హరివిల్లు

హరివిల్లు

రచన : యాంబాకం

ఎరుపు,ఆరంజి,పసుపు,పచ్చ,బ్లూ,నీలి,ఊద,కార్మిక,  సాధువు, శుభ,పకృతి,పండుగ,ఆకాశ,శాంతి,రూపాలు,చిహ్నలుగా విరిసే ఏడరంగుల కలయిక హరివిల్లు ఓ “ఇంద్రధనుస్సు”

తన పాప బోసినవ్వలలో తప్పటడుగులలో చిట్టి పొట్టి పలుకలను చూసిన కన్న తల్లి కన్నులలో కనబడే ఆనంద హరివిల్లు ఓ”ఇంద్రధనుస్సు”

కడుపు చేతపట్టి ఆకలి బాధ లతో డొక్క చిక్కి గొంతు ఆరిపొయిన పేద కార్మికునికి కూలి డబ్బులు అంద గా ఆకార్మికుని మోములో చిగురించు హరివిల్లు ఓ”ఇంద్రధనుస్సు”

ఈడుచ్చిన అమ్మాయి తన మనస్సులో కనే కళలు,కోరికలు,ఆశలు,తీరగా,కన్న కోరికలు పండే రోజు ఎదరవ్వగా ఆమె హృదయం లో విరజల్లే హరివిల్లు ఓ”ఇంద్రధనుస్సు”

చదువులు చదివి పై చదువులు చదివి మెడల్స్ మెడలో వేసుకొని తిరిగి తిరిగి విసిగి పోయిన నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తే ఆ విద్యార్థి లో కనిపించే నవ్వుల హరివిల్లు ఓ”ఇంద్రధనుస్సు”

నమ్ము కున్న నవ్విన నాపచేను పండు తుందో లేదో వాన అనక, ఎండ అనక రాత్రి అనక, పగలనక, శ్రమించి కష్టపడి పంట చేతికి అందితే ఆరైతు కనులలోజ్వనించే హరివిల్లు ఓ “ఇంద్రధనుస్సు”

జీవితం అంకితం చేసి మాధవ సేవలో అపారమైన విశ్వాసం తో మునిగిన భక్తునికి కళలో భగవంతుడు దర్శనం ప్రసాదిస్తే భక్తుని తేజస్సులోని హరివిల్లు ఓ”ఇంద్రధనస్సు”

సప్త ఋషులు ల సముదాయం
ఏడు అడుగుల సంబంధం
ఏడు జన్మల అనుబంధం
ఏడు రంగుల కలయక హరివిల్లు మనకు ఓ “ఇంద్రధనుస్సు”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!