నువ్వు నా ప్రియబాంధవి వి!

నువ్వు నా ప్రియబాంధవి వి

రచన: బి హెచ్.వి.రమాదేవి

నీకు లక్షల్లో వధూకట్నం ఇచ్చి,
నాచేయూతతో ప్రవేశ పెట్టాను!
నీవు అడుగు పెట్టినదిమొదలు!
నీవే నా శ్వాస! నీపైనేనాధ్యాస!
ఈ చెవుల్లోఅమృతంపోసే పని,
ఈకనులలోఅద్భుతాలుచూపి,
ఆనందాలు తిలకింప జేసి!
నాతోనేవుండిఒక్కక్షణంవదలని
కదలని ఓఅద్భుతమాయ నీది!
అమ్మ అంటుందిఅది వుంటే చాలు!వీడికియేమీఅక్కరలేదు,
నాన్న అంటాడు ఏముందిదాన్లో
ఏ ముండాలి!? ఎంతుండాలి!
నిను తాకిన ప్రతిసారి ఓ వినూత్న అనుభవం! ఆనందం!
నువ్వే నా జీవననందన వనం!
నీవులేనిజీవితంఊహించలేను
నీవు నా సర్వస్వంనీవులేకుంటే
నాకీ లోకమే లేదు! చర వాణి!
ప్రియబాంధవి! నా గుండెను ,
మీటుతూ,నా వ్రేలితో నిను
సవరిస్తూ వుండి పోనియ్యి!
నీతోనూరేళ్లు నిండి పోనియ్!
************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!