నా ప్రేమ దేవత

(అంశం::” ప్రేమ”)

నా ప్రేమ దేవత

రచయిత :: సత్య కామఋషి’రుద్ర’

ఆఫీస్ లోకి అలా అడుగు పెట్టి పెట్టగానే గుప్పున ముక్కును తాకిన రూమ్ ఫ్రెషనర్ సువాసనలు. తనువు ఒక్కసారిగా పులకరించింది. మైండ్ కూడా రిఫ్రెష్ అయ్యింది. చుట్టూ ఎటు చూసినా కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఇంటీరియర్. వెరీ క్లీన్ అండ్ టీడీ. టిప్ టాప్ గా తయారయ్యి వచ్చాడు సత్య. అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్లి తన వర్క్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు.

కానీ అతని మనసు అతని ఆధీనంలో లేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. తన కళ్ళేమో పక్క టేబుల్ మీదకు, ఎంట్రీ డోర్ మీదకి మారుతూ ఉన్నాయి. డోర్ చప్పుడు అయిన ప్రతిసారీ ఏదో తెలియని తత్తరపాటు. తన టేబుల్ సర్దుకొని, వర్క్ స్టార్ట్ చేశాడు. కానీ ఎంత ప్రయత్నించినా పని మీద ఫోకస్ చేయలేక పోతున్నాడు. పక్క టేబుల్ మీదే అతని ధ్యాసంతా. మధ్య మధ్యలో తలుపు వైపు చూస్తూ టెన్షన్ ఫీలవుతున్నాడు.

తన పక్క టేబుల్ శ్వేతది. రోజూ టైం కి టంచనుగా వచ్చే శ్వేత ఆ రోజు ఇంకా రాలేదు. “తన గురించే మరి సత్య ఎదురుచూపులు”.
శ్వేత..తెల్లని ఛాయ, చెంపకు చారెడు కళ్ళు, ఐదు అడుగుల నాలుగంగుళాల ఎత్తు..ఆ ఎత్తుకు తగినట్టుగా కొలిచి పోత పోసినట్టి శరీర సౌష్ఠవం. పద్దతైన వస్త్రధారణ కు తగ్గట్టు పొందికైన అల్లికగా నడుమును దాటుతూ పొడవాటి నల్లని వాలుజడ. ” ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడలనిపించేంత అందమైన బాపు బొమ్మ”.

సత్య ఆ కంపెనీలో జాయిన్ అయ్యి దగ్గర దగ్గర నాలుగేళ్లు కావస్తోంది. అక్కడ చేరిన తొలిరోజు, శ్వేత ను చూసిన తొలిక్షణం నుండి ఆమెను ప్రేమిస్తున్నాడు. తన పని చేసుకుంటూ, ఓరగా ఆమెను చూస్తూ మౌనంగా ఆరాధిస్తూ ఉన్నాడు. ఆమె కదలికలు, హావభావాలు, అలవాట్లు, అన్నిటినీ ఆకళింపు చేసుకుంటూ.. గాలికి అలా తేలియాడే ఆమె ముంగురులు, వాటిని సవరించుకొని చెవుల వెనుకకు సుతారంగా నెట్టే ఆమె చూడముచ్చటైన మునివేళ్ళు, పనిలో భాగంగా మెల్లగా కదలాడే ఆమె కాటుక కళ్ళు, మధువులూరే పెదవులు…ఇలా ఆమె అణువణువు లోని అందాన్ని ఆరాధిస్తూ, చూపులతోనే ఆస్వాదిస్తూ ఉన్నాడు.

“కేవలం రూపంతోనే కాదు , ఎవరికైనా బాధ వస్తే అది తన బాధగా తల్లడిలిపోయే సున్నితమైన హృదయం,ఎప్పుడైనా, ఎవ్వరికైనా సరే తనకు చేతనైనంతలో సహాయ పడే ఔదార్యం, అందరిలోనూ ఇట్టే కలిసిపోయిన కలివిడితనం.. ఇంకా ఇలాంటి మంచి లక్షణాలు , గుణగణాలతో మంచి మనసుతో కూడా సత్యనారాయణ ఆకట్టుకుంది ” శ్వేత.

సత్య శ్వేతను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అనే విషయం, దాదాపుగా ఆ ఆఫీసులో ప్రతి ఒక్కరికీ తెలుసు. నిజానికి ఆ విషయం శ్వేతకు కూడా తెలుసు. సత్య తనను ఓ కంట చూస్తుండడం, గమనిస్తూ ఉండడం తనకు కూడా తెలుసు. ఆఫీసులో వారితో తన గురించిన విషయాలు ఆరా తీయడం, తన గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉండడం.. ఇవన్నీ కూడా శ్వేతకు తెలుసు. కానీ శ్వేత తనకు తెలుసన్న సంగతి సత్యకు మాత్రం తెలియనీయలేదు.

సత్య కూడా తక్కువేం కాదు. అందంలో అమ్మాయిల కలల రాకుమారుడంతటి వాడే. “ఆరడుగుల ఆజానుబాహుడు కాకున్నా
ఏ వెరీ హేండ్సమ్, డీసెంట్ గుడ్ లుకింగ్ గై. ఒత్తైన జుత్తు, మగసిరైన మీసకట్టు విత్ ట్రిమ్డ్ బియర్డ్..మంచి ఫిజిక్. ఇంకా చాలా నెమ్మదస్తుడు, మృదుస్వభావి, ఫ్రెండ్లీ ఆటిట్యూడ్. ఒక్కమాటలో చెప్పాలంటే ఎ ప్యూర్ అండ్ జెన్యూన్ లీ జెంటిల్మెన్”. తనంటే శ్వేతకు కూడా చాలా చాలా ఇష్టం. “ఒక మగాడు తన ప్రేమను ముందు అతడే బయటపెట్టాలని ఇన్టెన్షన్ తనది”. ఆ మూమెంట్ ఎప్పుడెప్పుడా అని తను కూడా చాలా కాలంగా వెయిట్ చేస్తోంది.

ఇలా వారిద్దరి మధ్యన ఒక స్వీట్ అండ్ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చాలా కాలంగా నడుస్తోంది. కానీ చాలా సైలెంట్ గా. ఇక “ఆ రోజు శ్వేత పుట్టిన రోజు. దానిని మంచి సందర్భంగా మలచుకొని, శ్వేతకు తన ప్రేమను ప్రపోజ్ చేసేందుకు ప్రిపేర్ అయ్యి వచ్చాడు సత్య”. లోపల ఎంతో భయంగా ఉన్నా, ధైర్యాన్నంతా కూడగట్టుకొని, ఏదైతే అది అవుతుందని మెంటల్ గా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు.దానికి తగిన ఏర్పాట్లను ముందుగానే అరేంజ్ చేసుకొన్నాడు. అందుకోసం ఆ నిరీక్షణ, ఆ కంగారు, అంతటి ఉత్సుకత.

ఆఖరికి మనవాడి నిరీక్షణ ఫలించినది. తన తపస్సుకు మెచ్చిన ప్రత్యక్షమైన దేవకన్యలా , తలుపు తెరుచుకుని లోపలికి వచ్చింది. చిలకమ్మ రంగు చీర చుట్టుకొన్న ముద్ద బంతి పువ్వులాగా, అలా మెరిసిపోతున్న తనను చూసి
అలా అవాక్కయి పోయి, ప్రాణమున్న శిలలాగా కంట్లో మెరుపులతో తనను చూస్తూ అలా నిలబడిపోయాడు కాసేపు.గుడికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయ్యింది.
మనవాడి ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్లయ్యింది.

ఒకరి తరువాత ఒకరుగా, అందరూ శ్వేత కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరిలో తానూ ఒకటిగా, ఫార్మల్గా, ” హ్యాపీ బర్త్డే శ్వేత గారు” అని చెప్పుకుంటూ
అలా పక్కకు జారుకోబోయాడు, అప్పటికి. ఈలోగా చేయి కలపమన్నట్టుగా, తన చేతిని ముందుకు చాపింది శ్వేత.ఊహించని ఆ పరిణామానికి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యి, కంగారుగా తన చేతిని చాపి, శ్వేత చేతితో కలగలపి కరచాలనం చేశాడు. ప్రేమికులు తొలి స్పర్శకు ఉబ్బితబ్బిబ్బై ఆకాశంలో తేలిపోతున్నారు. అలా సిగ్గుపడుతూ చూడలేక చూడలేక శ్వేత ముఖం వైపుగా చూశాడు. అప్పటికే తనను ఓరకంట చూస్తూ, సన్నగా ముసిముసి నవ్వులు చిందిస్తున్న,
ఆమె కళ్ళలోకి కళ్ళుపెట్టి చూస్తూ, ఆ ఆకాశం అంచులను దాటి , తెలియని స్వర్గము అంచులలో తేలియాడుతూ ఉండిపోయాడు సత్య.

తిరిగి తేరుకొని మామూలు మనిషి అయ్యేలోపు సాయంత్రం అయిపోయింది. ఆఫీస్ అవర్స్ క్లోజింగ్ టైం అయిపోయింది. అయినా ఆఫీసులో కొంచెం హడావుడి వాతావరణం నెలకొంది. ఆఫీస్ లో ఎవరివైనా పుట్టిన రోజులు , స్పెషల్ అకేషన్స్ వంటివి ఉంటే ఈవినింగ్ కాన్ఫరెన్స్ హాలులో ఆ ఈవెంట్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇది నేటి కార్పొరేట్ వర్క్ కల్చర్ లో భాగమే. ఆల్ఫ్రెడీ అందరూ అక్కడ అసెంబుల్ అయ్యారు. సత్య కూడా ఆ సమయం కోసమే వెయిట్ చేస్తున్నాడు.

గబగబా ఫ్రెష్ అయ్యి, తన బ్యాగులోని డియోడరెంట్ ఫుల్ గా స్ప్రే చేసుకొని, కాన్ఫిడెంట్ గా హాలు దగ్గరకు చేరుకున్నాడు. లోపలకు అడుగు పెడుతూనే , లోపల వాళ్ళు అందరూ సత్యని స్పెషల్ గా ఫోకస్డ్ గా చూడడం మొదలు పెట్టారు. కానీ అదంతా సత్య ముందుగా ఊహించినదే. కారణం “ఆ హాల్ డెకరేషన్. తన లవ్ ప్రపోజ్ చేసే ఉద్దేశంతో , ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు”. హాలు అంతా
హార్ట్ షేప్ రెడ్ అండ్ వైట్ కలర్ బెలూన్స్ తోటి, ఫ్లవర్డ్ కాన్సెప్ట్ డిజైనర్ స్పెషల్ డెకరేషన్ తోటి, చాలా బాగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దించాడు.

అలాగే ముందుకు కదులుతూ వెళ్ళి, శ్వేత ముందు నిలబడ్డాడు. కాన్ఫిడెంట్ గా ధైర్యంగా తన కళ్ళలోకి కళ్ళుపెట్టి సూటిగా చూస్తున్నాడు. తన ప్రీ ప్లాన్డ్ గా రెడీ చేయించిన స్పెషల్ కేక్
అక్కడ తన ఎదురుగా ఉంది. ముందు కేక్ కటింగ్ కానివ్వమన్నట్టుగా కళ్ళతో చిన్న సైగ చేశాడు. తిరిగి తను ఏదో అడగబోయేలోపుగా, ” హ్యాపీ బర్త్ డే” అంటూ థీమ్ సాంగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలయ్యింది. అందరూ దానితో ట్యూన్ కలపగా, శ్వేత కేక్ కట్ చేసింది.

అది పూర్తవుతూనే …దాని వెనకాలే మరో రికార్డింగ్ స్టార్ట్ అయ్యింది… సత్య గొంతు అది..ఇలా సాగుతూ

నా కన్నులలో నిత్యం కదలాడే రూపమా,
నా గుండెల్లో కొలువై, నను ముందుకు
నడుపుతున్న నా కలల ప్రతిరూపమా..

నీ ఊపిరినే శ్వాసగా మలచుకొన్నాను
జీవిత కాలపు నీ చెలిమే నా ఆశగా…
నీ ధ్యాసలో.. నన్ను నేను మరిచాను..

నువు లేని నన్ను ఊహించుకోలేక
నీ చెలిమి పొందలేని నేను, నేను కాను
నా జత కావా..ఎప్పటికీ నా దానివై
నా మది గదిలోని ప్రేమ సామ్రాజ్యానికి
ఏలికవై….నా ప్రేమ దేవతవై….

అది అలా వింటూ ఉన్నారు అందరూ శ్వేతతో సహా. అది పూర్తయి శ్వేత అలా తేరుకునే టైంకి, మోకాళ్ల మీద కూర్చొని , ఒక చేతిలో ఫ్లవర్ బొకే, మరొక చేతిలో గోల్డ్ రింగ్ తో ఎదురుగా సత్య. ఎప్పటి నుండో నీకు చెప్పాలని ఉన్నా చెప్పలేక నా మది లోతులలో దాచుకున్న మాట, నా పెదవి గడప దాటని మాట, నీకు తప్ప వేరొకరికి చెప్పని, చెప్పబోని మాట….”ఐ లవ్ యూ శ్వేత, ప్లీజ్ బీ మైన్ ఫరెవర్” అంటూ
తన మనసును శ్వేత ముందు పరిచాడు.

తను ఏమంటుందో, ఎలా రెస్పాండ్ అవుతుందో అని ఒకటే టెన్షన్ , ఎగ్జైట్మెంట్. సత్య లోనే కాదు, అక్కడున్న అందరి ముఖాల్లోనూ స్పష్టంగా కనబడుతుంది. వాటన్నిటికీ తెర దించుతూ.. సిగ్గుల మొగ్గై, పట్టలేని ఆనందంతో, అలా ఆనందబాష్పాలు నేలరాలుతుండగా ..” ఇన్ఫాక్ట్, ఈ క్షణాల కోసం, నీ నుండి ఈ మాటల కోసం , నేను ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్నానో నాకే తెలుసు. ఐ టూ లవ్ యూ..లవ్ యు ఎ లాట్ సత్య” , అంటూ బదులిచ్చింది.

ఫ్లవర్ బొకే ఇచ్చి, ఉంగరాన్ని శ్వేత వేలికి తొడిగాడు సత్యం. చూపులు కలువగా, ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ

ఇద్దరూ ఒకరినొకరు ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. హాల్ అంతా విజిల్స్, చప్పట్లతో మారుమోగిపోయింది.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!