నీలో దీపం వెలిగించు

అంశం: చీకటి వెలుగులు

నీలో దీపం వెలిగించు

రచన: చంద్రకళ. దీకొండ

తిమిరం… చెడుకు,నిరాశావాదానికి…
అజ్ఞానానికి, అధర్మానికి,
అపజయానికి, అన్యాయానికి,
దుర్మార్గానికి ప్రతీకైతే…!
దీపం… మంచికి, ఆశావహ దృక్పథానికి,అంతరాత్మకు,
జ్ఞానానికి, వెలుగుకు… ధర్మానికి,జయానికి,
న్యాయానికి, సన్మార్గానికి చిహ్నం…!
“తమసోమా జ్యోతిర్గమయ”
చుట్టూ చీకటిని తిడుతూ కూర్చొనేకంటే…
దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయి…!
నీలో దీపం వెలిగించు…
నీవే వెలుగై వ్యాపించు…!!!
అధర్మంపై ధర్మం గెలుపుకు గుర్తుగా…
చెడుపై మంచి విజయానికి చిహ్నంగా…
అంతరాత్మ బోధన పాటించి…
అరిషడ్వర్గాలను తొలగించి…
జ్ణానజ్యోతిని వెలిగించి…
పాపాలను హరించి…
సన్మార్గంలో సాగేందుకు దోహదపడే
పండుగే దీపావళి…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!