వేషాలు ఆటలు

వేషాలు ఆటలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

సూర్యోదయాన్ని అరుగు పైన పిల్లలు ఆటలు ఆడుతూ పాటలు పాడుతారు. ఊళ్ళో ఆడపిల్లలు ఆ ఇంటికి వస్తారు. వేసవి కాలంలో ఆటలు పాటలు వేషాలు వెక్కి రింతలు అన్ని అరుగు పైనే. అంతవరకు వేద విద్య నేర్చుకునే విద్యార్థులు ఉండేవారు. వేసవి సెలవలకి ఇళ్లకు వెళ్లారు.
పూర్ణ చక్కని ముగ్ధ మోహన రూపము. పిల్లలు అందరిలోకి అందగత్తె ఆ ఊరు పం డీ తులుగారు మనుమరాలు. ఇంట్లోంచి బయటకు వెళ్లి ఆడుకో నివ్వరు, అందరూ పిల్లలు వచ్చి వీళ్ళ ఇంటి అవరణ లోనే ఆడుతారు. ఇక్కడ మగ పిల్లలు ఎవరూ ఉండరు. అందరికీ ఆయన అంటే భయము. ఎవరూ మగ పిల్లలు ఆకతాయి పిల్లలు ఇక్కడకి రారు, పుర్ణని బయటికి పంపడం తాత గారికి ఇష్టం ఉండదు. ఆడపిల్లల చేత గుజ్జన గూళ్ళు ఆట ఆడిస్తారు పూర్ణ తల్లి మేనత్త లు అంతా కలిసి ఆడ పిల్లల చేత ఈ ఆట ఎంతో బాగా పద్ధతిగా చేయిస్తారు. అంటే ఈ ఆటలో బొమ్మల పెళ్ళి చేసి పెళ్లి వారికి విందు భోజనం పెడతారు. ఈ విందు భోజనానికి చిట్టి అరిసెలు చిట్టి బూరెలు అన్నివండుతారు. పిల్లలకి ఖారలు తగ్గించి పప్పు పులుసు కూర వేపుడు పిండి వంటలు పెళ్లి సారే బుల్లి అరిసెలు వండించి బొమ్మల పెళ్ళి భోజనాలు పెడతారు. అలా ఈ ఆటలో ఇంటి పెద్దలు కూడా సంతోషం పంచు కుంటారు. పిల్లల్లో ఆడపెళ్ళి వారు మగ పెళ్లి వారు పద్దతిలో విడి విడి గా రెండు బ్యాచ్ లుగా విడి పెళ్లి కి ఆడ పెళ్లి వారు మగ పెళ్ళి వారుగా వేరుగా కూర్చుంటారు ఓ ఇరవై మంది ఆడపిల్లలు ఉంటారు. ఐదు ఏళ్ల పిల్లలు మొదలు పన్నెండు ఏళ్లు వారి వరకు ఉంటారు. వచ్చిన పిల్లలు రెండు భాగాలుగా విడిపోతారు, ఆడ పిల్ల పెళ్లి వారు మగ పిల్ల పెళ్లి వారు, మగ పెళ్ళి వారు చక్కగా పాడుతూ బుజ బుజ రేకుల. పిల్ల ఉందా అంటే మళ్లీ పిల్ల ఉందని పెళ్లి చూపులకి రమ్మని పిలుస్తారు. మళ్లీ కట్నాలు ఆభరణాలు సారే, చీర అన్ని అడిగి పెళ్లి ఘనంగా చేస్తారు అన్ని ఇచ్చి నగలు పూసల నగలు పెట్టీ బొమ్మను అలంకరిస్తారు. దీని వల్ల పిల్లలకి ఆటలు పాటలు మరియు కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా, నడిపే విధానం అలవడుతుంది.
ఆ తరువాత పెద్ద వాళ్ళు కలుగ చేసుకుని పిల్లలకి ఆకుల్లో వండిన పదార్థాలు అన్నం పిండివంటలు వడ్డించి పిల్లల భోజనాలు పెడతారు. పూర్ణ కూతురు బామ్మ డబ్బు ఉన్నది అవతలి స్నేహితురాలి కొడుకు కి అంతా డబ్బు లేదు చదువు ఉద్యోగం ఉంది కనుక పెళ్లి చేశాను నా పిల్లని అత్తింటికి పంపను  నీ పిల్లాడిని నా ఇంటికి పంపు నేను కారు కోని ఇస్తాను. ఉద్యోగానికి కార్ లో వెళ్ళమని చెప్పు అంటుంది పూర్ణ ఇదేమిటి ఒక్కరోజు అయిన పిల్లను పంపవా అని మగ బొమ్మ తల్లి అడిగితే నీ ఇంట్లి ఏసీ లేదు పెద్ద టీవీ లేదు అంటు కారణాలు చెపుతుంది.
మరి బొమ్మ పెళ్లికి ఇలా చెపితే నిజం పెళ్లి లో ఇంకా ఎన్ని కావాలి నువ్వు నా పిల్ల చేత పని చేయిస్తాను అని పూర్ణ కసురుతుంది. పెద్ద వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఆట పాటలతో ఈ బొమ్మల పెళ్ళి చేయిస్తారు. ఒక్కోసారి పెళ్లి పంతుల్ని పిలిచికూడ చేస్తూ ఉంటారు. విత్తం కొద్దీ వింతలు కదా
అందుకే ఇలా చేయడం వల్ల సమాజం పట్ల పెళ్లి వ్యవస్థ పట్ల పిల్లలకి అవగాహన వస్తుందిi పూర్ణ కి స్నేహితులు అంటే ఇష్టము రోజు ఉదయమే ఆటలు ఆడేవారు సాయంత్రం పిల్లల్ని బయటకు వెళ్ళ నిచ్చేవారు కాదు, పూర్ణ స్కూల్ లీడర్ ఆడపిల్లల స్కూల్ లో  చదివేది కనుక స్కూల్ నుంచి పద్మిని వేషం వెయ్యడానికి ఎడ్ల బండిపై మాస్టారు పిల్లల్ని దుప్పటీ అడ్డు కట్టి తీసుకెళ్ళి కార్య క్రమం చేశాడు. అందులో పృధ్వీరాజ్ వేషం వేసే అమ్మాయికి కాళ్ళకి కడియాలు ఉంటే అవి ఊడ కొట్టించే ఇంట్లో వాళ్ళ చేత చివాట్లు తిని మరి కార్యక్రమం చేసింది. అయితే మొదటి బహుమతి వచ్చింది. ఆ స్కూల్ కి పద్మిని వేషం లో నిజంగా రాణి పద్మిని హుందా తనం అంతా చూపించింది. ఆలా పూర్ణ చాలా సాహసాలు చేసేది. ఆడపిల్ల వి నీ కెందుకు అని పెద్దలు అన్నారు వింటుందా? పూర్ణ ఇలా పెద్దల ను వప్పిస్తు చివాట్లు తింటూ కార్య క్రమాలు చేసి మంచి బహుమతులు తెచ్చుకునేది. అలా పాటల పోటీలు నాటకాలు వేస్తూ వ్యాస రచన ఉపన్యాసాలు అన్ని టా కూడా ఫస్ట్ ఎన్ని మార్కులు వచ్చినా ఎంత అందంగా ఉన్నా ఆడపిల్ల ఉద్యోగాలు ఊళ్లు కాదు పెళ్హి చేసేయాలని తాత పట్టు బట్టి మేనత్త కొడుకు శ్యామ్ కి వైభవంగా పెళ్లి చేశారు పిడి కిట తలంబ్రాల పెళ్లి కూతురు అంటూ సన్నాయి శ్రావ్యంగా వినిపిస్తుంటే పెళ్లి అయ్యింది, అని పూర్ణ కథ ముగించింది. పిల్లలు పెద్దలు మనసు నొప్పించకుండా వప్పించి ఎదగాలి. పెళ్లి తరువాత పూర్ణ భర్త సహాయంతో పిజి చేసింది మంచి రచయిత్రిగా ఎదిగింది. పిల్లలు మీరు మరి మీరు భోజనాలు తింటూ చక్కగా కథ  విన్నారు కౌసల్య రామ్మ పిల్లలకి మంచినీళ్లు ఇయ్యి అన్నది. అమ్మ నువ్వు కథ చెప్పావు వాళ్ళు వింటూ అన్నం తిన్నారు ఎలా ఇలా వాళ్ళు అన్నం తిన్ పించాలి అంటే కుదరదు అన్నది. అందుకే నాన్నమ్మ అమ్మమ్మ దగ్గరకి సెలవలకి పంపితే వాళ్ళకి వ్యక్తిత్వ వికాసం వస్తుంది అన్నది పూర్ణ, మరి పిల్లలకు నచ్చిన విధంగా పెద్దలు మారాలి అని నవ్వింది. పిల్లలని మరి పించడానికి కథల ద్వారా నీతి భోధన చేస్తూ జీవిత సత్యాలు కథల్లో చెప్పాలి అప్పుడు పిల్లలు చక్కగా అన్నము తింటారు పెద్దల మాట వింటారు అని పూర్ణ నవ్వింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!