చిన్ననాటి స్నేహితుల జ్ఞాపకాలు

చిన్ననాటి స్నేహితుల జ్ఞాపకాలు

రచయత :: పావని చిలువేరు

 

సంభాషణలు
ఆదివారం మధ్యాహ్నం గోపాల్ తన భార్య రాధ, కుమారుడు రోహిత్ తో జరిగిన సంభాషణలు.

గోపాల్: ఏమిటoడి శ్రీమతి గారు శనివారం, ఆదివారం రాగానే యెప్పుడు చూసిన ఫోన్ తోనే కాపురం చేస్తున్నారు ఏమిటో  విశేషం.

రాధ: అయ్యో అదేమిలేదండీ స్నేహితులని వెతుక్కుంటున్న
అంటే .

గోపాల్: నీకు యెవరు చెప్పారు ఫోన్ లో స్నేహితులు దొరుకుతారు అని .

రాధ: అబ్బ మన రోహిత్ చెప్పాడులెండి. నన్ను కాసేపు వదిలేయండి. మళ్లీ రేపటి నుంచి ఆన్లైన్ తరగతులు నాకూ ఫోన్ దొరకదు మీరు వెళ్ళిండి అని చిలిపిగా కసురుతూ బయటకి నెట్టిoది రాధ.

యెంతో ఆశ్చర్యంగా గోపాల్ ,రోహిత్ దగ్గరకి వెళ్లి ….

గోపాల్: నానా రోహిత్ మీ అమ్మ యేమిటి ఫోన్ లో స్నేహితులని వెతుక్కుంటున్న అంటుంది,  అది నువ్వే చెప్పావు అంటుంది  నిజమేనా .

రోహిత్: అవును నాన్న నిజమే…నీకు గుర్తుందా నేను మూడవ తరగతిలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్  కార్తీక్ వాళ్లు విజయవాడకి
వెళ్లి పోయారు యిప్పుడు అక్కడే చదువుకుంటున్నాడు .

గోపాల్: అవును , అయితే .

రోహిత్:  ఇన్స్టాగ్రాo లో చూశాను నాన్న,  కార్తీక్ పోస్టు చేశాడు వాళ్ల బంధువుల ఇంటికి వస్తున్నాడట.
అదే విషయాన్ని అమ్మ తో కూడా చెప్పాను. అమ్మ  కూడా నన్ను  అడిగింది నీకు యేల తెలుసు ఫోన్ నెంబర్ తీసుకున్నావా, నీ దగ్గర ఉందా అని .అప్పుడు నేను లేదు అమ్మ ఇలాంటి సామాజిక మాధ్యమాల వల్ల స్నేహితులు యెప్పుడు యెక్కడ ఉన్నారో, యేమీ చేస్తున్నారో  తెలుసుకోవచ్చు అని చెప్పాను.
అప్పుడు అమ్మ చెప్పింది తాతయ్య కి గవర్నమెంట్ వుద్యోగo  వల్ల వేరే వూరికి  బదిలీలు అవడం ,ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే  అమ్మకి పెళ్లి అవడం వలన స్నేహితుల యింటి అడ్రస్, ఫోన్ నెంబర్ లేదంట, కాని వాళ్ళ ఇంటి పేరు తెలుసు అంట నన్ను దొరకపట్టగలవా అని అడిగింది.
అందుకే నేనే అమ్మ కి ఫేస్ బుక్ క్రియేట్ చేసాను నాన్న,
అన్ని నేర్పించాను ,మీకు తెలుసా కొంత మంది స్నేహితులు కూడా దొరికారు. కాని  ఇంకా కొంత మంది  స్నేహితులకి ఇంటి పేరు పెట్టి వెతికితే దొరకడం లేదంట.

మీకు  ఒక విషయం చెప్పనా నాన్న అమ్మకి ఎంత తెలివి ఉందో .

అమ్మ స్నేహితుల పేరు కి ఇంటి పేరు జత చేసి వెతికిన కూడా దొరకపోతె అప్పుడు అమ్మ యేమీ  చేసింధో చెప్పండి నాన్న.

గోపాల్: యేమో యేమీ చేసింది .

రోహిత్: హాహా హాహా
అమ్మ స్నేహితులు ఉంటారు  కదా  వాళ్ల నాన్న పేరుకి ఇంటి పేరు జతచేసి  చూస్తే చాలా మంది దొరికారంట.
అప్పుడు వెంటనే అమ్మ నా దగ్గరకు వచ్చి యేమీ చెయ్యాలి అని అడిగింది. .
అప్పుడు నేనే నాన్న వాళ్ల కి మెసేజ్ పంపించాను .

హాహా హాహా  ఇంకో గమ్మత్తయిన విషయం చెప్పనా నాన్న .
నేను మెసేజ్ పంపించాను కదా అమ్మ స్నేహితుల నాన్నలకి .

గోపాల్: అవును

రోహిత్: అలా పంపితే కొంత మంది ఇంకా చూసుకోలేదు
కానీ కొంతమంది వెంటనే మెసేజ్ చేశారు.
యేల అనుకుంటున్నారు అది అమ్మ స్నేహితులే వాళ్ల నాన్నలకి
క్రియేట్ చేసారు అంట.
అలా అమ్మ కి చాలా మంది స్నేహితులు ఫేస్బుక్ లో  వెతికితె దోరకారు నాన్న.  తరువాత యేమయింధో  తెలుసా.

గోపాల్: యేమో అది కూడా నువ్వే చెప్పు ,

రోహిత్ : అమ్మ వచ్చే నెల ఒక సర్ప్రైజ్ ఉంది అన్నది కదా .

గోపాల్: అవును, చెప్పురా బాబు తొందరగా

రోహిత్ : అదే నాన్న అందరి నంబర్స్ తీసుకుని రోజు ఒక్కొక్కరితో కొంత సేపు మాట్లాడుతుంది. అయితే అమ్మ కి నేను వార్ట్స్ అప్ గురించి చెప్పాను అంతె ,అమ్మ నే క్రియేట్ చేసుకుంది నాన్న. ఫోటోలు పంపించు కోవడం , అందరూ కలిసి గ్రూప్ కాల్ లో మాట్లాడు కోవడం కూడా చేస్తున్నారు.

గోపాల్: అది యెప్పుడూ చేస్తోంది.

రోహిత్: ఒక సర్ప్రైజ్ ఉంది అన్నది కదా.
గోపాల్: బాబు నువ్వు చెప్పురా యేమిటో ఆ సర్ప్రైజ్.

రోహిత్: ఆగు నాన్న చెపుతా.
అమ్మ వాళ్ల స్నేహితులు వచ్చేనెల కలుసుకొంటున్నారు . కొంచం బక్కపడాలి అంట అందుకే రోజూ సాయంత్రం బయట నడుస్తు గ్రూప్ కాల్ చేస్తుంది.
నాకూ కూడా ఆ రోజు పెద్ద సర్ప్రైజ్ ఉంది యేమిటో చెప్పుకొండి .

గోపాల్: యేముంది నీకు ఇష్టమయిన చికెన్ 65 చేస్తోంది అంటే కదా, నాకూ తెలుసులే.

రోహిత్: కాదు నాన్న ఈ సర్ప్రైజ్ విషయం మీకు చెప్పాను అని అమ్మకి చెప్పకండి .

గోపాల్: యే సర్ప్రైజ్ నానా….

రోహిత్:  హాహా హాహా హాహా హాహా
ఆదే నాన్నా  తొందరలో మీ జేబు కి పెద్ధ చిల్లు పడుతోంది.

గోపాల్: నానా బంగారం చెప్పురా యేమిటో

రోహిత్: నాకూ నాకూ అమ్మ వీడియో గేమ్ కొనిస్తుoది .

అని చెప్పి అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు రోహిత్, అప్పుడు గోపాల్ భార్య దగ్గరకి వెళ్లి.

గోపాల్: రాధ మీ స్నేహితులు అందరూ యెప్పుడు కలుస్తూన్నారు .
అప్పుడు రాధ ఫోన్ పక్కన పడేసి యెంతో సంతోషంతో

రాధ: పదoడి బయట నడుస్తూ చెపుతాను అంది.
రాధ లో సంతోషం చూసి యెంతో మురిసిపోవడం గోపాల్ వంతు అయ్యింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!