అంశం: నేనో వస్తువుని
గోమాత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: శైలజ శశి ఇందుర్తి
పురాణాలలో విశిష్టమైన స్థానం
కలిగిన గోమాత నేను
కోరిన కోర్కెలు తీర్చే కామధేనువు అని
కొలిచారు నన్ను
కాని ఈ మానవజాతి కర్కశ బుద్ధికి
నేనో వస్తువుని
ఒట్టి పోయిన నన్ను సంతలో అమ్మేసి
కసాయి కత్తులకి బలి చేసేను.
నా బిడ్డల తో పాటు మీ బిడ్డల
ఆకలి తీర్చినందుకు
మీరు నాకు ఇచ్చే బహుమతి
నన్ను వస్తువు గా మార్చి అమ్మేసి
నన్ను చంపి మీ ఆకలి తీర్చుకుంటున్నారు.
గోమాత అంటే
తల్లితో సమానంగా పూజించేది అనేది
మన భారతీయ సంస్కృతి.
అటువంటి అమ్మ లాంటి ఆవులను
కాపాడుకుందాం