విరక్తి

విరక్తి

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

రంగనాధం త్వరగా నిత్యకార్యక్రమాలను పూర్తి చేసుకొని సిద్దమయ్యారు.
భార్యా రమణమ్మ టిఫిను తెచ్చి పెట్టింది టేబుల్ మీద. టిఫిను ముగించి చేతిలో కావల్సిన బ్యాంకు పాసుబుక్కు,ఏటిమ్ కార్డు,పట్టుకున్నారు. అలాగే
కరెంటుబిల్లు కట్టడానికి అది పెట్టకున్నారు సంచిలో. బయలుదేరబోతుంటే భార్య గొడుగు చేతికి అందించింది.
మొదట కరెంటుబిల్లు కడదామని అక్కడికి వెళితే. చాంతాండంత వరుసలో జనాలున్నారు.
బ్యాంకు పని చూసుకొని వద్దామని బ్యాంకు దగ్గరకి చేరుకున్నారు.
ఏటిమ్ దగ్గర కూడా వరుసలలో వున్నారు జనాలు.
బ్యాంకు లోపలికి వెళ్ళి విత్డ్రా ఫారమ్ నింపి తీసుకుందామని ఫారమ్ నింపుతుంటే అటెండరు చెప్పాడు లింకులేదని. ఉసూరుమంటూ అక్కడ
కూర్చుండిపోయాడు. ఒక అరగంటవరకు అలా కూర్చుండి పొయాడు.
మళ్ళీ అటెండరు వచ్చి మీరు ఇక్కడ కూర్చుంటే ఆ లింకెప్పుడు వస్తుందో తెలియదు. ఏటిమ్ లో తీసుకోండి అంటూ పంపేశాడు.
మళ్ళీ ఏటిమ్ దగ్గరకు వెళ్లాడు .అక్కడ జనాలు ఎక్కువమంది లేకపోవడంతో వరుసలో నిలబడ్డాడు.
తన ముందతను తీయబోతే డబ్బులు లేవని మెసేజు వచ్చింది. మళ్ళీ నిరాశచెంది వెనుతిరిగి వచ్చేశాడు. నీరసం వచ్చేసింది ఆటోకోసం ఎదురుచూశాడు. రాలేదు.
మరో పదినిముషాలు ఎదురుచూశాడు.
ఇంతలో ఆటో వచ్చింది. కాని ఇంటి వరకు రానన్నాడు. సరేనంటు అదెక్కాడు.
ఆటోస్టాండులో దింపేశాడు.
అక్కడినుంచి కాళ్ళీడ్చూకుంటూ ఇంటి వైపు నడక ప్రారంభించాడు.
కొడుకులందుకే తనని ఎప్పుడూ మందలిస్తుంటారు. ఇంటర్నెట్ బ్యాంకింకు తీసుకోమని. అన్నీ ఆన్లైలోనే కుదరవంటే వినిపించుకోరు. తన ఉద్దేశం వాళ్ళకి
తెలీదు. ఈ విధంగానైనా నలుగురిని కలవవొచ్చునని తన ఉద్దేశం. ఒకరోజుకాకపోయినా మరోరోజైనా
దొరుకుతాయని ఆశ. అలాగే ఇన్నాళ్ళు గడుపుతూ వస్తున్నాడు. విరక్తి చెందినా మళ్ళీ సమాధాన పరచుకుంటున్నాడు. కాని ఎన్నాళ్ళీ ఈ జీవితం?
దగ్గరు ఎవరుంటారు? పిల్లలు తమ దగ్గరకి వచ్చేయమంటారు .అక్కడ జైలు జీవితం గడపాల్సిందే. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎన్నాళ్ళు అలా గడుపుతాం. ఇంతే ఈ ఆ భగవంతుడు ఎన్నాళ్ళు రాసి పెట్టాడో అన్నాళ్ళు
గడపాల్సిందే తప్పదు. ఆలోచించుకుంటూ ఇంటికి చేరాడు.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!