జ్ఞాన సంపద

జ్ఞాన సంపద

రచయిత :: శ్రీదేవి విన్నకోట

ఎన్నటికీ ఎప్పటికీ తరిగిపోని అమూల్యమైన నిధి
వాడిన కొద్ది మరింతగా పెరిగే పెన్నిధి
మనల్ని మనం ఏంటో నిరూపించుకునే. ఉన్నతి
తెలుసుకున్న కొద్ది మనతో
పాటే ఉండే సన్నిధి
ప్రతి  విషయంలో మీకు
నేను తోడు ఉన్నాను
అంటూ మనకి జీవితాంతం తోడ్పడే ఆపద్బాంధవి
మనం ఏం సాధించాలన్నా ఉపయోగపడే మన ప్రగతి
మనల్ని అందరిలో గొప్పగా నిలబెట్టే మన సంస్కృతి
వందలో ఒక్కరిగా నిలబెట్టే మన జ్ఞాన సంపద మనల్ని ముందుకు నడిపించే మన విజ్ఞాన సంపద
విద్య వినయం జ్ఞానం అనే మూడు వరాలు
అంతం లేకుండా అనంతంగా మన చెంత ఉంటే
మనం అలవోకగా సాధించని విజయం ఉండునా
జ్ఞాన వినయ సంపదతో గెలవని మనసు ఉండునా
పెద్దవారి ఆశీర్వాదాలే అడుగడుగునా శ్రీరామరక్ష
మన మర్యాద మన్ననలే
మన మనుగడకు సోపానాలు
అందుకే అందరూ కావాలి మన సమాజానికి
వినయ విద్యా జ్ఞాన సంపన్నులు.
రాబోయే మన భవిష్యత్ తరాలకి
మనమే కాబోయే ఉత్తమ వ్యక్తులం,
అవే మనకు ఆఖరి శ్వాస వరకు లభించే కీర్తికిరీటాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!