భయం గుప్పెట్లో

(అంశం::”ఆ చీకటి వెనకాల”)

భయం గుప్పెట్లో

రచయిత :: యం.సుశీలా రమేష్

కరోనా రెండో దశ దిశ మార్చుకుని భయంకరంగా ఉంది.
ఎంత భయంకరంగా ఉందంటే,
దాని లక్షణాలు బయటపడక ముందే చాలా మంది గుండె విఫలమై చని పోతున్నారు.

కరోనా సోకిన వాళ్ళ కన్నా , నాక్కూడా కరోనా సోకు తుందేమో అనే భయంతో మానసికంగా కుంగిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అలాంటి కోవకు చెందినదే నా జీవితంలో జరిగిన యదార్థ ఘటన.

‌. నా పేరు స్వాతి, నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మా వారి పేరు శ్యామ్. తను సాఫ్ట్వేర్. మాకు పెళ్లి జరిగి రెండేళ్లు. అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాము. ఉండేది హైదరాబాద్ నేను ఇంటి నుండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా టీచింగ్ చేస్తున్నాను. శ్యామ్ ఆఫీస్కి వెళ్ళే వారు, ఇంటికి తిరిగి వచ్చాక స్నానం చేయడం నీలగిరి తైలం తో ఆవిరిపట్టడం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఆఫీస్ కి వెళ్ళి వచ్చేవారు.

శ్యామ్ చాలా అల్లరివాడు. బాగా నవ్విస్తారు, చాలా సరదాగా ఉంటారు నాతో, ఈ రెండేళ్లలో నేను భర్తను అనే అధికారం నామీద అ ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఇంకా చెప్పాలంటే శ్యామ్ నన్ను చాలా బాగా చూసుకునే వారు. ఇంట్లో ఉంటే తనే వంట చేసేవారు. తనకు పాటలంటే చాలా ఇష్టం ఇద్దరం కలిసి పాటలు పాడుతూ చాలా సరదాగా గడిచిపోయేవి రోజులు.

ఏమైందో తెలియదు గానీ ఒక రోజు శ్యామ్ ఆఫీస్ నుండి తిరిగి వచ్చి లైట్ వేయకుండా చీకటిలో కూర్చున్న చాలా బాధపడుతున్నారు. ఎంత పిలిచినా పలకడం లేదు, ఏం జరిగిందా అని నేను ఆ చీకటి గదిలో కి తడుముకుంటూ వెళ్లాను, పక్కనే ఉంటే ఆన్ చేశాను. లైట్ వెలుతురులో శ్యామ్ కళ్ళు ఎర్రబడి ఉన్నాయి అంటే ఏడ్చినట్టు ఉన్నాడు.

నాకైతే ఏం జరిగిందోననని కంగారు మొదలైంది. వెళ్లి ఆయన భుజం మీద చేయి వేసాను. వెంటనే ఆయన నన్ను చుట్టుకుని మరింత బిగ్గరగా ఏడుస్తున్నారు. నా గుండె భయంతో అదిరిపోతుంది. శ్యామ్ అలా ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు నాకు.

కొంచెం సేపు అలా ఏడ్చిన తర్వాత శ్యామ్ ఏం జరిగింది అంటూ మెల్లగా అడిగాను ఆయనను మరింత దగ్గరగా తీసుకొని,

ఈరోజు నా కొలీగ్, ఆఫీసులో ఇంకా మరో సెక్షన్లో ఐదుగురు చనిపోయారు, ఆరేళ్ల నుంచి ఒకరికి ఒకరం బాగా తెలుసు. అంటూ ఏడుస్తూనే చెప్పారు శ్యామ్.
తెలియని వాళ్ళు చనిపోయారు అంటేనే నాకే ఇంత బాధగా ఉంది.
ఒకే దగ్గర వర్క్ చేసే వాళ్ళ మనో వేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను.

‌ అంత మంది చనిపోవడం వలన పది రోజులు సెలవులు ప్రకటించారు యాజమాన్యం.

శ్యామ్ పరిస్థితి వర్ణనాతీతం. సరిగా తినడం లేదు, నిద్రపోవడం లేదు. నిద్దట్లో ఉలిక్కిపడుతున్నారు.
ఎంతో అల్లరిగా సరదాగా ఉండే నా శ్యాం అలా అయిపోతాడు అని కలలో కూడా ఊహించలేదు దు.

నేను ధైర్యం విడకుండా, ఆయనకు దగ్గర ఉండి తినిపించడం దగ్గరుండి నిద్రపుచ్చడం కబుర్లు చెబుతూ, ఆయనకు నచ్చిన పాట పాడుతూ, ఒక చిన్న బాబు మాదిరి చూసుకునే దాన్ని.

కానీ ఆయన నిద్దట్లో నుంచి మేల్కొని, స్వాతీ నాక్కూడా కరోనా
వస్తుందేమో అని భయంగా ఉంది అంటూ ఆందోళన చెందేవారు..

లేదు శ్యామ్ నీది భయం మాత్రమే చూడు కరోనా ని మలి వయసు వారు జయించారు, గర్భవతులు కూడా జయించి తమ బిడ్డలకు జన్మనిచ్చారు. అలాంటి వారిని కాపాడే మన డాక్టర్స్ ఎంత గొప్పవారు కదా.

మరి నీలా డాక్టర్స్ కూడా భయంతో వాళ్లకు వైద్యం చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు శ్యాం అంటుంది స్వాతి.

అలా రోజు నేను శ్యామ్ లోని భయాన్ని పారద్రోలే ప్రయత్నం చేసేదాన్ని. శ్యామ్ కుఇష్టమైనవి చేసేదాన్ని, ఒకవైపు నా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూనే శ్యామ్ ని కంటికి రెప్పలా ప్రతి క్షణం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసేదాన్ని. ఎట్టిపరిస్థితిలోనూ నా సహనాన్ని నేను కోల్పోలేదు.

వారం తర్వాత నేను కిచెన్ లో ఉండగా శ్యామ్ వెనుకనుండి వచ్చి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత బెడ్ రూమ్ లోకి ఎత్తుకుని తీసుకువెళ్లాడు. నేను అడ్డు చెప్పలేదు గంట తర్వాత ఎప్పట్లా మామూలుగా అల్లరి చేయడం మొదలుపెట్టాడు. ఆ క్షణం లో శ్యామ్ ని మునుపటిలా చూసేసరికి నాకు ఆనందంలో ఏడుపు ఆగలేదు.

నేను ఏడుస్తుంటే శ్యామ్ నన్ను మళ్ళీ గట్టిగా కౌగలించుకుని ఊరుకో స్వాతి ఇప్పుడు ఏమైందని నీ ప్రేమతో నన్ను మళ్ళీ మామూలు శ్యామ్ గా మార్చావు. అంటూ మళ్లీ నన్ను అల్లుకు పోయాడు. తన చిలిపి చేష్టలతో.

ఇదండీ మా కధ. ఆ చీకటి వెనకాల గదిలోనుండి అంటే భయం గుప్పెట్లో నుండి నేను మా వారిని ఈ రకంగా అంటే కొంచెం ఓర్పు సహనం, ప్రేమతో ఆయనను మరల మామూలు స్థితికి తీసుకు రాగలిగాను.

ఇక ఉంటాను సెలవు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!