ప్రేమ జాడ
రచన : సుశీల రమేష్.M
నిన్ను చూసాకే తెలిసింది
ప్రేమంటే నీవే నని
నిన్ను చూసాకే తెలిసింది
నా కనులే వెతికేది నిన్నే నని
నిన్ను చూసాకే ఆగింది
నా మనసు లోని ఆవేదన
నిన్ను చూసాకే తెలిసింది
నా హృదయ స్పందన నీవే నని
నిన్ను చూసాకే తెలిసింది
నా ఆశ శ్వాస నీవే నని
నిన్ను చూసాకే తెలిసింది
నా ప్రేమ జాడ నీవే నని.
***