అమ్మకు ప్రతి రూపం

అమ్మకు ప్రతి రూపం

రచన: దుర్గా మహాలక్ష్మి ఓలేటి

ఆడ పిల్ల బాధ్యతల భారోసాల
లేడీ పిల్ల….
కష్టాల వేటలో ఎదురునిల్చే
పులి పిల్ల….

జీవితం నిరంతర
అధ్యయనాల పాటశాల
ఓర్పు నేర్పుల వేద శాల
ధైర్య సాహసాలు రణ రంగం
సకల జ్ఞాన సంపదల నిలయం
ఆడ పిల్ల అంతరంగం…

బతుకు కట్టెల పొయ్యి ఐనా
మట్టి నేల ఐనా నవ్వులు
రువ్వే నెలవంక….

ఆపాదమస్తకం బరోసాల పుస్తకం
బరువు బాధ్యతలు
బేరీజు వేసే గణిత శాస్త్రం

అమ్మా నాన్నల మనసు
చదివిన మనో విజ్ఞాన శాస్త్రం..

కన్నీటి కడలిలో అమృతాన్ని
మధించే అమ్మతనపు ప్రతి రూపం

ప్రతి ఇంటా వుండాల్సిన
అక్షర యక్షిణి
ప్రతి తల్లీ గర్భాన జన్మించి
తీరాల్సిన మమతల
మాగాణికి మహారాణి
గర్భగుడిలో వెలసే అమ్మ స్వరూపిణి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!