తండ్రి తపన

 తండ్రి తపన

రచయిత :: పుల్లూరి సాయిప్రియ

కటిక పేదరికం లో బ్రతుకుతున్న ఓ తండ్రి.
ఆ తండ్రికి ఒక్కగానొక్క కొడుకు.
ఎంత కష్టమైనా తన కొడుకును బాగా చదివించి తనలా కష్ట పడకూడదని ప్రయోజకుడిగా చూడాలని నిర్ణయించుకున్నాడు.అలా ఆ తండ్రి ఎంతో కష్టపడుతూ కొడుకును చదివిస్తూ ఉన్నాడు.
ఓ రోజు తన కొడుకుకి బాగా అనారోగ్యం చేసింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేయాలి ఇరవై వేలు అవుతాయి అని చెప్పారు. అప్పుడు ఆ తండ్రి,అయ్యో దేవుడా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదే ఏం చేయాలి? ఎవరిస్తారు? అని ఎటూ తోచక ఆస్పత్రిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలానో కష్టపడి డబ్బులు తీసుకు వచ్చి ఆపరేషన్ జరిపించాడు,తన కొడుకును బ్రతికించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కొడుకు తలరాతే మారిపోయింది పూరి గుడిసెను వదిలి పట్నం వెళ్లి అద్దాల మేడ కట్టుకున్నాడు సైకిలు కూడా లేని అతనికి ఇప్పుడు కార్లలలో తిరుగుతున్నాడు.
ఆ కొడుక్కి డబ్బుతో పాటు మదం కూడ బాగా పెరిగిపోయింది కన్న తండ్రి అని చూడకుండా చులకన చేయడం, ద్వేషించడం, పట్టించుకోకపోవడం, దూరం పెట్టడం, ఇలాంటివి ఎన్నో చేశాడు. పైగా నువ్వు నాకేం చేసావు ఎదో నా అదృష్టం వల్ల లాటరీ తగిలి ఇన్ని డబ్బులు సంపాదించుకున్నాను అని కసురు కుంటూ, కస్సుబుస్సు లాడుతూ, తన తండ్రిని ఇంట్లో నుండి వెళ్లగొట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి కొంచెం అనారోగ్యంగా అనిపించి తన ఫ్యామిలీ డాక్టర్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అ డాక్టర్ అతనిని చెకప్ చేసి మందులు ఇస్తూ..ఉండగా మీ నాన్నగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారా? అని అడిగాడు. అప్పుడు అతను మా నాన్నగారి గురించి ఎందుకు అలా అడుగుతున్నారు డాక్టర్. అని అడిగేసరికి, ఆ డాక్టర్ గారు అతనితో..మీ నాన్నగారు అప్పుడు నీ ఆపరేషన్ కి డబ్బుల కోసం ఎంతో వెతికి వెతికి తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా తన కిడ్నీని దానం చేశాడు అలా దానం చేసినందుకు వాళ్ళు యాబై లక్షలు ఇచ్చారు ఈ విషయం నీతో చెప్పకూడదు అని నా దగ్గర మాట తీసుకున్నారు. నువ్వేమో ఏదో లాటరీ తగిలింది అని అనుకుంటున్నావు. అని డాక్టర్ చెప్పెసరికి అతనికి ఒక్కసారిగా గుండె ఆగినట్టుగా అనిపించింది. ఎంతో కుమిలి పోయాడు, పశ్చాత్తాపపడి తన తండ్రిని తీసుకురావడానికి తన సొంత ఊరికి వెళ్ళాడు. అతను తమ ఇంటికి వెళ్లేసరికి ఆ ఇంట్లో ఎవరు లేరు గోడపై ఉన్న తన తండ్రి ఫోటోని చూసి,గుండె పగిలేలా ఏడ్చాడు, పాపం అతనికి తెలీదు తన తండ్రి ఎప్పుడో చనిపోయాడు అని. ఈ విషయం తెలుసుకున్న కొడుకు అక్కడికక్కడే కుప్పకూలిపోయి, బోరు బోరున ఏడుస్తూ..ఇదంతా నా వల్లే జరిగింది, నేనే నిన్ను చంపుకున్నాను నాన్న, క్షమించలేని పాపం మూట కట్టుకున్నాను అని కుమిలిపోతూ.. భాదపడుతూ.. ఉన్నాడు. కొన్ని రోజులు తరువాత తన తండ్రి జ్ఞాపకాలుగా తన తండ్రి పేరు మీద అన్న దానాలు చేస్తూ, ఒక అనాధ ఆశ్రమం కట్టించి తన తండ్రి లాంటి వారిని ఎంతో మందిని ఆదరిస్తూ..తొడు, నీడగా ఉంటున్నాడు.

ఒక తండ్రి..
తను పడ్డ కష్టాలు మనం పడకూడదని, తను అనుభవిస్తున్న ఎన్నో భాదలని మనకి తెలియకుండా తన గుండెల్లో దాచుకొని, కన్నీళ్ళని సైతం కనురెప్పల చాటున బందించి.. కన్న బిడ్డల కోసం తన ప్రాణాలను కూడ లెక్క చేయని వాడే నాన్న.. పితృదేవో భవ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!