నేటి వైద్యం తీరు
రచన: వి. కృష్ణవేణి
ఆరోగ్యమే మహాభాగ్యం
ప్రజల ఆరోగ్యం వైద్యులకువరమయ్యేను
వ్యాధి నయంకన్నా డబ్బు మిన్న అన్నటుంది
వైద్యులతీరు.
అంతా మోసం
సామాన్యులకు అందని ఒక శాపం.
సామాన్యులకు భారం
డాక్టర్లకు అదొకవరం.
మానవత్వం కన్నా ధనప్రీతే మిన్న
అన్నట్టు తయారైనది.
మనో థైర్యం కన్నా ధన థైర్యం ఉంటే చాలు అన్నట్టుంది
వైద్యుల తీరు.
సామాన్యులకు భారంగా
మధ్యతరగతివాళ్లకు భయంగా
తయారైంది ఈ నాటి తీరు
వైద్యం ఒక వ్యాపారంగా మారింది.
మానవత్వంలేదు. కనికరంలేదు, దయజాలీలేదు.
వైద్యో నారాయణహరి అన్నారుగాని
డబ్బే నాయరాయణహరి అనడం ఉత్తమం.
మనం మారాలి సమాజ తీరు మారాలి అప్పుడే సామాన్యులకు, మధ్య తరగతి వారికీ
అందరికి న్యాయం చేకూతురుందని ఆశిద్దాం.
***