వాగ్భూషణం

వాగ్భూషణం

రచన: చంద్రకళ. దీకొండ

సుగంధ లేపనముల కంటె…
సుభాషణము సుందరమైన భూషణము..
మధుర భాషణమె భూషణమై…
వ్యక్తిత్వానికి వన్నె తెచ్చు…!
చిన్నారి ముద్దు పలుకులు
అచ్చ తెనుగు భాషలో పదములు
పంచదార చిలుకలు…
మంచిమాట తీరు మనిషి
నడవడికను తెలుపు…!
కఠినమైన మాటల తూలువారు
అందరికీ విరోధులౌ…
ఎదుటివారిని మార్చగల మహిమగల పలుకులు మనిషిలో పరివర్తన కలిగించు…
తీవ్ర కలహాలను బాపి
పలుకులే ఔషధమై వేదనొందిన
మనసును శాంతపరచు…!
పంచదార పూసిన తీయని
పలుకులలో మైమరచి
విలువైన జీవితములో
విషము నింపుకోకుమా…!!!
**************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!