నీ స్నేహమే నా ప్రాణం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                           నీ స్నేహమే నా ప్రాణం

రచన ::శ్రీదేవి విన్నకోట

చిన్నప్పటి నా చిలిపి అల్లరి నేస్తం.
జానకి నామధేయమై ఉండు.
అమ్మో తనునేను చేసే అల్లర్లకు అంతే లేకుండా ఉండు.
కలసి చేసిన చిరుప్రాయపు దొంగతనాలు ఎన్నెన్నో
మేం ఇరువరం అడిన దొంగ పోలీస్ ఆటలు మరెన్నో
కాకెంగిళ్ళు, కష్టసుఖాలు,
కలిసి పంచుకోవడాలు.
కల్తీ లేని కల్మషమేరుగని అరమరికలెరగని అమాయకమైన
బాల్యపు స్నేహం మాది.
ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా అందరినీ నవ్విస్తూ
అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరాలకాలంతో పాటు పెరిగి పెద్దదై కొనసాగుతుంది మా అల్లరి స్నేహం,
అప్పటికీ ఇప్పటికీ నా అల్లరి చిలిపి నేస్తం తానే, తనకోసమే ఏమైనా చేయాలనిపిస్తుంది,
తనతో మాట్లాడకపోతే
రోజు గడవనంటుంది,
అంత ప్రాణమైపోయింది
నాకు నా అల్లరి నేస్తం,
మా స్నేహానికి అర్థం తాను,
తన లోకమే నేను.
మేమిద్దరం కలిస్తే అసలు అల్లరికి హాద్దే లేదు.
మేము వేరు వేరు ప్రాణులం కానీ మా ఇద్దరి మాట భావం ప్రాణం ఒకటే
ఇంతకుమించి మా అందమైన స్నేహానికి ఏమికావాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!