజిత్ మీ అబ్బాయే కదండి అంటూ! వాడు పాఠశాలకు సక్రమగా రావడంలేదని పైగా జూదం వగైరా అలవాట్లు ఉన్నట్లు గా ఇంకా మీరు కలగ చేసుకోపోతే సర్వజిత్ దేనికి పనికిరాకుండా పోతాడని చెప్పడంతో సారంగుడికి కొడుకుపైన అంతులేని కోపంతో “మావాడు జూదం ఆడుతాడా!”అని సారంగుడు ఆశ్చర్యంగా అడిగాడు.?
“మీకింకా తెలియదా? వాడికీ రాత్రి పగలు మరొకపనేలేదు”అని ఆ ఉపాధ్యాయుడు చెప్పాడు. సాగరంగుడి కి చెప్పరాని సిగ్గు,పట్టరాని కోపము వచ్చాయి. ఆయన గబగబా ఇంటికి పోయి కొడుకు గురించి భార్యతో ఉపాధ్యాయుడు చెప్పిన మాటలు చెప్పి సర్వజిత్ గురించి ఆరాతీసాడు. రంజని మౌనంగా ఉండటం చూసి సారంగుడు “ఇటువంటి కొడుకు ఉండటం కన్న పున్నామినరకం మేలు అని ఓసే! రంజని నువ్వులు పట్టుకురా! ఆ వెధవకు ఇప్పుడే తర్పణం విడిచేస్తాను” అన్నాడు భార్యతో సారంగుడు.
తన గారాల కొడుకును భర్త పెళ్లున అంతమాట అనేసరికి రంజనికి ఉక్రోషం కలిగి ఎందుకు అంత పెద్ద “అపశకునం”మాటలు వాడు మనకు ఒక్క గాను ఒక్క కొడుకు ఇలాంటి అపశకున మాటలు ఇంకెప్పుడూ మాటలాడ వద్దు అని భర్తను వారిస్తూ,ఆవిడ సర్వజిత్ ను వెనక వేసుకు వచ్చింది.
తన భార్య అలుసుతోనే కొడుకు చెడి పోవడానికి కారణం అని సారంగుడికి తెలిసిపొయింది.ఆయన తన భార్య ను, కుమారుణ్ణి తిడుతూ కేకలు వేయసాగాడు. అప్పుడే ఇల్లు చేరుకుంటున్న సర్వజిత్ ఈ కేకలు విని రహస్యంగా తన తండ్రి ఎదుట పడె ధైర్యం లేక పోయింది. వాడు వేంటనే వెనక్కు తిరిగి ఊరువిడిచిపొసాగాడు.కొడుకు ఎంత రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో సారంగదంపతులు కన్నకొడుకును తలచుకొని దేవుడా ఏమిటిది ఈ”అపశకునం”అని తలచి బాధ పడ్డారు.
సర్వజిత్ అరణ్య మార్గాన పడిపోతుండగా కొందరు అనాగరికులు చూశారు. వాడి అవతారము దుస్తులు చూసి శత్రువు అని బావించి తరమ సాగారు. సర్వజిత్ వారికి దొరికితే ఇంక ప్రాణాలు పోతాయి అని వారికంటే వేగంగా పరుగెత్తి ఓక పల్లె కు చేరుకున్నాడు.కాని తిండి తిప్పలు లేక పోవడంతోఅక్కడే చనిపోయినవారిలాపడిపోయాడు.
ఆ పల్లెలో వుండే ఒక పెద్ద మనిషి తెల్ల వారు జామున తలుపు తెరుచుకొని బయటకు వచ్చేసరికి వీధిలో అల్లంత దూరంలో పడివున్న శరీరాన్ని చూసి ఓరి దేవుడా పొద్దున్నే “అపశకునం”అనుకొంటూ నిద్రమత్తు వదిలించుకొని పెద్ద మనిషి సర్వజిత్ పడివున్న స్థలం దగ్గరకు వచ్చి సర్వజిత్ బతికి ఉన్నట్లు గమనించిన వాడై, అతన్ని లోపలికి తెచ్చి భోజనం పెట్టి, చికిత్స చేయించాడు. త్వరగానే కోలుకొన్నాడు సర్వజిత్.
పెద్ధ మనిషి సర్వజిత్ గురించి ఎమి అడగలేదు. కొంతకాలం గడిచింది. పెద్ద మనిషి కి ఒక పెళ్లి యీడు కూతురు ఉంది. పెద్ధ మనిషి కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించు కొని,సర్వజిత్ కు ఇచ్చి పెళ్లి చేసాడు. పెద్ధ మనిషి సర్వజిత్ జూదగాడని తెలియక ఎంతకాలనికి సర్వజిత్ పని చేయకుండా తిని తిరగడం పెద్ధ మనిషికి నచ్చలేదు.సర్వజిత్ జూదం అలవాట్లు ఉన్నట్లు తెలిసి కూతురిని జాగ్రత్తలు నేర్పించాడు. ఒకరోజు సర్వజిత్ భార్యతో ఎక్కడకన్న పోయి బాగా జీవిస్తామని మాయమాటలు చెప్పి, ఒకనాటి రాత్రి అమెతో సహా పెద్ద మనిషి కి తెలియ కుండా బయలుదేరాడు.ఇద్ధరు చాల దూరం ప్రయాణం చేసి ఒక పల్లెటూరికి చేరారు. పెద్ద మనిషి వారికోసం వెతికించే పక్షంలో ఈ పల్లెలోనే తలదాచుకోవటం క్షేమమని సర్వజిత్కి తోచింది.
కాని ఆ పల్లెటూరిలో సర్వజిత్ కావలసిన దేమీలేదు అందుచేత అక్కడ కొన్నాళ్ళుండి ఆతను భార్యతో సహా బయలు దేరి ఒక పట్టణం చేరుకున్నాడు. అక్కడ జూదం ఆడి జీవించే ఒకనితో స్నేహం చేసి తానుకూడ జూదం ఆటగాళ్లుతో పూర్తిగా జూదం లో మునిగి అప్పులు చెయసాగాడు.దానిలో సర్వజిత్కి నేర్పరితనం లేనందున పట్టుబడే పరిస్థితి ఏర్పడింది.అతను తన భార్య తో మళ్ళి ప్రయాణం సాగించాడు.
ఈ విధంగా సర్వజిత్ ఎక్కడ సుఖంగా బతక లేక ఒక ఊరి నుంచి మరొక ఊరికిపోతూ చిట్టి చివరకు శివపురం అనే ఊరికి చేరాడు.
అక్కడ జూదంలో మెలుకువలు చేస్తూ,చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతకడ అలవాటుగా కాలం గడపసాగాడు.
ఇంతలో శివరాత్రి వచ్చింది,శివపురంలో శివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనం గా చేస్తారు. ఎంతో మంది యాత్రికులు వస్తారని,అందరి దగ్గర సొమ్ములు ఉంటాయని స్థానికుల వలన తెలుసుకుని ఈరోజుతో తన దరిద్రం తీరి పొయిందనుకొనికుని భార్యతో అన్నాడు. భార్య” నాకు భయంగా ఉంది. మాఊరు వెళ్ళిపోదాం .నాకు పీడకళలు వస్తున్నాయి” అంది.నీవు”అపశకునం” పలకవద్దు అని భార్యతో అని నిద్రపోయాడు.
సర్వజిత్ తెల్లవారి జామునే లేచి శుభ్రంగా తలస్నానం చేశాడు.శివాలయం దగ్గర కు చేరుకున్నాడు.యాత్రికుల రద్దీగా తమ తమ మూటలు కోనేరు ఒడ్డున పెట్టి స్నానాలు చేస్తున్నారు. అడుగడుగునా రక్షక భటులు ఉండటం సర్వజిత్ గమనించి ఏమిచేయలేక పోయాడు.
అతను కోనేరు ఒడ్డుకు వచ్చి రక్షక భటులకు తెలియకుండ ఆలయంలోనికి ప్రవేశించాడు. అనేకమంది స్త్రీలు, పురుషులు ఆలయం చుట్టూ ప్రదక్షిణంచేస్తున్నారు వారిలో ఒకడుగా సర్వజిత్ కూడా ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయశాగాడు. కాని ఒక్క దొంగతనం కూడ చెయగల అవకాశం దొరకలేదు.
సూర్యాస్తమయంఅయింది.సర్వజిత్ ఆరోజల్లా పచ్చి మంచినీళ్ళు తాగి ఎరుగడు ఆకలి దహించేస్తుంది. ఆతను గుడిలోకి వెళ్లాడు శివపూజ జరుగుతూ ఉంది.
ఒక భక్తుడు ఒక కాషాయం గుడ్డ లో కొన్నిపూజద్రవ్యములు మూట కట్టుకొని తెల్లవారి జామున శివార్పన చేద్దామనే ఉద్దేశంతో ఒక మూల కూచున్నాడు.సర్వజిత్ కూడా ఆ సమీపంలోనే కూచుని పూజ చేస్తున్నట్లు నటించసాగాడు.
క్రమంగా రాత్రి నాలుగు జాములూ గడిచి అరుణోదయం వేళ అయింది.శివభక్తుడు మూటని పక్కన పెట్టి కళ్ళు మూసుకొని దైవ ప్రార్థన చేయసాగేడు. ఈ అవకాశాన్ని చూసుకొని సర్వజిత్ లేచి ఆ భక్తుని కాషాయం మూటను అపహరించి ఒక్క పరుగు తీశాడు.అయితే ప్రమాదవశాన అతని కాలు ఆ భక్తునికి తగిలింది.
ఆ భక్తుడు వెంటనే ,”దొంగదొంగ” అని కేక వేశాడు. కొంత మంది భక్తులు వెంట పడ్డారు, సర్వజిత్ఎవరికీ అందకుండాపరిగెత్తి పోసాగాడు. దారిలో తలారి ఒకడు సర్వజిత్ను సమీపించి కర్రతో ఒక్క సారిగా తలపై కొట్టాగా సర్వజిత్ గుడి ముందే ప్రాణం విడిచాడు.సర్వజిత్ భార్య కు” తన మనస్సులో ఎవో “అపశకునం” అపశకునాలు గోచరిస్తున్నాయి. కాని భర్త గురించి ఏమి తెలియక బోరుమంటుంది ఒంటరిగా!
చచ్చి పోయిన సర్వజిత్ కోసం యమధర్మరాజు వచ్చాడు కాని అతన్ని అంటటం యముడి తరం కాలేదు.యముడు చూస్తుండగానే గంధర్వ భటులు “సర్వజిత్ ని తమ పుష్పకవిమానంలోయెక్కించు కొని వెళ్ళి పోసాగారు “స్వర్గానికి” ఇంతలో యముడు స్వర్గ భటులను ఇలా అడిగాడు” సర్వజిత్ జన్మ లో ఒక్క మంచి పని చేసి యెరుగడు జూదరి,దొంగ తల్లిదండ్రులను బాధ పెట్టాడు వంచకుడు”!అని యమధర్మరాజు అనగా అది నిజమే ప్రభూ అయినా వీడు శివరాత్రి నాడు ఉదయమే లేచి తలస్నానం చేసి రోజల్లా శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు దినమంతా ఉపవాసం వున్నాడు. ఇక వీడికి పాపం ఎక్కడడిది ప్రభూ! అంటూ సర్వజిత్ ని తీసుకోని గంధర్వ భటులు స్వర్గానికి వెళ్ళి పోయారు.భర్త చనిపోయాడని ఒక భక్తుని ద్వారా తెలుసుకొని సర్వజిత్ భార్య ఇల్లు చేరి తన అత్త మామలను చేరుకొంది. కొడుకు చనిపోయిన విషయం కోడలు ద్వారా తెలుసుకున్న దంపతులు బాధపడి ఇలా అనసాగారు ఆరోజు జంగమదేవరే సాక్షాత్తు ఈశ్వరుడే అని తెలుసుకొని మానవులకు ఎన్ని “అపశకునాలు” జరిగిన “దైవబలం తోడుగా” ఉంటే “అపశకునాలు”పటాపంచలు అవుతాయని పలికి తనకమారుణ్ణి స్వర్గప్రాప్తే”.దానికి నిదర్శనంగా భావించి కోడలిలో తన కొడుకును చూసుకుంటూ సారంగ దంపతులు సంతోషంగా జీవించసాగారు.

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!