ఆశాపాసం

ఆశాపాసం

రచన: అపర్ణ

అమ్మా! ఆకలి వేస్తుంది ఇంకా ఎంతసేపు నావల్ల కావట్లేదు అంటూ మారం చేస్తున్న కూతురిని సముదాయస్తూ “కాసేపు ఆగమ్మా డాడీ వచ్చేస్తాడు సరుకులు తేగానే నీకు అన్నం పెడతాను సరేనా అంటూ మనసులో ఈరోజు కూడా నా కూతురిని పస్తు పడుకోపెట్టాలా దేవుడా! అంటూ బాధపడుతుంది అమ్మ.

***

పొద్దున్నుంచి పని కోసం తిరుగుతూ కాళ్ళు అరిగిపోయాయి నాన్నకు, రోజువారీ పనులు చేసుకుని కడుపు నింపుకునే బతుకులు. రెండు రోజులనుంచి పనిలేదు ఎవ్వర్నీ అడిగినా పనిలేదు అంటున్నారు. ఈరోజు కూడా కాళ్ళుఈడుచుకుంటూ ఇంటికి వెళ్లాల్సిందేనా నా భార్య, బిడ్డకు ఇంత అన్నం పెట్టలేకపోతున్నానే దేవుడా! నువ్వే దిక్కు అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటున్నాడు నాన్న.

***

స్వీటీ నీ బర్తడే అని మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచావు వాళ్లందరికోసం చాలా స్వీట్స్, కేక్స్ ఆర్డర్ చేసాము ఎంతసేపు అని ఆ డోర్ దగ్గర నిలబడి వాళ్ళకోసం చూస్తావు వాళ్ళు ఇంక వచ్చేలా లేరు అని అమ్మ అంటున్నది విని స్వీటీ చాలా డల్ గా అయిపొయింది. అది చూసి వాళ్ళ అమ్మ ఏమికాదులే వాళ్ళు రాకపోతే ఏమైంది నేను డాడీ ఉన్నాముగా మేమిద్దరం ఎప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటామే అంటూ స్వీటీ ని హగ్ చేసుకుంది అప్పుడు నవ్వింది స్వీటీ. అమ్మా ఈ కేక్, స్వీట్స్ ఏం చేద్దాం? అని అడిగింది అమ్మని, అమ్మ అలోచించి హా!! ఓ పని చేద్దాం మన ఇంటిదగ్గర ఎవరైనా పిల్లలు కనిపిస్తే వాళ్ళకి ఇద్దాం సరేనా ఓకే మమ్మీ!!! అంటూ చాలా ఉత్సాహంగా బయలుదేరింది స్వీటీ. కొంచెం దూరం వెళ్లిన వారికీ చిన్న ఇంటిముందు ఆడుకుంటూ ఒక పాప కనిపించింది తన దగ్గరికి వెళ్లి స్వీట్స్, కేక్ ఇచ్చారు స్వీటీ అను వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి స్వీట్స్ తీసుకోకుండా లోపలికి వెళ్లి వాళ్ళ అమ్మ ను తీసుకొచ్చి అమ్మా ఆంటీ స్వీట్స్, కేక్ ఇస్తోంది తీసుకో అంటూ అమ్మకి ఇచ్చింది. అవి చూసి చాలా సంతోషించి మీ అమ్మాయి నూరు పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశీర్వదించింది. ఒక మంచి పని చేసినందుకు చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు ఇద్దరు.

కార్ దగ్గర నుంచుని ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ నుంచున్నాడు సుందర్. ఫోన్ తీసేప్పుడు అతని జేబులోనుంచి పర్సు కూడా బయటపడిపోయింది అది చూసుకోలేదు అతను గబ గబా డోర్ క్లోజ్ చేసుకుని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ పర్సు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న రాజు కి కనిపించింది. పర్సు తీసి అందులో డబ్బులు, కార్డ్స్, అడ్రస్ ఉన్న కార్డు ఎదో ఉంది. ఆ అడ్రస్ చూసి ఆ పర్సు లోని డబ్బు తీసుకుని ఇంట్లో సరుకులు తీసుకొద్దాము అనుకున్నాడు కానీ దొంగతనం అనే పాపం చేసి ఆ పాపపు సొమ్ము తో నా బిడ్డ, భార్య కు అన్నం పెట్టేంత దిగజారలేదు అని అనుకుని ఆ అడ్రస్ వాళ్ల ఇంటిదగ్గరే అయేసరికి నడుచుకుంటూ వెళ్లి వాళ్ళకి ఇద్దాము అనుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంట్లోవారిని “ఎవరైనా ఉన్నారా” అని పిలిచాడు. సుందర్ బయటికి వచ్చి ఏమిటీ అన్నట్లు చూసాడు అతను పర్సు చేతికి ఇచ్చి మీ పర్సు దొరికింది రోడ్ మీద అని అతని చేతికి ఇచ్చాడు. అది చూసి పర్సు లో ఏమి తీసినట్లు లేకపోతే ఏంటి డబ్బు తీసుకోవాలి అనిపించలేదా అని సుందర్ అడగ్గా అతను “ నేను కూటికి పేదోడిని బుద్ది పేదది కాదు అని చిన్న నవ్వు నవ్వి వెళిపోతుండగా సుందర్ ఆపి “ నువ్వు ఏమి పని చేస్తావు అని అడిగాడు, రోజు ఏమి పని దొరికితే అది అన్నాడు. అయితే బండి నడపడం వచ్చా అని అడిగాడు. హా వచ్చు అన్నట్లు తలూపాడు అతను. నేను ఈ మధ్యనే ఒక చిన్న కూటిర పరిశ్రమ పెట్టాను దానికి సంబందించిన సరుకు ఆటోలో దుకాణాలకి సరఫరా చేయాలి అన్నాడు అది వినగానే కళ్ళలో నీళ్లతో చేస్తాను అన్నట్లు తన సమాధానం చెప్పాడు అతను. ఇంతకీ నీ పేరు చెప్పలేదు అన్నాడు సుందర్. రాజు అన్నాడు అతను, సరే రాజు రేపటినుండి పనిలోకి రా అంటూ నవ్వుతూ షేకహండ్ ఇచ్చాడు సుందర్.

ఇంటికి తిరిగి వచ్చిన నాన్నను చూసి సంతోషంగా ఏదురొచ్చింది పాప. “ నాన్న రా నీకు స్వీట్ పెడతాను అంటూ ఒక స్వీట్ ముక్క తీసుకొచ్చి నోట్లో పెట్టింది పాప. నాన్న నవ్వుతూ ఏంటి నా చిట్టి తల్లికి తెలిసిపోయిందా నాకు పని దొరికిందని అంటూ నీళ్ళు తాగుతూ చెప్తున్నాడు రాజు అవునా అండీ మీకు పని దొరికినాదా అంటూ ఆశ్చర్యంగా, ఆనందభాష్పాలు కారుస్తూ వచ్చింది రాణి అవునే రాణి డ్రైవర్ ఉద్యోగం అంటూ తన నోట్లో స్వీట్ పెట్టాడు రాజు. ఇక మన కష్టాలు గట్టెకినట్లే అనుకుంటూ రేపు సరుకులు తెస్తాను అన్నం కూర వండిపెట్టవే నా కూతురికి అని ఆనందంగా స్వీట్స్, కేక్ లతో ఆపూటకి కడుపు నింపుకున్నారు ముగ్గురూ.

డాడీ, డాడీ ఈరోజు నేను మమ్మీ వెళ్లి స్వీట్స్ అన్నీ అందరికీ పంచి వచ్చాము నాకు చాలా హ్యాపీ గా ఉంది డాడీ అంటూ సుందర్ నీ చుట్టేసింది స్వీటీ. అవునా డాడీ కూడా ఈరోజు ఒక మంచి మనిషికి మంచి పని చేసాడు అంటూ స్వీటీ బుగ్గ గిల్లాడు సుందర్ అవునా ఏంటండీ మా అమ్మాయికన్నా మీరు చేసిన మంచి పని అంటూ వచ్చింది గీత. “ అదా ఒకతను పర్సు పోతే నాకు తెచ్చి ఇచ్చాడు అతను అందులో డబ్బుకుడా తీసుకోలేదు అందుకే డాడీ అతనికి జాబ్ ఇచ్చాడు. పర్సు తెచ్చి ఇస్తే జాబ్ ఇచ్చేయాటమేనా అని గీత అడిగితే. పర్సు తో పాటు అతని నిజాయితీ కూడా కనిపించింది అందుకే ఇచ్చాను జాబ్ అన్నాడు సుందర్. మమ్మీ డాడీ కి అన్నీ నా బుద్దులే వచ్చాయి కదా అంటూ కొంటెగా నవ్వింది స్వీటీ. లేదు!!! నా బుద్దులు వచ్చాయి అంటూ పెద్దగా నవ్వేసింది గీత.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!