జై జవాన్

జై జవాన్

రచన:ఐశ్వర్య రెడ్డి గంట

భరత జాతి రక్షణే ప్రాణం గా భావించి
పగలు రేయి చూడక ఎండా వానల కోర్చి

దేశ రక్షణే దైవకార్యం అని తలచి
కాపలా కాసేవు దేహాన్ని ఉక్కు కంచెను చేసి

జ్వలించే భారతమాత విజయ గీతికలు మువ్వన్నెల జెండాకు రక్షకులు

దేశం కోసం జన్మించే ప్రాణం మీదే
రక్షణ కోసం తపించే త్యాగం మీదే

తుపాకీ ఫిరంగుల మోతల్లో నా
ధైర్యం నీవై జాతి కి అభయమునిచ్చి

సరిహద్దు న నిలబడి పోరాటాల పోరు లో సమీదవు నువ్వు అవుతూ ప్రాణార్పన గావించి
అమరుడవై వెలిగేవు బారతమాత గుండెల్లో .

వందనం నీ పోరాటప్రతిమకి
వందనం దేశ భక్తి కి
వందనం అభివందనం
జై జవాన్.

You May Also Like

One thought on “జై జవాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!