కాళోజి

కాళోజి

రచన: సంజన కృతజ్ఞ

తెలంగాణ కోసం తన జీవితాన్ని
అంకితం చేసిన ప్రజల మనిషి.
తన కవిత్వంతో స్వరాష్ట్ర
ఆకాంక్షను రగిలించిన
ప్రజాకవి కాళోజి .

కాళోజి తెలుగు , హిందీ , ఇంగ్లీషు ,కన్నడ
భాషల్లో రచయితగా
ప్రఖ్యాతిగాంచాడు.

తెలంగాణ ప్రజల ఆర్తి ,ఆవేదన ,ఆగ్రహం
అతను గేయాల్లో రూపుకడతాయి.

అతను ఆంధ్ర సరస్వతి పరిషత్
వ్యవస్థాపక సభ్యుడు ,
ఆంధ్రప్రదేశ్ సాహిత్య
అకాడమీ సభ్యుడు.

నిజాం ఆగ్రహించి కాళోజీకి
వరంగల్ నగర బహిష్కారం
విధించిండు.

కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ
డాక్టరేట్ ప్రదానం చేయగా,
భారత ప్రభుత్వం పద్మభూషణ
అవార్డుతో సత్కరించింది.

నమ్ముకొని అధికారము ఇస్తే
నమ్మకము పోగొట్టుకుంటివి
పదవి అధికారము బూని
పదిలముగా తల బోడిజేస్తివి
దాపునకు రాననుచు చనువుగా
టోపి పెడితివి లాభపడితివి

ఏడు మారినా, ఈడ ముదిరినా
ఏమి మారినది లోకం
రాయి విసిరినా , రాకెట్ విసిరినా
గిట్టని వానిని కొట్టుటకే కదా
ఆకు కట్టినా , కోక చుట్టినా
తోచిన కాడికి దాచుటకే కదా
హారతిచ్చినా , అడ్రసిచ్చినా
పొగిడి మన్ననలు పొందుటకే కదా

రఘుపతి రాఘవ రాజారాం
రామ్ తోవకు రానే రాం
పతీత పావన సీతారాం
పతితుల మార్గాన్నే పోతాం
ఆనకట్ట మట్టితో పోస్తాం
వాన మీద తప్పును తోస్తాం

కాళోజీ గారు 2002 నవంబర్
13న తుదిశ్వాస విడిచారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!