అంశం: చీకటి వెలుగులు
చీకటి వెలుగుల జీవితం
రచన: పరిమళ కళ్యాణ్
జీవితం చీకటి వెలుగుల మయం
చీకటి పడిందని బాధ పడేలోపు మళ్ళీ ఉదయిస్తాడు సూర్యుడు
సూర్యోదయం అయ్యిందని ఆనందించేలోపు వెళ్తున్నా అంటూ అస్తమిస్తాడు రవి
తన చల్లని వెలుగులు లోకానికి
చంద్రుడికి ఆతిధ్యం ఇస్తుంది ఆకాశం
సూర్యుడు ఉదయించనిదే ప్రపంచానికి ఉనికే లేదు
తిరిగి అస్తమించనిదే మనకి కునుకే లేదు
చీకటి నిన్ను కమ్ముకుందని అధైర్యపడకు
చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగు కోసం చూడు
వెలుగువైపు నీ జీవితాన్ని నడిపే ప్రయత్నం చెయ్యి!!