నువ్వు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: మాధవి కాళ్ల
నువ్వు నాకు ఎప్పుడు దూరంగా ఉండాలని
నన్ను ఇంత బాధ పడ్డానికి నువ్వే కారణం.
నీతో నా పెళ్లి జరిగిన తర్వాత ,
ఇలా నా జీవితం గడుపుతూ ,
నీతో గడిపిన ప్రతి క్షణం ,
కాలం నాకు తెలియకుండా సాగిపోయింది.
నువ్వు నన్ను వదిలిన క్షణం నుంచి
నీ జ్ఞాపకాలతో గడుపుతూ
నా జీవితాన్ని ఒంటరిగా బ్రతుకుతున్నా.
నీ జ్ఞాపకాలు నన్ను అసలు వదలడం లేదు.
నీ ఫోటో చూస్తే నీ మాటలే గుర్తుకు వస్తున్నాయి.
నా చిరునవ్వులో నువ్వే కనిపిస్తున్నావు.
నీ కోసం నేను ఎంత బాధపడిన ,
నువ్వు తిరిగి రావు కదా.
నన్ను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయావు.