మంచితనము

(అంశం : “మానవత్వం”)

మంచితనము

రచన:నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు ప్రకాశవంతంగా ఉండి బాగా వేడిగా ఉన్నది.

కారులో సాహితీ సభలు కోసం విజయ వాడ బయలు దేరి వెడుతున్నారు

విజయవాడ టోల్ గేట్ దగ్గర ఆగింది ఎండ బాగా వస్తోంది సన్ షేడ్ లు డోర్ కి క్లిప్ చేసి పెట్టాడు డ్రైవ్ చేస్తున్న హర్ష వర్ధన్

ఆ కారులో ప్రముఖ సంఘ్ సేవకులు రమ్య సౌమ్య ఉన్నారు వారితో వారి అక్క కూతురు అమృత ఉన్నది

హోటల్లో తినే బయలు దేరి నా ఆకలి దంచేస్తోంది మనం వెళ్లే టప్పటికి అల్పాహార విభాగం పూర్తి అయిపోతుంది అనుకుంటూ అక్కడ అమ్మే పుచ్చకాయ బొప్పయికాయ ముక్కలు జామకాయలు బుర్ర గుంజు కోని ఎవరి పాకెట్ వారికి ఇచ్చింది ఓ రెండు వందలు అయ్యింది సరే తప్పుతుందా ఆకలి బాధ కంటే ఎది ఎక్కువ కాదు అనుకున్నారు

టోల్ గేట్ రాను పోను కోని పర్స్ లో పెట్టుకున్నారు

అక్కడి ఎండలో ఇద్దరు పళ్ళు అమ్ముకునే వృద్దుల్ని చూశారు
ఒకరు జామకాయలు సంచుల్లో పెట్టీ ఇస్తే ఇంకొకళ్ళు పట్టు కొచ్చి ఇచ్చారు వాళ్ళు చాలా నీరసంగా ఉన్నారు తిండి తిన్నట్లు లేరు
రమ్య కార్ అపుచేయించి దిగి వెళ్లి ఆ వృద్ధుల దగ్గర ఉన్న పళ్ళు అన్ని నేను కొంటాను ఎంత కావాలో అన్నది

అమ్మ ధర్మాత్మా గుణం ఉన్నది
రెండు రోజుల నుంచి తిండి దొరక లేదు పళ్ళు అమ్ముడు పోవడం లేదు అందుకని ఇక్కడ కి వచ్చీ పళ్ళు పెట్టుకుని అమ్ముధా మన్నా పిల్లులు పరుగెత్తి కెళ్ళి కార్ల దగ్గర అమ్ముతున్నారు మేము వెళ్లి అమ్మ లేక ఈ పళ్ళు తిని ఊరుకున్నాను ఏమి చెప్పా మం టారు అన్నది ఆడమనిషి

మగ మనిషి నిర్లిప్తంగా మీరు ఇవ్వలను కొన్నది ఇవ్వండి అని చెప్పాడు

మీకు ఇల్లు పిల్లలు ఉన్నారా అని అడిగింది.

ఇల్లు లేదు కానీ పిల్లలు ఉన్నారు వాళ్ళ ని పెళ్లి చేసి పంపాము ఇద్దరు ఆడపిల్లలే
మొదటి నుంచి మాది పళ్ళ బిజినెస్ తోటలకు వెళ్లి చెట్లు కోని పళ్ళు అమ్మే వాడిని వచ్చిన డబ్బు తిండికి పిల్లల పెళ్లికి సరిపోయింది మేము ఇద్దరమే కదా అందుకే ఇల్లు విషయం కన్నా ఆడపిల్ల పెళ్ళిళ్ళు ముఖ్యం అని అనుకున్నాము వాళ్ళు బాగానే ఉన్నారు

ఇంటికి రమ్మన్నారు కానీ అల్లుడు చూస్తాడా నెల అయ్యాక ఇంకా మేము చుడము మీరు రెండో కూతురు ఇంటికి వెళ్ళండి అన్నారు

ఇద్దరం ఆలోచించాను మళ్లీ ఆ అల్లుడు అలాగే అంటాడు అని మేము నిర్ధారణ చేసుకుని సొంత ఉరు వచ్చేసి మళ్లీ పళ్ళ బిజినెస్స్ చేస్తున్నాము

ఊరు వెంట వెళ్ళ లేక ఇలా హైవే పై అయితే ఒక చోట ఉండి చెయ్యి వచ్చును అనుకున్నాను కానీ ఇక్కడ కూడా మాకు సమస్య వచ్చింది
ఎండలో కూ ర్చో లెను అది వండి తెచ్చి పెట్టలేదు తగిన డబ్బు రావడం లేదు అని చెప్పారు

మీకు ఇద్దరికీ అభ్యంతరం లేక పోతే మాతో వచ్చెయ్యండి అని
అన్నారు
ఇద్దరు ఒకరి మొఖం వేరొకరు చూసుకుని అలాగే అమ్మగారు అన్నారు

మీరు మాతో పాటు విజయవాడ తీసుకెళ్ళి మేము అక్కడ దిగి మిమ్మల్ని నిడదవోలు ఆశ్రమానికి పంపుతాను అన్నది
పళ్ళు డిక్కీ లో పెట్టించి వెయ్యి రూపాయలు ఇచ్చింది

వాళ్ళు ఇద్దరు మొఖ మాట పడ్డారు మేము ఇలా మీ వెంట రావడం మాకు సిగ్గుగా ఉన్నది అని చెప్పారు

నిజానికి రమ్య సౌమ్య దార్లో ఎప్పుడు వృద్దులకు సహాయం చేస్తూ ఉంటారు ఏమైనా తిన్నారా అని ఇడ్లీ పాకెట్స్ కట్టించి తెచ్చిన వి ఇవ్వడం
అన్నం పొట్లాలు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు
అదే పద్ధతిలో ఈ రోజు వీళ్లకు
ఆశ్రయం ఇవ్వడానికి వాళ్ళు
వారి పెద్ద కార్లో ఎక్కించుకుని విజయ వాడ వేపు బయలు దేరారు

పళ్ళ కుటుంబం భార్య భర్తలు కార్లో ఒదిగి భయం భయంగా కూర్చున్నారు

విజయ వాడ సభాల కాలేజి దగ్గర దిగి వీరిని మళ్లీ హోటల్ లో టిఫిన్ పెట్టించి భోజనం టైమ్ కి నిడదవోలు తీసుకు వెళ్లి జాయిన్ చెయ్యమని చెప్పారు
హర్ష సరే అంటూ వారిని మళ్లీ కార్ ఎక్కించుకుని బయలు దేరి దారిలో హోటల్ లో టిఫిన్ పెట్టించాడు

ఆలా ఆశ్రమంలో రెండు రోజులు ఉండి తరువాత వాళ్ళ ఊరికి వాన్ లో వెళ్లి ఆ ఊరి ఇంటికి అద్దె కట్టి వారి బట్టలు తీసుకుని సామాను అంతా పక్క ఇంటివారికి ఇచ్చి పిల్లలకు ఫోన్ చేస్తాను వారు వచ్చి కావాల్సినవి వచ్చి పట్టు కడతారని చెప్పారు

ఇన్నాళ్లు ఇక్కడ బాగా బ్రతికారు ఇప్పుడు ఇలా వదిలి వెళ్లిపోతున్నారు అని పక్కింటి అమె ఇంటి అమె బాధ పడ్డారు

కానీ మాలాంటి ఇల్లు గడవని వాళ్ళు ఎంతో మంది అక్కడ ఉన్నారు వారిని చూసి మనం ధైర్యం తెచ్చుకుని జీవితంలో ముందు అడుగు వెయ్యాలి

పిల్లలు ఉన్నా చూసే వాళ్ళు ఎంతో మంది లేరు చూడని వాళ్ళే ఎక్కువ ఇది నేటి సమాజం తీరు తెన్ను కూడా.

అందుకే ఈ నాడు ఆశ్రమాల సంఖ్య పెరిగింది.

సాహితీ సభలో ప్రసంగానికి రమ్య ను పిలిచారు ఇప్పుడు జరిగిన విషయం కళ్ళకి కట్టి నట్లు చెప్పింది అంతా ఎంతో మెచ్చుకున్నారు చప్పట్లు మారు నలుదిశలా మారు మ్రోగాయి

సౌమ్య రమ్య డాక్టరేట్ చేసి లెక్చరర్ లుగా పనిచేసే రిటైర్ అయ్యి కాలేజి పెట్టాలని సొంత ఊరు నిడదవోలు వచ్చారు

కానీ అక్కడి తల్లి వయస్సు వాళ్ళు వీళ్ళను చూసి ఆనంద పడి అమ్మ అంటు వీళ్ళ దగ్గర వారి జీవిత సమస్యలు చెప్పుకోవడం వల్ల విరు వృద్ద ఆశ్రమం పెట్టారు ముందు వాళ్ళ పెన్షన్ డబ్బుతో ఆశ్రమం నడిపే వారు ఆ తరువాత దాతలు వచ్చి వారు వంతు కూడా డబ్బులు ఇచ్చి పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఆశ్రమంలో డబ్బు కట్టీ చేసుకుని వీరితో పంచుకుంటున్నారు

అలా రమ్య సౌమ్య ఇప్పుడు ఆరు ఊళ్ళల్లో ఆరు ఆశ్రమాలు నడుపుతూ ఎందరికో అన్నం పెడుతున్నారు

పళ్ళ వృద్ద దంపతులు కూడా అక్కడ ఆశ్రమంలో ఉండి తాత మొక్కల పనులు బామ్మ కూరలు వంట పని సహాయం చేస్తూ వారి వంతు సహాయం చేస్తుంది

మంచి తనము ఉంటే ఊరు మన దవుతుంది అంటారు

విరు ఆశ్రమంలో అందరితో మంచిగా ఉండి సహాయం చేస్తూ కాలం గడుపుతున్నారు

మానవత్వం మాటల్లో కాక చేతల్లో చూపే వారు అతి తక్కువ ఉన్నారు

మనిషికి మనిషికి మాట అవసరం సహాయం అవుసరం అది తెలుసుకుని మనుష్యులు
బ్రతకాలి గొప్పలు ఆదర్శ కబుర్లు కాదు చేతల్లో చూపాలి
అదే నిజమైన మానవత్వము.

కన్న పిల్లలు కూడా రక్త సంబంధం విలువ తెలుసుకోవడం లేదు

భర్త పెళ్ళాన్ని కష్ట పెట్టడం కట్టుకున్న దాన్ని వేదించడం తల్లి తండ్రులని భదించడం పిల్లల్ని కూడా హించించడం
మాటలతో చేతలతో మనిషి
తోటి మనిషిని ఆదరించి చూస్తామని చెప్పి పెళ్లి చేసుకుని ఆతరువాత తన అక్క చెల్లెళ్ళ చూసుకుని గొప్పలు పోతు భార్య ను చిన్న చూపు చూడటం అత్త మామల ను మానసిక హింస కు గురి చెయ్యడం ఇలా ఎన్నో రకాల సమస్యలతో ఎందరో వృద్ద ఆశ్రమాలు చేరి పట్టెడు మెతుకులు కోసం బ్రతుకుతూ ఎందరో జీవితాలు గడుపుతున్నారు

నా అన్న వాళ్ళే మోసం చేస్తారు
కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు
నమ్మించి మోసం చేసే వారు పెరిగి పోయారు ఆస్తుల కోసం ఎన్నో రకాల మోసాలు ఇలాంటి ఎందరో అభాగ్యులకు
వీరు ఆశ్రయం ఇచ్చి జీవితానికి
అర్థం చెపుతున్నారు మన కున్న దానిలో పది రూపాయలతో అర్తులకి అన్నర్తులకి భోజనం టిఫిన్ పెడితే చాలు అంటారు రమ్య సౌమ్య కొందరైనా అర్థం చేసుకుంటే అంతే చాలు

జీవిత ము నాటక రంగం అని ఇంగ్లీష్ కవి నాటక రచయిత షేక్స్పియర్ అన్న పుట్టుట గిట్టుట నిజము న ట్ట న డి మ పని నాటకము అని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనల్లో చెప్పిన సారం అంతా ఒక్కటే అని మానవులు తెలుసుకుంటే చాలు అదే మంచి తనము మాన వత్వము కదా ఏనాటి నుంచు పెద్దలు పురాణాలు ఎన్నో మానవత్వ
పు విలువలు తెలుసుకో వచ్చును కనీసం అటువంటి సంస్థలకు సహాయం చెయ్యి డము ద్వారా అయినా కొంత
మంచితనం అలవాటు చేసుకోవచ్చును.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!