తలుచుకుంటే సాధిస్తా

తలుచుకుంటే సాధిస్తా

రచన: సుజాత. కోకిల

ప్రకృతి లో ఉన్నవి అన్ని వింతలెే
సోదరా నేను చెప్పేది వినరా
జీవితమే ఒక గాఢాంధకారం
చెడు ఆలోచన చేయకురా
ఏది మంచో ఏది చెడో ఆలోచించర అది నీ మనసుకె తెలుస్తుంది చూడరా ఏదో పోయిందంటూ కుమిలిపోతూ
కూర్చుంటే చివరకు నీకు మిగిలేది దుఖమే
అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని
జ్ఞానమనే వెలుతురులో పయనించు
అనుమానాలను మనసులో పెట్టుకొని
గాఢ అంధకారంలో కూర్చుంటే
ఎప్పటికీ ఏ పనీ చేయలేవు
మంచైనా చెడైనా చేసి చూడు ఇతరులకు
చెడు కలుగకుండా ఉంటే చాలు
ఒక్కొక్కప్పుడు నీకు మంచి జరగకపోవచ్చు
అంతమాత్రాన బుద్ధిమంతుడవు
దాని కొరకు మనస్సులో వేదన
చెందకూడదు సోదరా
విజ్ఞానమనే దీపాలను వెలిగించు
అప్పుడే విజ్ఞునిగ కొనియాడతారు.

………………………………………………..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!