అనంత పద్మనాభస్వామి ఆలయం

అనంత పద్మనాభస్వామి ఆలయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: అద్దంకి లక్ష్మి

అనంత పద్మనాభస్వామి ఆలయము అనంతగిరి కొండలలో మూసీ నది జన్మస్థానము. స్కాంద పురాణము ప్రకారము మార్కండేయునిచే నిర్మితమైన దేవాలయము. ముచుకుందుడనే రాజ ఋషి ఇక్కడ తపస్సు చేశాడు. నిత్యం కాశీకి వెళ్లి గంగా స్నానమాచరించేవాడు. శివుని గంగాజలంతో అభిషేకించేవాడు. ముచుకుందుడు యుద్ధంలో రాక్షసులను ఓడించాడు. కృష్ణుడు ముచుకుందునకు పద్మనాభునిగా దర్శనమిచ్చాడు. విష్ణువు అనంత పద్మనాభుని రూపంలో ఉంటాడు.
ముచుకుందునకు ఒక నది రూపం అనుగ్రహిస్తాడు. ముచుకుందుడు, కృష్ణ బలరాముల కాళ్లు కడిగాడు. సాలగ్రామ రూపంలో అవతరించాడు, పద్మనాభుడు. కృష్ణుడు అనంత పద్మనాభ రూపంలో కనిపిస్తాడు ముచుకుందునకు. కృష్ణుడి పాదాల జలమే మూసీనది అని చరిత్ర చెబుతోంది.ద్వాపరయుగంలో నిర్మితమైన దేవాలయము ఇది కార్తీక పౌర్ణమి నాడు రథోత్సవం చేస్తారు. సంవత్సరంలో రెండు సార్లు జాతర నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల వారు కూడా పాల్గొంటారు. ఆషాడంలో ఐదు రోజులు ఉత్సవాలు జరుపుతారు.రమణీయ ప్రకృతికి ఆలవాలము. దట్టమైన అడవిలో అనంతగిరి కొండల్లో భక్తులందరికీ ముక్తిప్రదాయమైన దివ్య ధామము. పురాతన గుహలు కోటనిర్మాణాలు ప్రత్యేకతలు పర్యాటకులకు మనోరంజకముగా ఉంటాయి. అందమైన వృక్షాలు సెలయేర్ల ప్రవాహాలు ఎత్తు నుండి గలగల పారే నీటి సవ్వడులు రకరకాల పక్షులు కిలకిలా రావాలు, ప్రకృతి రమణీయ దర్శనము తరచుగా సినిమా షూటింగ్ లు జరుగుతూ ఉంటాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!